Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

Admin by Admin
June 13, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పై పై మెరుగులు చూసి అంచనా వెయ్యకూడదు…. ఈ రోజుల్లో బాగా చదువుకొన్న వారు కూడా ఉద్యోగం దొరక్క టిఫిన్ సెంటర్లు పెట్టుకొని, ఆటోలు నడుపుకొని చిన్న పనులు చేసుకుంటున్నారు. అందుకని ఎవరిని చులకనగా చూడకూడదు.. మిమ్మల్ని ఎక్కడో చూసాను. ఎక్కడ చూసి వుంటానో గుర్తు రావటంలేదు. అంటూ సిటీబస్ లో ఒక అమ్మాయి పలకరించింది. ఎవరా నన్ను పలకరించారని నేను అమెకేసి తలతిప్పి చూసాడతను.. ఆమె చూడ్డానికి ఎలా వుందంటే గాలివేస్తే ఎగిరిపోయేలావుంది. సన్నగా, నల్లగా, పొట్టిగా, పీలగా, పెద్ద కనుగుడ్లు ముందుకు పొడుచుకు వచ్చి తల వంచితే కనుగుడ్లు కిందకు పడిపోతాయేమో.. అన్పించేలా వున్నాయి. దానికి సాయం పళ్లెత్తు, జుట్టు తల దువ్వుకోని వాళ్లలా రింగులు తిరిగి పోయి వుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు అసలు ఆమె నచ్చలేదు తిరిగి ఆన్సర్ కూడా ఇవ్వాలన్పించలేదు నాకు.. నేను మెుహం మాడ్చుకుని చిరాకు పడుతూ నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు అనేసి తల తిప్పుకున్నాను. ఆమె పక్కసీటు ఖాళీ అయినా కూడా నేను ఆమె పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడలేదు. అలా నిలబడే వున్నాను. ఒక ప్రైవేట్ కంపెనీలో టైపిస్టుగా జాబ్ చేస్తున్నాను. గవర్నమెంటు జాబ్ కోసం గట్టి ప్రయత్నంలో వున్నాను..

ఒక ఆదివారం మా పిన్ని ఇంటికి వచ్చింది. భోజనం అయ్యేక, ఖైరతాబాద్ లో మా కజిన్ నువ్వు కూడ రావే ఇద్దరం వెళ్లి చూసి కాసేపు కూర్చుని, నేను అటు నుంచి అటు మా ఇంటికి వెళ్లి పోతాను, నువ్వు ఇంటికి వచ్చెయ్యచ్చు అంది. వదిన వాళ్ల ఆయన కూడా గవర్నమెంట్ జాబ్ లో మంచి పొజిషన్లో వున్నారు. పనిలో పనిగా నీ జాబ్ గురించి కూడా మాట్లాడదాము పద అంది.. ఆదివారం ఎక్కడకి వెళ్లడానికి ఇష్టం వుండదు. నాకు సెలవు దొరికేదే వారానికి ఒక్కరోజు. కానీ జాబ్ గురించి అనగానే కొంచెము మెత్తబడి సరే పద పిన్ని అన్నాను.. వాళ్ళ ఇంటికి వెళ్లగానే ఇల్లు చాలా అందంగా రిచ్ గా వుంది. అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుని బాగా మాట్లాడారు. నాకు అక్కడ షాక్ ఏంటంటే, బస్ లో కలిసిన అమ్మాయి అక్కడ వుంది. మా పిన్ని మా ఒదిన కూతురు అని పరిచయం చేసింది నాకు.. ఆ అమ్మాయి నవ్వుతూ ఇదివరకు రెండు సార్లు సిటీ బస్ లో చూసాను. ఎక్కడో చూసినట్టు వుంది అనుకుని ఒకసారి అడిగాను కూడా మిమ్మల్ని అంది. అప్పుడు కూడా నాకు ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలని అనిపించలేదు..

do not judge a book by its cover

అన్నయ్యా ! అందరూ ఎలా వున్నారు? ఆ మధ్యలో మీకు ఆరోగ్యం బాగా లేదని తెలిసింది. ఇప్పుడు ఎలావుంది? అని ఆ అమ్మాయి తండ్రిని మా పిన్ని అడిగింది.. నా ఆరోగ్యం సంగతి ఏముందిలే అమ్మా ! నా కూతురు ఆరోగ్యం గురించే నా బెంగంతా! చిన్నప్పుడే గుండెలో హోల్ వుందంటే ఆపరేషన్ చేయించాం. ఫరవాలేదు, బతికి బట్ట కట్టింది అనుకున్నాము. ఆరోగ్యం బాగాతేక‌ పోయినా కష్ట పడి చదివి M.S.C. పాస్ అయింది.. ఆ సమస్య తీరింది ఫరవాలేదు అనుకుంటే, ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది. కిడ్నీ ఒకటి చెడిపోయిందిట. ఎవరి కిడ్నీ సూట్ అవ్వలేదు. నా కిడ్నీ సూట్ అయింది, కానీ ఈ ఏజ్ లో మీరు కిడ్నీ ఇవ్వద్దని ఎంతమంది చెప్పినా కూడా వినకుండా మెుండిగా నా కిడ్నీ ఇచ్చాను. నా కూతురు కంటే ఏదీ ఎక్కువ కాదు నాకు. దానితో ఆ గండం గడిచింది.. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే వుంది. దాని లైఫ్ సెటిల్ అవ్వాలని నేను జాబ్ లో వాలంట్రీ రిటైర్మెంట్ తీసుకుని దానికి జాబ్ వచ్చేలా చేసాను..

ఇప్పుడు దానికి గవర్నమెంటు జాబ్ వుంది. మంచి వాడు ఎవరైనా వస్తే అన్ని విషయాలు చెప్పి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటూ ఆయన ఆయాసం తీర్చుకోవటం కోసం కొంచెం సేపు ఆగారు. అతనికి, పిన్నికి కళ్లనీళ్లు ఆగలేదు. నాకు అయితే మనసు ద్రవించి కన్నీరు వరదలా కారిపోతోంది. జీవితంలో ఇన్ని కష్టాలు వుంటాయా! ఇంత ఆవేదన వుంటుందా! నేను జీవితాన్ని ఎంత ఈజీగా తీసుకున్నాను అనుకున్నాను మనసులో.. ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ లాగా జీవితంతో పోరాడుతుంటే, నేను ఆ అమ్మాయి కళ్లు బాలేవు, పళ్ళు బాలేవని ఆలోచించాను. తల ఎత్తి ఆ అమ్మాయి వైపు చూడలేక పోయాను. ఆయనకు పాదాభి వందనాలు చేయాలన్పించింది. కూతురు కోసం ఎంత త్యాగం చేసారు. జాబ్, కిడ్నీ కూడా దానం చేసారు. ఆ తండ్రికి కూతురుగా పుట్టడం ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం.. నా జాబ్ గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడవద్దు! అని సైగ చేస్తున్నా కూడా మా పిన్ని అడిగేసింది. ఇప్పుడు నేను రిటైర్ అయ్యేను కదా! నా చేతిలో ఏముంది మా అమ్మాయితో మాట్లాడండి అన్నారు ఆయన.

వెంటనే ఆ అమ్మాయి రేపు మీ బయోడాటా తీసుకుని మా ఆఫీసుకు రండి. ఆఫీసుకు ఎలా రావాలో అన్ని వివరాలు చెప్పింది. ఆమె అతని కంటే చదువు లో ఎక్కువ, జాబ్ లో మంచి పొజిషన్ లో వుంది. ఆమె మానసికంగా చాలా దృఢంగా వుంది. ఆమె నాకంటే ఎంత వున్నతమైన స్థానం లో వుందో అర్థం అయింది. ఎన్ని శారీరక బాధలు పడుతున్నా పెదాల మీద చిరునవ్వు దూరం కాలేదు. ఇంకా ఎన్ని బాధలు పెడతావో పెట్టు అన్నట్టుగా దేవుడు తోనే సవాల్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఎవరిని చూసి అసహ్యం , చిరాకు , పొగరు, చూపించానో వాళ్ళ దగ్గరే జాబ్ కోసం చేయి చాపుతున్నాను.. మనిషిని చూసి , రూపాన్ని చూసి, ఒక అంచనాకు రాకూడదు అని గుణపాఠం నేర్చుకున్నాను. ఆమె వ్యక్తిత్వాన్ని చూసి మనసులోనే నమస్కారం చేసాను…

Tags: indian girl
Previous Post

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

Next Post

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.