Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే మ‌నుషుల‌కు ఇంకో జ‌న్మ ఉండ‌దు.. నేరుగా కైలాసం చేరుతారు..

Admin by Admin
March 30, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆంధ్రదేశంలో పంచారామాలు అంటే తెలియని శివభక్తులు ఉండరు. అలాంటి పవిత్రమైన పంచారామాలలో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వర క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలు, పురాణగాథ, రవాణా సౌకర్యం తదితరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. బాలచాముండికా సమేతా అమరలింగేశ్వరుడు ఇక్కడ ప్రధానదైవం. తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి మెడలోని శివలిగాన్ని తారకాసురుడు బలంగా కొట్టడంతో అది ఐదు ముక్కలుగా విడిపోయిన ఐదు ప్రదేశాల్లో పడి దివ్వమైన పుణ్యక్షేత్రాలుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలు. అలా వాటిలో ఒకటి అమరావతిలో పడింది. అప్పటి నుండి అమరలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్న శైవక్షేత్రంగానే కాకుండా బౌద్ధ మతపరంగానూ అమరావతి ప్రఖ్యాతీ చెందినది.అమరేశ్వర ఆలయం ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబడినది. దేవేరి రాజ్యలక్ష్మీ అమ్మవారు కూడా కొలువుదీరారు, పంచప్రాకారాలు మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడినది.

ఇక్కడ శివలింగం సుమారు 15 అడుగుల ఎత్తు ఉంది. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. ఆలయంలో మూడు ప్రాకారాలు, నాలుగు దిక్కుల నాలుగు ధ్వజ స్థంభములు దక్షిణ ద్వారంలో ముఖ మండపం, తూర్పు ద్వారమునకు ఎదురుగా కృష్ణానది ఉంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మంటపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి.

amareshwara temple in amaravathi know its speciality

మందగిరిని వాసుకి సర్పంతో సముద్ర మధనం చేసిన తర్వాత అమృతం వచ్చింది కదా! అప్పుడు విష్ణుమూర్తి మోహినీ రూపం ధరించి అమృతం భాండాన్ని చేపట్టి దేవతలకు, రాక్షసులకు పంచసాగాడు. అప్పడు అమృతం దేవతలకు, రాక్షసులకు సమానంగా పంచడం లేదని తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాక్షసులు ఆందోళనలు చేశారు. త్రిపురాసురులు, నాధుల నేతృత్వంలో తపస్సు చేశారు. బోళాశంకరుడు వారి తపస్సుకు ముగ్ధుడై వరాలు ప్రసాదించాడు. దాంతో ఆ వరాలందుకున్న రాక్షుల్లో ఉత్తేజం మరింత పెరిగింది. దాంతో దేవతలను మరింత ఎక్కువగా హింసించసాగారు. దేవతలు శివుడికి మెరపెట్టుకోవడంతో శివుడు కాలరుద్రుడై రాక్షసులను వారి రాజ్యాన్ని క్షణంలో బూడిద చేసి త్రిపురాంతకుడు అయ్యాడు. ఆ సమయంలో త్రిపురాసురుడు మింగిన పెద్ద లింగం ఐదు ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడటం వల్ల ఆ ఐదు ప్రదేశాలు పంచారామాలుగా విలసిల్లుతున్నాయి.

అమరావతిలో పడిన శివలింగం భాగము ఆకాశాన్ని తాకుతుందేమో అన్నట్టు పెరగసాగింది. అది చూసిన దేవేంద్రడు శివలింగంపై తన గోరుతో పొడిచాడు.దాంతో శివలింగం పెరగడం ఆగిపోయింది. అయితే ఇంద్రుని గోరు గుచ్చుకుని శివలింగానికి రక్తం కారింది. ఆ రక్తపు చారల చిహ్నంగా ఇప్పటికీ అమరావతి క్షేత్రంలోని అమరలింగేశ్వర ఆలయంలోని శివలింగానికి గుర్తులు కనబడుతాయి. ఈ క్షేత్రములో శివుడు ప్రణవేశ్వరుడనీ, ఈ క్షేత్రములో శివుడు ప్రణవేశ్వరుడనీ, అగస్తేశ్వరుడనీ, కోసలేశ్వరుడనీ, సోమ్యేశ్వరుడనీ, పార్థివేశ్వరుడనే పేర్లతో పంచలింగాకారుడై పూజింపబడుచున్నాడు. ఏ భక్తుడైనా ఈ పుణ్యక్షేత్రములో మూడు రోజులు నివసించి కృష్ణాతీర్థములో స్నానమాచరించి అమరేశ్వరుని కొల్చినవారు మరణానంతరము శివసాయుజ్యము పొందుదురు.

శాతవాహనుల కాలంలో అమరావతీ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అప్పట్లో అమరావతి వారి రాజధాని. ఈ నగరాన్ని ధరణి కోట లేదా ధాన్యకటం అని పిలిచేవారు. ఈ పవిత్ర దేవాలయంలో అపురూపంగా మలచిన అనేక విగ్రహాలున్నాయి. అమరావతి దత్త క్షేత్రం కూడా.. కృష్ణానది చెంతన ఈ క్షేత్రం కృష్ణానదికి పక్కనే ఉంటుంది. అమరలింగేశ్వరుడిని దర్శించడానికి భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి, పునీతమై అమరేశ్వరుని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో పై అంతస్తులో అభిషేకం చేస్తారు. అమరేశ్వర లింగం ఎంతో ఎత్తుగా ఉండటానికి కింద నుండి అభిషేకం చేయడం వీలుపడదు. కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరేశ్వరాలయం దగ్గర 105కి.మీ పొడవుతో పుష్కరఘాట్ ఉంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగుతుంది ఈ ప్రదేశం. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి గుంటూరు నుండి ప్రతి 15నిముషాలకు, విజయవాడ నుండి 20 నిముషాలకు ఓ బస్సు ఉంటుంది. గుంటూరు నుండి 40 కి.మీ.ల దూరంలో కలదు. గుంటూరు, విజయవాడ, మంగళగిరిల ద్వారా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.

Tags: amareshwara temple
Previous Post

ఏ ఆకులో భోజ‌నం చేస్తే ఎలాంటి ఫ‌లితం క‌లుగుతుంది..?

Next Post

వేస‌విలో చ‌ల్ల‌ద‌నాన్ని అందించే స‌లాడ్‌.. త‌యారీ ఇలా..

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.