Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

ఆంజ‌నేయ స్వామికి కొడుకు ఉన్నాడు తెలుసా..? ఆయ‌న పేరు ఏమిటి.. ఏం చేస్తాడు..?

Admin by Admin
March 18, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆంజనేయుడు.. హనుమంతుడు.. ఇలా ఏ పేరున పిలిచినా అందరికీ అభయహస్తం ఇచ్చి కాపాడే భక్తవశ్యుడు రామదాసుడు. అయితే హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉన్నాడు. అ విషయాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.. ఆ విశేషాలు తెలుసుకుందాం… శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా… అతని తోకకు నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగివెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు. హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్లిపోతాడు. కొన్నాళ్లకి పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది.

మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజురడు అని పేరు పెడతాడు మైరావణుడు. అంతేకాదు! అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు. రోజులు గడుస్తున్నాయి. రామరావణుల మధ్య రాయబారాలు బెడిసికొట్టడంతో యుద్ధం మొదలైంది. యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పైచేయి కాసాగింది. దీంతో కంగారుపడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు. ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ అర్థించాడు.

do you know lord hanuman had a son named makaradhwaj

రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపోయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. వారిరువురినీ బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు. దానికి తాను హనుమంతుని కుమారుడినని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. ఆపై అతని జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనియ్యదు. కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేననీ, ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చిచెబుతాడు మకరధ్వజుడు. తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు. తన కుమారుని స్వామిభక్తికి అచ్చెరువొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు.

సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు. ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాములవారు, అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకేగుతారు. అందండీ సంగతీ.

Tags: makaradhwaj
Previous Post

ఈ ప్రాంత వాసులు రాక్ష‌సిని దేవ‌త‌గా పూజిస్తారు.. ఎందుకో తెలుసా..?

Next Post

ఈ దుంప‌ని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

వార్త‌లు

Gandaki Patram : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో పెరిగే చెట్టు ఇది.. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా..?

by D
July 7, 2023

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Nela Vakudu Chettu : బ‌ట్ట‌త‌ల‌పై తిరిగి వెంట్రుక‌లు మొలిపించే మొక్క ఇది..!

by D
May 24, 2022

...

Read more
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

by Admin
August 7, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.