రాత్రివేళ నిద్రించేందుకు 3 లేదా 4 గంటల ముందుగా ఆహారం తీసుకోవాలి. మరి సరిగ్గా నిద్రించే సమయానికి కడుపులో ఆకలి వేస్తుంది. అటువంటపుడు ఏదైనా తినాలని అనిపిస్తుంది. మరి ఆ సమయంలో తినేవి తేలికగా జీర్ణం అయ్యేవిగాను, ఆరోగ్యకరమైన స్నాక్స్ గాను వుండాలి. కనుక అటువంటపుడు రెడీగా రిఫ్రిజిరేటర్లో కొన్ని ఆహారాలు పెట్టుకుంటే, తేలికగా వాటిని తిని పడుకోవచ్చు. అవి ఎలా వుండాలో చూడండి. ఆపిల్, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష వంటి పోషక విలువలు కల పండ్లు రిఫ్రిజిరేటర్ లో వుంచితే, ఎక్కువ శ్రమ లేకుండా వాటిని తినేయవచ్చు. అర్ధరాత్రే కాదు, బయటకు త్వరగా వెళ్ళాల్సిన సమయంలో లేదా ఇతర స్నాక్స్ తయారీకి బద్ధకమనిపించినపుడు, వీటిని తినేయవచ్చు.
కేరట్లు, టమాటాలు వంటివి కడుపునింపటమేకాదు రుచికరంగా కూడా వుంటాయి. కేలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ కనుక వీటిని రాత్రి నిద్రించేముందు కూడా తినేయవచ్చు. ఆహారం తక్కువనుకున్నపుడు వెన్నతీసిన పాలు తాగండి. వీటిలో కేలరీలు వుండవు. కాల్షియం అధికం. ఆరోగ్యకర ఆహారం అంటే, పాలు దానితో పండ్లు తీసుకుంటే కడుపు నిండిపోతుంది. పెరుగును సలాడ్ తయారీకి లేదా నేరుగా తినటానికి కూడా ఉపయోగించవచ్చు.
ఉదయంవేళ ఆఫీస్ లేదా స్కూలు కు ఆలస్యమైందనుకుంటే కొద్దిపాటి ఉప్పు లేదా పంచదార వేసిన పెరుగు ఎంతో కడుపు నింపుతుంది. రుచిగా కూడా వుంటుంది. రిఫ్రిజిరేటర్ లో నిమ్మకాయలు ఎపుడూ వుండాలి. అవి కొవ్వు కరిగించటమే కాదు. తినే ఆహారాలలో మంచి రుచినిస్తాయి. లేదా నిమ్మరసం నేరుగా తాగేయవచ్చు కూడాను. పై ఆహారాలు ప్రతివారూ తమ రిఫ్రిజిరేటర్ లో వుంచుకుంటే అవసరాన్నిబట్టి ఆరోగ్యకరంగా తినవచ్చు.