థైరాయిడ్ గ్రంధుల పనితీరు మెరుగుపరిచే ప్రాణ ముద్ర..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇది వంశ పారంప‌ర్యంగా రావ‌డ‌మే కాకుండా, పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా వ‌స్తోంది. థైరాయిడ్ ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడాల్సి ఉంటుంది. ఆహార‌పు అల‌వాట్ల‌లోనూ మార్పులు చేసుకోవాలి. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అయితే యోగాలో ఉన్న ఒక ముద్ర‌ను రోజూ 10 నిమిషాల పాటు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేస్తుండాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఇక ఆ ముద్ర ఏమిటో, దాన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాణముద్ర వేసే విధానము..

బొటన వేలు కొనతో చిటికిన వేలు, ఉంగరం వేలు కొనలను కలుపవలెను. మిగిలిన 2 వేళ్ళు నిలువుగా ఉంచాలి. ఇది వరుణ, పృథ్వి ముద్రలు కలిపి ఒకేసారి చేసే ముద్ర. ఈ రెండింటి ప్రయోజనాలు ఒకే ముద్రతో వచ్చును. నోట్: రెండు చేతులతో ఒకేసారి ఇలానే చేయాలి.

do prana mudra like this to improve thyroid levels

ప్రయోజనాలు:

ప్రాణశక్తిని పెంచి నరాల బలహీనతని పోగొట్టి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళ జబ్బులను తగ్గిస్తుంది. మధుమేహాన్ని నివారిస్తుంది. అలసట, ఆకలిదప్పులు పోగొడుతుంది. థైరాయిడ్ గ్రంధుల పనితీరును మెరుగుపరచును.

కాలపరిమితి:

కాలపరిమితి లేదు. ఎవరైనా ఏ సమయంలోనైనా సాధనచేయవచ్చు. ఎంత ఎక్కువ సేపు చేస్తే అంత మంచిది.