Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తీసుకున్నారంటే.. బెడ్ మీద కేక పెట్టాల్సిందే..!

Admin by Admin
December 6, 2021
in హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఒత్తిడి, ఇత‌ర ఆందోళ‌న‌లు, మానసిక స‌మ‌స్య‌ల కార‌ణంగా శృంగార జీవితాన్ని అనుభ‌వించ‌లేక‌పోతున్నారు. వాస్త‌వానికి శృంగారం కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. దీని వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. డిప్రెష‌న్ దూర‌మ‌వుతుంది. అందువ‌ల్ల శృంగారంలో త‌ర‌చూ పాల్గొనాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో బెడ్ మీద కేక పెట్ట‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

take these foods daily to get more that power

1. అరటిపండు

శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా ట్రిప్టోఫాన్, అమైనో యాసిడ్లు కూడా అరటి పండ్లలో ఎక్కువే. ఇవి ఆందోళనను తగ్గించడంతోపాటు మంచి మూడ్‌లోకి తీసుకువచ్చేందుకు ఉపయోగపడతాయి. అరటి పండ్లలో ఉండే పొటాషియం శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందువ‌ల్ల రోజువారీ ఆహారంలో అర‌టి పండ్లను తింటుంటే శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. ప‌డ‌క‌గ‌దిలో రెచ్చిపోవ‌చ్చు.

2. పీనట్ బటర్

పీన‌ట్ బ‌ట‌ర్ మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. ఇది వేరుశెన‌గ‌ల నుంచి త‌యార‌వుతుంది. దీన్ని కొంద‌రు అనారోగ్య‌క‌ర‌మైందిగా భావిస్తారు. కానీ అది త‌ప్పు. ఇది పూర్తిగా ఆరోగ్య‌క‌ర‌మైంది. దీన్ని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డొప‌మైన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో శృంగారంలో పాల్గొనాల‌నే కోరిక పెరుగుతుంది. ఇందులో జింక్ ఎక్కువగా ఉండడం వల్ల శృంగార‌ సామర్థ్యం పెరగడంతోపాటు వీర్యంలో నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

3. బీట్‌రూట్ జ్యూస్

పింక్ కలర్‌లో కనిపించే బీట్‌రూట్‌ను తినేందుకు చాలా మంది అయిష్టతను ప్రదర్శిస్తారు. కానీ దీన్ని తినడం వల్ల స్త్రీ, పురుషులిద్దరికీ శృంగార పరంగా అనేక లాభాలు కలుగుతాయి. శృంగార‌ సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది. క‌నుక బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవాలి. నేరుగా తిన‌డం ఇష్టం లేక‌పోతే జ్యూస్ రూపంలో అయినా రోజూ క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు.

4. ఎర్ర ద్రాక్ష‌

నిత్యం ఒక గుప్పెడు ఎర్ర ద్రాక్ష పండ్లను తింటే చాలు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార పరంగా వచ్చే సమస్యలు పోతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల మగవారిలో వీర్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీని వ‌ల్ల సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

5. ఓట్ మీల్

నిత్యం ఒక కప్పు ఓట్ మీల్‌ను తింటే మగవారిలో శృంగార సామర్థ్యం డబుల్ అవుతుంది. వీర్య నాణ్యత పెరుగుతుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శృంగారం పరంగా ఫిట్ అవుతారు.

6. కాఫీ

శృంగారానికి ముందు దంపతులిద్దరూ ఒక కప్పు కాఫీ తాగితే దాంతో ఒత్తిడి, ఆందోళన మాయమవడమే కాదు, ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఈ విష‌యాన్ని సైంటిస్టులే చెబుతున్నారు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార వాంఛను పెంచడంలో కాఫీ తోడ్పడుతుంది.

7. బీన్స్‌

బీన్స్‌లో ప్రోటీన్స్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీన్స్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటున్నా స్త్రీ, పురుషులు తమకు కలిగే శృంగార సమస్యలను దూరం చేసుకోవచ్చు.

8. నిమ్మజాతి పండ్లు

నారింజ, ద్రాక్ష, గ్రేప్ ఫ్రూట్ వంటి నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తింటుంటే దాంతో విటమిన్ సి ఎక్కువగా అందుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గానూ పనిచేస్తుంది. స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.

9. బ్రౌన్ రైస్

బియ్యాన్ని పాలిష్ చేసి తెల్లగా ఉంటేనే మనం దాన్ని ఎక్కువగా ఇష్ట పడతాం. కానీ అలా కాకుండా ముడి రూపంలో ఉన్న బ్రౌన్ రైస్‌ను తింటే దాంతో శృంగార శక్తి పెరుగుతుంది. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన్నా అలసిపోరు. నాడులను ఉత్తేజం చేస్తుంది.

10. యాపిల్స్

యాపిల్ పండ్లలో ఫెనిలెథిలమైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దీంతో జననావయవాలకు రక్తం బాగా సరఫరా అయి శృంగార వాంఛ కలుగుతుంది. అందువ‌ల్ల రోజూ యాపిల్ పండ్ల‌ను తినాలి.

11. సోయాబీన్

సోయాబీన్‌లో వృక్ష సంబంధ స‌మ్మేళ‌నాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మహిళల్లో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ క్ర‌మంలో వారిలో శృంగార వాంఛ, సామర్థ్యం పెరుగుతాయి. మగవారిలో అయితే వీర్య నాణ్యత పెరుగుతుంది. దీని వ‌ల్ల సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి.

12. డ్రై ఫ్రూట్స్

శరీరానికి కావల్సిన ఉత్తేజాన్ని, శక్తిని అందించే గుణంతోపాటు డ్రై ఫ్రూట్స్‌కు శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణం కూడా ఉంది. నిత్యం ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ను తింటే దాంతో పోష‌కాలు ల‌భించ‌డ‌మే కాదు, లైంగికంగా మంచి పవర్ కూడా వస్తుంది.

13. గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది మగవారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా వారు శృంగార ప‌రంగా ఎక్కువ శ‌క్తిని పొందుతారు. అంతేకాదు మగవారిలో వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది. స్త్రీలలో రుతు క్రమం కూడా సరిగ్గా ఉంటుంది. దీంతో సంతానం పొందే అవకాశాలు మెరుగు ప‌డ‌తాయి.

14. మొక్కజొన్న

ఫైబర్, మినరల్స్, మాంగనీస్ వంటి పోషకాలు మొక్కజొన్నలో ఎక్కువగా ఉంటాయి. ఇవి స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. క‌నుక మొక్క‌జొన్న‌ను త‌ర‌చూ తీసుకుంటూ ఉండాలి. దీంతో ప‌డ‌క‌గ‌దిలో రెచ్చిపోవ‌చ్చు. ఈ విధంగా ఆయా ఆహారాల‌ను తీసుకుంటే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Tags: healthy foods
Previous Post

Health Tips : మ‌ట్టి కుండ‌ల్లోనే వంట‌లు వండుకోవాలి.. ఎందుకో తెలుసా..?

Next Post

శుభ‌వార్త‌.. దేశంలో స‌గం మంది పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్నారు..!

Related Posts

హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025
హెల్త్ టిప్స్

మీరు బాదం పప్పు డైరెక్ట్ గా తింటునారా?..ఇకపై నీటిలో నానపెట్టి తినండి.. ఎందుకంటే!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.