Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడు నెమ‌లి ఫించం ధ‌రించ‌డం వెనుక ఉన్న క‌థ ఇదా..!

Admin by Admin
June 27, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శ్రీకృష్ణుడి అందం వర్ణనాతీతం, తన ముగ్ధమనోహరమైన రూపంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు. కృష్ణుడి అందాన్ని రెట్టింపు చేసేది తన కిరీటం అందులోని నెమలి ఈక. కృష్ణుడి విలక్షణమైన అలంకారం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెమలి ఈకలు స్వచ్చత, సంపద, అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు. నెమలి ఈక ప్రాముఖ్యత గురించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీత వనవాసంలో ఉన్న సమయంలో దాహం వేసింది. అప్పుడు రాముడిని నీరు కావాలని అడిగిందట. అప్పుడు శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు. అకస్మాత్తుగా వారి ముందు అందమైన నెమలి కనిపించింది. నీరు ఎక్కడో ఉందో తెలుసు తనని అనుసరించమని మార్గనిర్దేశం చేస్తానని చెప్తుంది. దీంతో రాముడు, సీత నెమలిని అనుసరించారు. అడవిలోని వంకర మార్గాల గుండా వెళ్తున్నప్పుడు నెమలి వారికి దారి కనిపించడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది.

ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ నెమలి మాత్రం తన ఈకలను వదలడం కొనసాగిస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది. చివరగా వాళ్ళు అందమైన పూదోటకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళు తమ దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకున్నారు. కానీ నెమలి మాత్రం నేలపై పడిపోయి చనిపోయింది. దాని ఈకలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. నెమలి నిస్వార్థమైన త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు నీ దయ ధైర్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలి ఈకను ధరించాడని చెబుతారు. శ్రీకృష్ణుడు తల మీద నెమలి ఈక ధరించడం వెనుక మరెన్నో కథలు కూడా ఉన్నాయి. ఒక నమ్మకం ప్రకారం రాధ తన జ్ఞాపకంగా కృష్ణుడికి నెమలి ఈక ఇచ్చిందని చెబుతారు. అందుకే రాధ మీద ప్రేమతో దాన్ని తల మీద పెట్టుకున్నాడని అంటారు.

this is the reason why lord sri krishna wears peacock feather

అది మాత్రమే కాదు నెమలి దేవుడైన శ్రీకృష్ణుడి భక్తికి సంబంధించిన సంజ్ఞగా భావిస్తారు. అలాగే బలరాముడు దాన్ని తమ్ముడు కృష్ణుడికి ప్రేమగా ఇచ్చాడని మరి కొందరి నమ్మకం. శ్రీకృష్ణుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయి వేణు గానం వాయిస్తూ ఉన్నాడు. వేణువు నుంచి వచ్చే మధురమైన సంగీతానికి పులకించిపోయి నెమళ్లు కృష్ణుడి చుట్టూ చేరాయి. సంగీతానికి తగ్గట్టుగా కృష్ణుడు నాట్యం చేస్తూ ఉండగా ఆయన అడుగులు గమనించి నెమళ్లు కూడా పురివిప్పి నాట్యం ఆడాయి. అలా నెమళ్ళకు నాట్యం నేర్పిన గురువుగా శ్రీకృష్ణుడు మారాడు. తమకు నాట్యం నేర్పినందుకు గురు దక్షిణగా నెమలి పింఛం ఇచ్చాయి. దాన్ని కృష్ణుడు తల‌ మీద ధరించాడు. ఇది కృష్ణుడి రూపాన్ని మరింత అందంగా మార్చింది. పవిత్రమైన పక్షి నెమలిగా హిందువులు భావిస్తారు. అందుకే చాలా మంది నెమలి ఈకలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఇవి ఉంటే అదృష్టం, సంపద ఉన్నట్టేనని భావిస్తారు.

Tags: Lord Sri Krishna
Previous Post

బాహుబ‌లి రెండు పార్ట్‌లు చేసిన‌న్ని రోజులు ప్ర‌భాస్ ఎన్ని క‌ష్టాలు ప‌డ్డాడో తెలుసా..? చేతిలో చిల్లిగ‌వ్వ లేద‌ట‌.!?

Next Post

త‌న త‌ల్లి త‌ల‌నే నరికిన ప‌ర‌శురాముడు.. ఆయ‌న అలా ఎందుకు చేశాడంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.