Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Crime News

ఈమె చేసిన ప‌ని ఏంటో తెలిస్తే.. బ్యాంకులో డ‌బ్బులు వేయాలంటేనే భ‌య‌ప‌డ‌తారు..!

Admin by Admin
June 23, 2025
in Crime News, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాక్షి……. అనే అమ్మాయి రాజస్థాన్ లో కోటలోని ICICI బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్. ఆమె కస్టమర్ల FD ఖాతాలను వారికి తెలియకుండా క్లోజ్ చేసి ₹4,58,00,000 అంటే నాలుగు కోట్ల 58 లక్షలు విత్‌డ్రా చేసింది. ఆమె కస్టమర్‌లకు విత్ డ్రాస్ గురించి తెలియకుండా అంటే వారికి నోటిఫికేషన్‌లను వెళ్లకుండా వారు ఖాతాలకు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లను ముందుగానే మార్చింది. సాక్షి…… దాదాపు రెండున్నర సంవత్సరాల కాలంలో 41 మంది కస్టమర్లకు చెందిన 110 కి పైగా ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆమె 31 మంది కస్టమర్ల ఎఫ్‌డీలను గడువుకు ముందే మూసివేసి, రూ. 1 కోటి 34 లక్షల 90 వేలను అనధికార ఖాతాలకు బదిలీ చేసింది. ఆమె ఇది కాక రూ. 3 లక్షల 40 వేల వ్యక్తిగత రుణం కూడా తీసుకుందట. విచారణలో తేలింది ఏమిటీ అంటే, బ్యాంకు కస్టమర్లు వచ్చినప్పుడు తమ ఖాతాలకు ఉన్న మొబైల్ నెంబర్ మార్చడానికి రిక్వెస్ట్ చేసే ఫారమ్‌ల మీద వాళ్ళ సంతకం తీసుకుని, ఆమె తమ కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్‌లను అక్కడ రాసింది. దాని వల్ల ఈమె కష్టమర్స్ FD లు రద్దు చేసినా లేక అకౌంట్స్ నుండి డబ్బులు డ్రా చేసినా వారి అసలు మొబైల్ నెంబర్ కి మెసేజ్ లు వెళ్ళేవి కాదు.

ఆమె ఖాతాదారుల ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసి, దానిని తన సొంత ఖాతాలోనూ, ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసింది. ఇంత డబ్బు ఏం చేసింది? ఆమె స్టాక్ మార్కెట్‌లో ఆ డబ్బు పెట్టుబడి పెట్టింది కానీ మొత్తం నష్టాలు వచ్చాయట. ఈమె ఈ పని ఎలా చేసింది? తెలిసో తెలియకో ఆ బ్యాంక్ తోటి ఉద్యోగులు, కష్టమర్స్ ఆమెకు ఎలా సహకరించారో, దీనిలో ఎవరి ఎవరి తప్పు ఎంత వరకు ఉంది, ఇటువంటివి మన ఖాతాలలో జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎలా అనేది విశ్లేషిద్దాం. ఖాతాలలో పేర్ల మార్పు, అడ్రెస్ మార్పు, మొబైల్ నెంబర్ మార్పు, ఆధార్ లేదా పాన్ నెంబర్ మార్పు వంటి అతి ముఖ్యమైన మార్పులు సాధారణంగా అన్ని బ్యాంకులు ఆన్ లైన్ లో చేయడానికి ఒప్పుకోవు. స్వయంగా బ్యాంక్ కి వెళ్లి అప్లికేషను నింపి సంతకం చేసి ఇస్తేనే మార్పులు చేస్తాయి. అలాగే ఖాతాలో ఇటువంటి ముఖ్యమైన మార్పులు మేనేజర్ తో సహా ఏ ఒక్క అధికారి చేయలేడు.

do you know what she has done with customers fd money

ఇటువంటి ముఖ్యమైన మార్పులు కంప్యూటర్ లో చేయడానికి కనీసం ఇద్దరు అధికారుల ఆధరైజేషన్ అవసరం. ఒకరు ఎంటర్ చేస్తే వేరొకరు చెక్ చేసి అథరైజ్ చేస్తారు. ఇలా మీరు మీ ఖాతాలో మీ మొబైల్ నెంబర్ మార్చుకున్నట్లు మీరు మెయిల్ id బ్యాంక్ కి ఇచ్చి ఉంటే దానికి మెసేజ్ కూడా వెళ్తుంది. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే… అథరైజ్ చేయవలసిన రెండో ఆఫీసర్ కేవలం మొబైల్ నెంబర్ మార్చాలి అనే అప్లికేషను చూసి, మొబైల్ నెంబర్ కరెక్టు గా ఉందొ లేదో, సంతకం సరిపోయిందో లేదో చూసి అథరైజ్ చేసేసాడు అన్న మాట. అలా కాకుండా కస్టమర్ ని పిలిచి మీరు మొబైల్ నెంబర్ మారుస్తున్నారా? అని అడిగి అథరైజ్ చేసి ఉంటే ఈ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉండకపోవును. అందుకే బ్యాంక్ లో పని చేస్తున్న అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక కష్టమర్స్ తప్పులు. ఫారం దేనికో, ఏం రాసి ఉందో చూడకుండా గుడ్డిగా నమ్మి సంతకం చేయడం.

పూర్వం బ్యాంక్ వ్యవహారాలు చేసున్నప్పుడు బ్యాంక్ నుండి తరుచుగా మెసేజి లు వస్తూ ఉండగా ఇప్పుడు సడెన్ గా మెసేజిలు రావడం ఆగిపోతే బ్యాంక్ ని సంప్రదించకుండా మౌనంగా ఉండిపోవడంతో ఆమె నెలల తరబడి ఫ్రాడ్ చేసుకునే అవకాశం ఇచ్చినట్లు అయింది. సరే! ఇటువంటి ఫ్రాడ్స్ మన ఖాతాల్లో జరగకుండా మనం ఏం చేయాలి. ఇప్పుడు ప్రతీ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ఇస్తున్నాయి. దాని నుండి దాదాపు అన్ని వ్యవహారాలు చేసుకోవచ్చును. కానీ, కొందరు రిస్క్ అని లేదా ఉపయోగించడం రాదు అని ఈ మొబైల్ అప్లికేషను ఉపయోగించడం లేదు. కానీ మొబైల్ అప్లికేషను ఉంచుకుంటే దానిలో మన ఖాతాల వివరాలు , ఫిక్సడ్ డిపాజిట్లు, లోన్లు వివరాలు అన్ని మనకు అరచేతిలో తెలిసిపోతాయి. మనకు మొబైల్ అప్లికేషను ఉపయోగించడం భయం అయితే, మొబైల్ అప్లికేషను డౌన్ లోడ్ చేసుకుని ఖాతా వివరాలు చూసుకునే వెసులుబాటు మాత్రం ఉంచుకుని, వ్యవహారాలు చేయవలసిన పాస్ వర్డ్ అసలు పెట్టకండి.

బ్యాంక్ వాళ్ళు మాత్రమే కాదు ఎవరైనాఏదైనా ఫారం లేదా రాసివున్న కాగితం ఇచ్చి సంతకం చేయమంటే పైన ఏమి రాసివుందో అంతా చదవకపోయినా కనీసం ముఖ్య అంశాలు చదివి సంతకం పెట్టడం అలవాటు చేసుకోవాలి. చిన్న అక్షరాలు చదవలేక పోతే అక్కడ బ్యాంక్ స్టాఫ్ కాకుండా మరో కస్టమర్ సాయం తీసుకోండి. వీళ్ళ అజాగ్రత్త ఆ అమ్మాయి ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఇచ్చింది. బ్యాంక్ నుండి మొబైల్ కి వచ్చిన ప్రతీ మెసేజ్ పూర్తిగా చదవడం అలవాటు చేసుకుని, ఉపయోగం లేని మెసేజ్ లు డిలీట్ చేసి అవసరమైనవి ఉంచుకోండి. బయటకు వెళ్తున్నప్పుడు అవసరం లేకపోయినా వారానికో పది రోజులకో ఒకసారి ATM కి వెళ్లి అకౌంట్ బాలన్స్ చెక్ చేసుకోండి. కుదిరితే మినీ స్టేట్మెంట్ డౌన్ల్లోడ్ చేసుకుని దాన్లో ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోండి. మ‌న అప్రమత్తతే మనకు బ్యాంక్ కు కూడా రక్షణ.

Tags: icici bank
Previous Post

చరిత్రలో ఎపుడైనా ఒక దేశాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసిన సంఘటన ఉందా?

Next Post

డ‌యాబెటిస్ వ్యాధిలో రోగిదే ముఖ్య పాత్ర‌..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.