Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

ఒక కూతురు తన తండ్రిని అడిగిన ప్రశ్న…బార్బీ బొమ్మ పుట్టుక వెనకున్న ఆసక్తికర కథ ఇదే..!

Admin by Admin
February 28, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బార్బీడాల్..అందరికీ ఇష్టమైన బొమ్మ..కూతురు పుట్టిందనగానే బార్బీడాల్ గిఫ్ట్ గా ఇచ్చేవారు కొందరైతే..ఎదిగిన అమ్మాయిల్ని బార్బీడాల్ తో పోల్చేవారు మరికొందరు.రకరకాల ఆకారాల్లో దిరికే బార్బీ బొమ్మ చూడగానే అందర్ని ఆకర్శిస్తుంది అందులో డౌటే లేదు..కానీ ఒకమ్మాయికి మాత్రం బార్బీని చూడగానే ఆ బొమ్మ తన రంగులో ఎందుకులేదు అనే సందేహం కలిగింది..కలిగిన వెంటనే వాళ్ల నాన్నని అదే ప్రశ్న వేసింది..ఇది చాలా సిల్లీ థింగ్ గా అనిపించినా…ఆలోచించాల్సిన విషయమే..ఆ పాప ప్రశ్న ఫలితమే ఆఫ్రికన్ బార్బీ పుట్టుక….

నైజీరియాలోని ఒకోయా ప్రాంతంలోని టౌఫిక్ అనే వ్యక్తి, తన కూతురు అడిగిన ప్రశ్నకు స్థాణువైపోయాడు. ఈ టాయ్స్ అన్నీ మనలాగా ఎందుకు లేవు డాడీ అని అడిగింది. ఆ ప్రశ్నకు యథాలాపంగా ఏదో ఒక సమాధానం ఇవ్వచ్చు. కానీ టౌఫిక్ అలా మానిపులేట్ చేయాలనుకోలేదు. నిజమే తన కూతురు అడిగిన ప్రశ్న చాలా తీవ్రమైంది. భిన్న జాతులున్న నైజీరియాలో ఇదొక సున్నితమైన అంశం.పిల్లలు ఆడుకునే బార్బీ బొమ్మలన్నీ ఆల్మోస్ట్ తెల్లగానే ఉంటాయి. ఏ క్యారెక్టర్ చూసినా మిల్కీ స్కిన్. ఆ మాటకొస్తే ప్రపంచంలో 30 శాతం మంది మాత్రమే తెలుపు రంగులో ఉంటారు. మిగతా 70 శాతం బ్లాక్, బ్రౌన్ స్కిన్. అయినా సరే, థర్టీ పర్సెంట్ వైట్ టోనే భూమండలాన్ని డామినేట్ చేస్తోంది.

the story behind african barbie doll

ప్రపంచ వ్యాప్తంగా తెల్లతోలునే ఎందుకు ఆరాధించాలి. ఎందుకు అభిమానించాలి. బొమ్మయినా ఇంకేదైనా..! తమకంటూ ఒక ఐడెంటిటీ ఉండొద్దా? అట్లీస్ట్ నైజీరియన్ కిడ్స్ మాదిరిగా ఒక్క బొమ్మయినా ఎందుకు లేదు? టౌఫిక్ ఆలోచనల్లో అంతర్మథనం మొదలైంది. ఆ సంఘర్షణల్లోంచే క్వీన్ ఆఫ్ ఆఫ్రికా నల్లగా నిగనిగలాడుతూ అద్దాల అల్మరాల్లో నిలబడింది.ఆలోచన అద్భుతం.. ఆచరణ ఇంకా అద్భుతం.. ఆఫ్రికన్ బొమ్మ తమజాతి వారందరికీ కనెక్ట్ అయింది. మిల్కీ స్కిన్ వెల్లువలో పడి కొట్టుకుపోతున్న ప్రపంచానికి కాఫీటోన్ మాంచి కిక్ ఇచ్చింది టాల్, షార్ట్, స్కినీ, కర్వీ, షార్ట్ హెయిర్డ్, లాంగ్ హెయిర్డ్.. సోకాల్డ్ బార్బీ బొమ్మల ముఖచిత్రమే మారిపోయింది.2007లో టాయ్స్ బిజినెస్ మొదలు పెట్టాడు. మొదట్లో అందరూ పెదవి విరిచారు. ఇవేం బొమ్మలు నల్లగా ఉన్నాయి అని షాప్ ఓనర్లు వాటిని తీసుకోడానికి తటపటాయించారు. వాళ్లను కన్విన్స్ చేయడానికి రెండేళ్లు పట్టింది. ఎన్నో రకాల క్యాంపెయిన్లు చేసిన తర్వాత, ప్రాడక్ట్ మార్కెట్లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు….ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ ఆఫ్రికన్ బార్బీదే డామినేషన్.

ఇక్కడ ఇంకోమాట..ఆఫ్రికన్ బార్బీ బొమ్మల తయారీలో స్త్రీలకే పెద్దపీట వేశాడు టౌఫిక్. వాళ్లకు ఆర్ధికంగా చేయూత అందివ్వడం కోసం ప్రత్యేకంగా స్థానిక మహిళలకే అవకాశం ఇచ్చాడు.

Tags: african barbie doll
Previous Post

మన్కడింగ్ అవుట్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా.? మన్కడింగ్ ఎవరంటే..!!

Next Post

తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో క‌రెక్ట్‌గా తెలియ‌జేస్తుంది ఈ సంఘ‌ట‌న‌. రియ‌ల్ స్టోరీ..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.