Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home information

LIC Yuva Credit Life Policy : రూ.5వేలు క‌డితే చాలు, ఎల్ఐసీలో రూ.50 ల‌క్ష‌ల క‌వరేజీ.. ప్లాన్ ఏంటంటే..?

Admin by Admin
February 5, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

LIC Yuva Credit Life Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోని పౌరుల కోసం అనేక స్కీమ్‌ల‌ను అందుబాటులో ఉంచింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను కూడా ప్ర‌వేశ‌పెడుతోంది. దేశంలోని ఉత్త‌మ ఇన్సూరెన్స్ కంపెనీల్లో LIC ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సంస్థ విశ్వ‌స‌నీయ‌త‌కు పేరెన్నిక గ‌న్న‌ది. ఇక ఇందులో LIC యువ క్రెడిట్ లైఫ్ ఒక పాల‌సీ అందుబాటులో ఉంది. ఈ పాల‌సీని తీసుకుంటే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఇక దీని వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

LIC యువ క్రెడిట్ లైఫ్ పాల‌సీని 18 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారు తీసుకోవ‌చ్చు. ఈ పాల‌సీ క‌నీస మెచూరిటీ వ్య‌వ‌ధి 23 ఏళ్లు, గ‌రిష్టంగా 75 ఏళ్ల వ‌ర‌కు పెట్టుకోవ‌చ్చు. ఈ పాల‌సీ తీసుకున్న త‌రువాత పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి స‌మ‌యంలో పాల‌సీ హోల్డ‌ర్ చ‌నిపోతే అత‌ని నామినీకి రూ.50 ల‌క్ష‌లు వ‌స్తాయి. దీంతో ఆ మొత్తాన్ని లోన్లు చెల్లించేందుకు ఉప‌యోగించుకోవ‌చ్చు. పాల‌సీ హోల్డ‌ర్ పేరిట హోమ్ లోన్‌, గోల్డ్ లోన్‌, ప‌ర్స‌న‌ల్ లోన్‌, క్రెడిట్ కార్డు లోన్ వంటివి ఉంటే ఈ పాల‌సీ క‌వ‌రేజీ ద్వారా వ‌చ్చే మొత్తంతో ఆ లోన్ల‌ను చెల్లింవ‌చ్చు. ఇలా ఈ పాల‌సీ ప‌నిచేస్తుంది.

LIC Yuva Credit Life Policy complete details and benefits

4 ర‌కాలుగా ప్రీమియంలు..

అయితే ఈ పాల‌సీలో 4 ర‌కాలుగా ప్రీమియంను చెల్లించ‌వ‌చ్చు. 5 నుంచి 30 ఏల్ల కాల వ్య‌వ‌ధికి పాల‌సీ తీసుకుంటే సింగిల్ ప్రీమియం చెల్లిస్తే చాలు. 10 నుంచి 30 ఏళ్ల పాల‌సీ ట‌ర్మ్ అయితే 5 ఏళ్ల వ‌ర‌కు ప్రీమియం చెల్లించాలి. అదే 15 నుంచి 30 ఏళ్ల పాల‌సీ ట‌ర్మ్ అయితే ప్రీమియంను 10 ఏళ్ల వ‌ర‌కు చెల్లించాలి. 25 నుంచి 30 ఏళ్ల వ‌కు పాల‌సీ ట‌ర్మ్ ఉంటే 15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. ఈ ప్రీమియంను ఏడాదికి ఒక‌సారి లేదా 6 నెల‌ల‌కు ఒక‌సారి క‌ట్ట‌వ‌చ్చు.

అయితే ఈ పాల‌సీ ట‌ర్మ్ పాల‌సీ కాదు. ఈ పాల‌సీని తీసుకున్న త‌రువాత ఒకవేళ పాల‌సీ హోల్డ‌ర్ దుర‌దృష్ట‌వ‌శాత్తూ చ‌నిపోతే అప్పుడు అత‌ని పేరిట ఉన్న లోన్ల‌ను చెల్లించే భారం అత‌ని కుటుంబంపై ప‌డ‌దు. ఈ పాల‌సీ క‌వ‌రేజి కింద వ‌చ్చే మొత్తంతో ఆ లోన్ల‌ను చెల్లించ‌వ‌చ్చు. అందువల్ల ఈ పాల‌సీ ఇలాంటి వాటికి ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక పాల‌సీ గ‌డువు ముగిసిన త‌రువాత పాల‌సీ హోల్డ‌ర్‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం ల‌భించ‌దు. కానీ పాల‌సీని ముందే స‌రెండ‌ర్ చేస్తే అత‌ను చెల్లించిన మొత్తం ప్రీమియాన్ని తిరిగిచ్చేస్తారు. ఇలా ఈ పాల‌సీ ప‌నిచేస్తుంది.

రూ.50 ల‌క్ష‌ల క‌వరేజీ..

ఇక ఉదాహ‌ర‌ణ‌కు 20 ఏళ్ల ఒక వ్య‌క్తి ఈ పాల‌సీని 25 ఏళ్ల కాలానికి గాను తీసుకుంటే అత‌నికి క‌వ‌రేజీ రూ.50 ల‌క్ష‌లు ల‌భిస్తుంది. ప్రీమియం రూ.4850 చెల్లించాలి. ఇది 15 ఏళ్ల కాలానికి వ‌ర్తిస్తుంది. ఇలా ఈ పాల‌సీకి ప్రీమియంను చెల్లింవ‌చ్చు. అయితే వ్య‌క్తి వ‌య‌స్సు, పాల‌సీ ట‌ర్మ్‌ను బ‌ట్టి కూడా ప్రీమియం మారుతుంది. ఇక ఈ పాల‌సీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లో అయితే licindia.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పాల‌సీని కొన‌వ‌చ్చు. అయితే ఆన్‌లైన్‌లో ఈ పాల‌సీని డిజి క్రెడిట్ లైఫ్ పేరిట అందుబాటులో ఉంచారు. ఆఫ్‌లైన్‌లో అయితే ఇదే పాల‌సీని యువ క్రెడిట్ లైఫ్ పేరిట పొంద‌వ‌చ్చు. ఇలా ఈ పాల‌సీతో ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది.

Tags: lic
Previous Post

మీరు భోజనం ఎలా చేస్తారు? నేల మీద కూర్చోనా? కుర్చిమీద కూర్చోనా? నిలబడా?

Next Post

Mahila Samman Saving Certificate Scheme : ఈ ప‌థ‌కంలో మ‌హిళ‌లు చేరితే చాలు.. 2 ఏళ్ల త‌రువాత రూ.2.32 ల‌క్ష‌లు ఇలా పొంద‌వ‌చ్చు..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.