Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

పదిలో అత్తెసరు మార్కులు.. ప్రిలిమ్స్ లో పది సార్లు ఫెయిల్ అయినా కూడా..?

Admin by Admin
March 14, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక సాధారణ విధ్యార్థి ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అవ్వుతున్నాడంటే అందరూ ఎందుకురా అని ఈజీగా హేళన చేస్తారు. ఎందుకంటే డిగ్రీ వరకు ఏదో పాస్‌ మార్కులు సంపాదించుకున్నవాడు ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ ఎగ్జామ్‌కి ప్రిపేరవ్వడం అంటే అంత ఈజీ కాదు. చిన్న చిన్న కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపరైతే బెటర్‌ కదా అని అంతా సలహలిచ్చేస్తారు. కానీ అతడు మాత్రం కష్టతరమైన సివిల్స్‌ ఎగ్జామ్‌నే ఎంచుకున్నాడు. అయితే అతడు అందులో సక్సస్‌ అయ్యాడా అంటే. బిహార్‌కి చెందిన అవనీష్‌ శరణ్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అతడు చదువులో అంత మెరిట్‌ విద్యార్థి కాదు. పదోతరగతిలో జస్ట్‌ 44.7% అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. ఇక ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌లలో కూడా జస్ట్‌ కొద్దిపాటి ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో పాసయ్యాడంతే.

తాను సాధారణ విద్యార్థినే అని తెలిసి కూడా యూపీఎస్సీ లాంటి పెద్ద లక్ష్యాన్ని చేధించాలని పెట్టుకోవడం విశేషం. ఏ మాత్రం తన వల్ల అవుతుందా..? అనే అనుమానానికి తావివ్వకుండా ప్రయత్నించేందుకు సిద్ధమయ్యాడు. పోనీ అలా అని విజయం అంత ఈజీగా వరించిందా అంటే లేదు. అయితే ఇక్కడ అవనీష్‌ జస్ట్‌ రాష్ట్రంలో నిర్వహించే కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్‌ చూస్తే నోట మాటరాదు. ఒకటి, రెండు.. మూడు సార్లు కాదు ఏకంగా పదిసార్లు రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్స్‌ ప్రిలిమ్స్‌లో పెయిల్‌ అయ్యాడు. అయినా సరే ఏదో తెలియని మొండి పట్టుదల, ఎలాగైన సాధించాలన్న కసి.. అతడిని సివిల్స్‌కి ప్రిపేరయ్యేలా పురిగొల్పింది. ఆ పట్టుదలే అతడిని అందర్నీ షాక్‌కి గురిచేసేలా అద్వితీయమైన విజయాన్ని అందుకునేలా చేశాయి.

do you know this normal student passed in civils

స్టేట్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో నెగ్గుకురాలేని వ్యక్తి ఏకంగా యూపీఎస్సీ సివిల్స్‌లో ఆల్‌ ఇండియా 77వ ర్యాంకు సాధించగలిగాడు. అతడు రెండో ప్రయత్నంలో ఈ ఘన విజయాన్ని అందుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి నిష్క్రమించాడు. అలా అతను 2009లో ఐఏఎస్‌ అయ్యి.. సామాన్య విద్యార్థి కూడా అద్భుతమైన సక్సస్‌ని అందుకోగలడని ప్రూవ్‌ చేశాడు.

ప్రస్తుతం అవనీష్‌ చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మన సామర్థ్యం తక్కువే అని అయినా..ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించిన తెగువ ఉంటే..సామాన్యుడు సైతం అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోగలా సత్తాని సొంతం చేసుకోగలడు అని నిరూపించాడు. ఎందరికో కనువిప్పు కలిగించేలా స్ఫూర్తిగా నిలిచాడు.

Tags: avaneesh
Previous Post

మొకాళ్ళ నొప్పులకు ఖచ్చితమైన్ ఫలితాన్ని ఇచ్చె గృహ చికిత్స వుందా?

Next Post

మీ కిడ్నీలను శుభ్రం చేసుకోవడానికి దివ్యౌషదం. మీ ఇంట్లో మీరే తయారు చేసుకోవ‌చ్చు..

Related Posts

ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.