Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

హీరో వెంకటేష్ సీరియస్ హీరో పాత్రల నుండి కామెడీ టచ్ ఉన్న హీరో గా ఎందుకు మారారు?

Admin by Admin
April 13, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక సీనియర్ సినీ పాత్రికేయుడు యూట్యూబ్ లో సినిమా హీరోల గురించి మాట్లాడుతూ అందరిలో వెంకటేష్ కి హిట్స్ ఎక్కువ, కానీ మిగతావారిలా ప్రాపగాండా చేసుకోడు, పద్ధతిగా ఉంటాడు, అతి చేయాలి అనే ఆలోచన పెట్టుకోడు. జయాపజయాలకు స్పందించడు. స్టార్ హీరో అనే భావనతో ఉండడు.. అన్నారు. నిజమే కదా అనిపించింది. తన హిట్ సినిమాలు ప్రతి ఒక్కరినీ అలరించినవే. అయినప్పటికీ ఆవేశంగా స్పీచులు ఇస్తూనో, నేనే నంబర్ వన్ అంటూనో ఎప్పుడూ కనబడలేదు. తనకో స్టార్ డమ్ ఉందని గొప్పలు పోలేదు, స్టార్ డమ్ కు కనీస విలువ కూడా ఇవ్వలేదు. తన తర్వాతి తరం వారిని సైతం ప్రోత్సహిస్తూ వారితో సినిమాలు చేస్తూ, ఆ సినిమాలో తన ప్రాధాన్యత తగ్గినా పట్టించుకోక ముందుకు సాగిన వైనం అతడిది.

ఇదిగో ఇదే – కామెడీ టచ్ ఉన్న సినిమాల్లో అతడిని ఎంపిక చేసుకోవడానికి మొదటి కారణం. కామెడీ సినిమాల్లో హీరోయిజం ఉండదు, ఎలివేషన్లు ఉండవు, తన మీద తాను జోకులు వేసుకోవాలి, తనని తాను తగ్గించుకుని హాస్యం పండించాలి. ఆ పని వెంకటేష్ కన్నా ఎవరు బాగా చేయగలరు? రెండవది – అతడు పలికించే హావభావాలు. హాస్యాన్ని సునిశితంగా పండించడంలో అతడిది అందెవేసిన చేయి. అమాయకంగానూ కనబడగలడు, బాధితుడిలానూ కనబడగలడు. అయోమయంతో కొట్టుమిట్టాడే పాత్రలనూ పోషించగలడు. మిగతా పాత్రధారుల చేతిలో బకరాగానూ మారగలడు. ఇమేజ్ చట్రంలో చిక్కుకోకపోవడం వల్ల అలాంటి పాత్రల్లో తేలికగా ఇమిడిపోగలడు. ప్రేక్షకులను మెప్పించగలడు.

why venkatesh shifted to comedy genre

అసహజమైన తెలివితేటలున్న హీరోగా కనబడడు, మనలో ఒకడిలా కనబడతాడు. యాక్షన్ సినిమాలతోనో, మాస్ ఎలిమెంట్స్ తోనో ప్రేక్షకులకు దగ్గరవడం కష్టమైన విషయం. కామెడీ ద్వారా మొత్తం ఫ్యామిలీకి దగ్గరయ్యే అవకాశం ఉన్నప్పుడు దర్శకులు ఆ దిశగానే ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. స్టార్ డమ్ తో పాటు పైన చెప్పిన అన్ని అర్హతలు ఉన్న వెంకటేష్ అందుబాటులో ఉన్నప్పుడు దర్శకులకు రెండో ఆలోచన చేయాల్సిన అవసరం కలగదు. మూడవది – రెమ్యూనరేషన్. మిగతా నటులతో పోలిస్తే వెంకటేష్ రెమ్యునరేషన్ తక్కువే అని యూట్యూబ్ కథనాలు. పైగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెంకటేష్ స్వ‌యంగా ఆ మాటని ఒప్పుకున్నాడు. నాలుగోవది – అవసర పడని సెపరేట్ కామెడి ట్రాక్. హీరోనే కామెడి పండించగలిగితే, కామెడీ కోసం ప్రత్యేకంగా ట్రాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కనీసం కొన్ని పాత్రలు తగ్గుతాయి, తద్వారా బడ్జెట్ కూడా ఎక్కువ అవదు. కామెడీ కథలో భాగం అవుతుంది. అలా అవకాశం ఉన్నప్పుడు దర్శకులు కూడా ఆ పంథానే అనుసరిస్తారు. అవే ఆఫర్ చేస్తారు.

అడ్రినలిన్ జంకీస్ కోసం కొన్ని సినిమాలు ఉంటాయి. హీరో కత్తి పట్టుకుని చెరుకుగడను నరికినట్టు విలన్లని నరికేస్తూ ఉంటే, భీభత్సమైన బీజియంతో చెవులు చిల్లులు పడుతూ ఉంటే, నిముషానికో ఎలివేషన్ షాట్ పడుతూ ఉంటే, ఆనందించే ఆ జంకీస్ కి కూడా నచ్చే సినిమాలు వెంకటేష్ మాత్రమే చేయగలడు. స్వర్ణకమలం, శ్రీనివాస కల్యాణం, వారసుడొచ్చాడు, సుందరకాండ, బొబ్బిలి రాజా, చంటి, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా, రాజా, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి ఎన్నో హిట్ సినిమాలు. అలాంటి ఎన్నో సినిమాల్లో వెంకటేష్ పండించిన కామెడీ మరిచిపోలేనిది. వెంకటేష్ తన సినిమాలతో కొందరి మనసులు గెలుచుకుంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి నైజంతో మరింత మంది మనసు గెలుచుకున్నాడు. అలా, విక్టరీ వెంకటేష్ అందరివాడు అయ్యాడు.

Tags: Venkatesh
Previous Post

కేంద్ర మంత్రి కుమారుడు అయిన‌ప్ప‌టికీ సొంతంగా తన కాళ్ల‌పై తాను నిల‌బ‌డ్డ వ్య‌క్తి ఇత‌ను..

Next Post

ఏడు గంటలు నడిస్తే రోజుకు 28 వేల జీతం.. మతిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించిన మస్క్ కంపెనీ

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.