రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు ఉండవలసిన దానికంటే అధికంగా వుండి డయాబెటీస్ డయాగ్నసిస్ కు చాలినంతగా లేకుంటే దానిని ప్రిడయాబెటీస్ స్టేజ్ అంటారు. ఈ దశలో వున్న డయాబెటీస్ రోగులు అతి త్వరలోనే టైప్ 2 డయాబెటీస్ మరియు గుండె సంబంధిత వ్యాధులకు, లేదా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం వుంది. ఈ ప్రిడయాబెటీస్ దశనే గ్లూకోజ్ టాలరెన్స్ ఆగిన దశగా కూడా చెపుతారు.
అయితే ఈ దశలో వున్నవారు డయాబెటీస్ వ్యాధి రాకుండా తమ రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిని నియంత్రించుకోవచ్చు. దానికిగాను అతి త్వరగా వీరు సగటున 5 నుండి 10 శాతం తమ బరువును శారీరక వ్యాయామాల ద్వారా తగ్గించుకోవాలి. అపుడు శరీరం ఇన్స్ లిన్ ఉపయోగించి ఆహారాన్ని ఎనర్జీగా మార్చేస్తుంది. మీ డాక్టర్ లేదా పోషకాహార నిపుణులు లేదా ఫిట్ నెస్ స్పెషలిస్ట్ మీ జీవన విధానాన్ని మార్చి డయాబెటీస్ వ్యాధి రాకుండా శారీరక ఆరోగ్యాన్ని కాపాడగలడు.
బ్లడ్ షుగర్ వ్యాధినే మరో పేరుగా బ్లడ్ గ్లూకోజ్ అని కూడా అంటారు. ఇది శరీరంలోని రక్తంలో ఎనర్జీని సర్కులేట్ చేస్తూవుంటుంది. ఈ బ్లడ్ గ్లూకోజ్ పరీక్షలను కనీసం నెలకొకసారైనా చేయించుకోవాలి. ఉదయం వేళ ఏ ఆహారం తినకుండి వున్నపుడు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ 80 నుండి 130 ఎంజి పర్ డిఎల్ గాను, ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత 180 కి మించకుండాను వుండాలి.