Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి బాధ‌లు ఉన్నా పోతాయి..

Admin by Admin
April 29, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి ఒంటిమిట్ట కోదండ రామ స్వామి..ఆంద్రా, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలం రాముల వారికి శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సపరేటు అయ్యాక ఆంద్రుల భద్రాచలం అయ్యింది.ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రం ఏకశిలానగరం అని ప్రసిద్ధి చెందింది..శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు..

కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని చెప్పుకోవచ్చారు. ఈ ప్రాంతం లో మహాభాగవతం రచయిత పోతన జన్మించిన స్థలం కూడా ఇదే కావడం విశేషం..ఆ గుడిలో ఒకే రాతి మీద సీతారామలక్ష్మణులు ఉంటారు..అందుకే ఆ ప్రాంతానికి ఏకశిలా నగరం అని పిలుస్తారు..రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణాలు చెబుతున్నాయి.

kadapa votimitta ramalayam must visit once in life

ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే అని చెప్పాలి. ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారు.ముందు గర్భాలయం నిర్మాణం, తర్వాత తూర్పు ముఖ మండపం, మూడవ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేశారు. రెండవ శిలాశాసనం ప్రకారం 1558 లో ఒంటిమిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని రధం నిర్నించటానికి, బ్రహ్మోత్సవాల నిర్వహణకు, ప్రహరీ గోడల నిర్మాణానికి వినియోగించాలని తెలిపాడు. విజయనగర చక్రవర్తి సదాశివ రాయల ముఖ్యమంత్రి గుత్తియేరా తిరుమల రాజు కుమారుడు నాగరాజదేవ నాగరాజు విరాళం అందచేసినట్లు కూడా చారిత్రక ఆధారాల మూలంగా తెలుస్తోంది..ఈ ఆలయం గురించి మాటల్లో, రాత చెప్పలేని ఎన్నో విశేషాలు ఇందులో దాగి ఉన్నాయి.

ప్రపంచంలోని అన్నీ ప్రముఖ దేవాలయాలలో కళ్యాణం పగలు చేస్తారు..కానీ ఇక్కడ మాత్రం రాత్రి చేస్తారు. అలా ఎందుకు చేస్తారు అనే సందేహం ప్రతి ఒక్కరికి రావడం సహజం.రాత్రే కల్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది..విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో..నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కధ ప్రాచుర్యంలో ఉంది.. ఈ ఆలయం కడప-తిరుపతి రహదారిపై ఉంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది. కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది. తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది. ఎప్పుడైనా కడప వెల్లినప్పుడు తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకోండి.. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బాధలు కూడా తొలగి పోతాయి..

Tags: kadapa votimitta ramalayam
Previous Post

వాస్తు ప్ర‌కారం మీ పిల్ల‌లకు స్ట‌డీ రూమ్‌ను ఇలా ఏర్పాటు చేస్తే.. మంచి ర్యాంకులు వ‌స్తాయి..

Next Post

గురువారం సాయిబాబాను ఇలా పూజిస్తే మీ ఇంట్లో ఎలాంటి చింత‌లు ఉండ‌వు..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

by Peddinti Sravya
October 21, 2024

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.