పురూరవుడు, చంద్రరాజులలో మొట్టమొదటివాడు. బుధుడు, ఐలా యొక్క కుమారుడు. బుధుడు, సోమ్ (లేదా చంద్ర, చంద్రుడు), తార యొక్క కుమారుడు (నిజానికి ఈమె ఋషి, బృహస్పతి భార్య). పురూరవుడు ఒక ధైర్యవంతుడు అయిన యుద్ధవీరుడు, అసురులతో యుద్ధాల సమయంలో వారికి సహాయంగా ఉండమని ఇంద్రుడు అనేక సార్లు ఆహ్వానించాడు. ఊర్వశి, ఇంద్రుడి సభలో అప్సర ఒకసారి స్వర్గలోకంతో విసుగు చెందింది, ఆమె స్నేహితులతో పాటు ఆనందించడానికి భూమ్మీదకు వొచ్చింది. ఆమె భావోద్వేగాలు లేని స్వర్గసుఖాలతో విసుగు చెందింది, ఆమె భూలోక జీవితానికి ప్రాధాన్యమిచ్చింది. అలా భూమి మీదకు వొచ్చిన ఆమె, పురోగమన సమయంలో దేవలోకానికి తిరిగివెళ్తుండగా, ఆమెను ఒక అసురుడు అపహరించాడు.
ఊర్వశి ఇతర అప్సరసలతో స్వర్గానికి తిరిగి వొస్తున్న సమయంలో ఆమె ఒక అసురుడి చేత అపహరణకు గురైంది. ఇది చూసిన పురూరవుడు అతని రథంపై ఆ అసురుడిని వెంబడించాడు, అతని బారి నుండి ఊర్వశికి విముక్తి కలిగించాడు. ఆ సంఘటనలో వారి శరీరాలు తాకిన క్షణకాలం ఎప్పటికీ వారి జీవితాలను మార్చివేసింది. మొదటి సారి, ఊర్వశి ఒక భౌతికశరీర వెచ్చని స్పర్శను అనుభవించింది, తనలో ఒక బలమైన వాంఛ రగుల్కొంది. అదేవిధంగా, పురూరవుడిలో ఆ అప్సరస పట్ల అదే భావన కలిగింది. అయితే, ఆ భావాలు పరస్పరం కలిగాయని వారిలో ఎవరికి తెలియదు. ఒక సమయంలో ఊర్వశి లక్ష్మీ దేవిగా నటిస్తున్నప్పుడు, ఆ నాటకంలో ఊర్వశి పురుషోత్తమా అని విష్ణువుని సంభోదించవలసినప్పుడు దానికి బదులుగా ఆమె ప్రేమికుడి పేరు పురురవా అని సంభోదించింది. ఈ నాటకం పర్యవేక్షణ చేస్తున్న భారత ఋషికి ఆగ్రహం తెప్పించింది, అతను ఆమెను భూలోకానికి వెళ్లి అతనితో ఉండమని, అతనిద్వారా సంతానం పొందమని శపించాడు.
పూర్తిగా పురూరవుడి ప్రేమలో మునిగిపోయిన ఆమె ఋషి శాపాన్ని పట్టించుకోలేదు. ఇంకోవైపు స్వర్గలోకసుందరి తనకోసం, తన ప్రేమకోసం దిగి వొస్తుందని ఊహించని పురూరవుడు విచారంగా ఉన్నాడు. తన భార్యకు సంతానయోగం లేదని అతను చాలా విచారంలో మునిగి ఉన్నాడు. ఈ సమయంలో, ఊర్వశి పురూరవుడి కోసం వొచ్చింది, ఇద్దరూ ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు. ఊర్వశి జీవితాంతం పురురవుడితో కలిసి ఉండటానికి అంగీకరించింది. కానీ ఆమె కొన్ని నిబంధనలను పెట్టింది. అందులో మొదటి నిబంధన ఆమెతో పాటు రెండు మేకలు తెచ్చుకుంటానని, వాటి భద్రత విషయంలో పూర్తిగా రాజే బాధ్యతా వహించాలని. రెండవ నిబంధన ఆమె భూమిపై నివసించిన సమయంలో, ఆమె కాచిన వెన్న (నెయ్యి) మాత్రమే ఆహారంగా తీసుకుంటానని, మూడవ నిబంధన వారు శృంగార సమయంలోతప్ప ఒకరిఒకరు నగ్నంగా కనపడకూడదని.
ఈ నిబంధనలు ఇద్దరిలో ఎవరు అధిగమించినా ఆ క్షణంలోనే ఊర్వశి పురురవుడిని వొదిలి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోతానని చెప్పింది. పురూరవుడు అన్ని నిబంధనలను అంగీకరించాడు, వారు గంధమదన్ తోటలో కలిసి నివసించటం ప్రారంభించారు. దేవతల కుట్ర మరోవైపు, ఊర్వశి, పురూరవుడి మధ్య ప్రేమ దేవతలకు చాలా అసూయగా మారింది. స్వర్గలోకం ఊర్వశి లేకుండా చాలా మందకొడిగా కనిపించింది. కాబట్టి, ఊర్వశిని రప్పించాలని వారు ఒక పన్నాగం పన్నటానికి నిశ్చయించుకున్నారు. చివరకు ఒక రాత్రి గంధర్వులు మేకలను దూరంగా తీసుకెళ్ళారు. మేకలు మే మే అని అరవటం ప్రారంభించాయి, ఊర్వశి విచారంతో,వెంటనే వెళ్ళి వాటిని రక్షించమని రాజును కోరింది. ఆ సమయంలో పురూరవుడు నగ్నంగా ఉన్నాడు. నిద్రలోనుండి ఉలిక్కిపడి లేచాడు. ఆ సమయంలో, గంధర్వులు స్వర్గం నుంచి కాంతిని పురూరవుడు, ఊర్వశి మీద ప్రసరింప చేయటంచేత, వారిద్దరూ ఒకరికొకరు నగ్నంగా చూసుకున్నారు. మూడవ నిబంధన అధిగమించబడింది, దీనివలన ఊర్వశి స్వర్గానికి వెళ్ళే సమయం ఆసన్నమయింది. భారమయిన హృదయంతో, ఆమె కలత చెంది చిత్తరువై నిలబడి ఉన్న రాజువైపు తిరిగింది. ఆ సమయంలో, ఊర్వశి పురూరవుడి సంతానాన్ని మోస్తున్నది. ఆమె ఒక సంవత్సరం తరువాత కురుక్షేత్ర ప్రాంతసమీపానికి రాజును వొచ్చి అతని సంతానాన్ని తీసుకోమని కోరింది. తరువాత, ఇతర సంఘటనలు జరిగి ఊర్వశి భూమిమీదకు మళ్లీ మళ్లీ వొచ్చింది, పురూరవుడితో చాలా సంతానాన్ని పొందింది.