నేటిరోజులలో బరువు తగ్గించే ఆహారాల కొరకు తీవ్రంగా వెతుకులాట మొదలయింది. వీటిలో కేలరీలు ఇవ్వని, బరువు తగ్గించే ఆహారాలకు ప్రాధాన్యత కలుగుతోంది. సాధారణంగా ప్రతి ఆహార పదార్ధంలోను కొన్ని కేలరీలు వుంటాయి. వీటిని జీర్ణం చేయాలంటే శరీరం అధిక శక్తిని వినియోగించాలి. అయితే, నెగెటివ్ కేలరీలు కల ఆహారాలు తింటే…శరీరం తన శక్తిని జీర్ణక్రియకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అవేమిటో పరిశీలించండి.
ఉల్లిపాయలు – కంటిలో నీరు తెప్పించినప్పటికి ఇవి తినదగినవి. విలువకల ఔషధ పదార్ధాలు. వీటిలో వుండేది నీరు, పీచు, కేలరీలు చాలా తక్కువ. అంతేకాదు, శరీర జీవక్రియను ఇవి పెంచుతాయి. రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి. శరీరంలో శక్తి కావాలంటే ఉల్లిపాయలు తినాలి. వ్యాధి నిరోధకతను పెంచుతాయి. దోసకాయ – దీనిలో వుండే యాసిడ్లు జీర్ణక్రియను వేగం చేస్తాయి. శరీరంలో నీటిని కాపాడతాయి. కేలరీలు అతి తక్కువ. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్లు ఎ మరియు సి వుంటాయి. తొక్కతోనే దోసకాయను తింటే ఫలితాలు అధికంగా వుంటాయి.
కాలీ ఫ్లవర్ – దీనిలో రెండు గ్రాముల పీచు, 2 గ్రాముల ప్రొటీను వుండి 26 కేలరీలు మాత్రమే వుంటాయి. కొవ్వు అసలే వుండదు. కాల్షియం, ఫోలేట్, సెలీనియం, పొటాషియంలు కూడా అధికంగా వుండి యాంటీ కేన్సర్ ఆహారంగా కూడా పేరు పడింది. పుచ్చకాయ – పుచ్చకాయ తింటే ఎంతో తాజాదనం, కడుపు నింపుతుంది. ఆకలి తొలగిస్తుంది. కేలరీలు అసలే వుండవు. శరీరంలోని కొవ్వుకరిగేందుకు సహకరిస్తుంది.