Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

విగ్ర‌హారాధ‌న ఎందుకు చెయ్యాలి..?

Admin by Admin
June 28, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ లోకంలో ఎంతో మంది ఆత్మజ్ఞానము కలిగిన వారు ఉన్నారు. ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు కామ్యకర్మలను ఆసక్తితో చేస్తుంటారు. వివిధ రూపాలతో, నామాలతో, దేవుళ్లను పూజిస్తుంటారు. అటువంటి వారిని చూసి జ్ఞానులు, వాళ్లు సక్రమ మార్గంలో లేరని చెప్పకూడదు. అలా చేస్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు. జ్ఞానులు అయిన వాళ్లు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి, అజ్ఞానులకు చూపించి, వారికి నచ్చచెప్పి, వారితో నిష్కామ కర్మలను చేయించాలి. వారికి మార్గదర్శకులు కావాలి ఇక్కడ పరమాత్మ మరొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాడు. ఇందాక చెప్పినట్టు లోకంలో జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వారే కాదు, అజ్ఞానులు అంటే ఏమీ తెలియని వారు, తెలిసీ తెలియని వారు కూడా ఉంటారు.

అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయడంలో నిమగ్నమయి ఉంటారు. అలాంటప్పుడు, జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల నమ్మకాలను పాడు చేయకూడదు. వారి నమ్మకాలను మూఢనమ్మకాలని కొట్టి పారేయకూడదు. క్రమక్రమంగా వారికి నచ్చచెప్పాలి, వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలి. అలాకాకుండా, ఒక్కసారిగా వారు చేసేది తప్పు అని ఖండిస్తే వారు దిక్కుతోచని వారైపోతారు. ఎందుకంటే ప్రతి వాడు కూడా నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం నేను అనుభవిస్తాను అనే నమ్మకంతోనే కర్మలు చేస్తాడు. వాడి నమ్మకాన్ని జ్ఞాని తుంచేయకూడదు. మరి ఏం చేయాలి అని అందరికీ సందేహం వస్తుంది. అంటే అజ్ఞాని చేసే కర్మలనే జ్ఞాని ఫలాపేక్షరహితంగా, స్వార్ధరహితంగా ముందు తాను చేస్తూ, అజ్ఞానిని కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహించాలి. అప్పుడు అజ్ఞాని కూడా స్వార్ధం లేకుండా కర్మలు చేస్తాడు.

why we need to do pooja to god

అజ్ఞానులు నిష్కామ కర్మతత్వము తెలియక, తాము చేసేది మంచిది అనే భావనతో, శ్రద్ధతో, ఎంతో కొంత ప్రతిఫలం ఆశించి, కర్మలు చేస్తుంటారు. అన్నీ తెలిసిన వాడు వెంటనే నీవు చేసేది తప్పు, నీకు పాపం వస్తుంది అని మొహం మీద చెప్పకూడదు. అలా చెబితే అజ్ఞానులు నీకేం తెలియదు పో అనే వారు కూడా ఉంటారు. మరి కొందరు అసలు కర్మలు చేయడమే మానేస్తారు. మరి కొందరు రెచ్చిపోయి ఇంకా స్వార్ధపూరిత కర్మలు చేస్తారు. దానితో అంతా రసాభాస అవుతుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు అలా చేయకూడదు. తాను మాత్రము ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి, శ్రద్ధతో, ఓర్పుతో వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాలి. వారు చేసే కర్మలనే తాను అనాసక్తంగా, స్వార్ధరహితంగా, ఫలం ఆశించ కుండా చేసి, దాని వలన కలిగే లాభాలను వారికి తెలియబరచి, వారిని కూడా ఆ విధంగా చేయడానికి ప్రోత్సహించాలి. జ్ఞానులు చేసే కర్మలను చూచి, దాని వలన వచ్చే మంచి ఫలితములను గ్రహించి, అజ్ఞానులు కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు. మంచి మార్గంలో నడుస్తారు. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసాడు. కేవలం ఉపన్యాసాలు ఇచ్చి తెలియని వారి మనసులు పాడుచేయకుండా, తాను ఆచరించి ఇతరులచేత ఆచరింపజేయడం మంచిది అని స్పష్టంగా చెప్పాడు.

మరి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు తత్వమును బోధించే వాళ్లు ఇలా ఎందుకు చెబుతున్నారు. వాళ్లకు తెలియదా అంటే అన్నీ తెలుసు. కానీ, ఎవరికి, ఏ విషయాన్ని, ఏసమయంలో ఎలా బోధించాలో తెలియదు అంతే. మన వేదాలలో శాస్త్రాలలో అన్నీ చెప్పారు. విగ్రహారాధన, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ చెప్పారు. ఆత్మతత్వము, నిర్గుణ బ్రహ్మము, నిర్గుణారాధన, మానసిక పూజ, ఓంకారము, ధ్యానము, మనసును ఆత్మలో సంయోగం చేయడం. ఇవి కూడా చెప్పారు. ఇవన్నీ నిర్దిష్టమైన పద్ధతిలో చేయాలి. ఒకటి వెంబడి ఒకటిగా చేయాలి. మనకు చదువు నేర్పేటప్పుడు, ఒకటో క్లాసునుండి పదవ తరగతి వరకు వివిధ విషయాలు చెబుతారు. ఇంటర్ ఇటు స్కూలు విద్య, అటు కాలేజీ విద్యకు అనుసంధానంగా పాఠాలు చెబుతారు. తరువాత కాలేజీ విద్య చెబుతారు. తరువాత మాస్టర్ విద్యచెబుతారు. ఇలా అంశాల వారీగా చెబుతారు అంతేకానీ ఒకే సారి యం.ఏ. పిహెచ్.డి విద్య పదేళ్ల వయసులో చెప్పరు. అలాగే ఎం.ఏ పాసయిన వాడు, రెండో తరగతి విద్యార్థికి పాఠం చెప్పేటప్పుడు తన ఎం. ఏ విద్యను ప్రదర్శించకూడా, రెండో తరగతి విద్యార్ధి స్థాయికి తగ్గట్టుగా చెప్పి క్రమక్రమంగా వాడిని వృద్ధిలోకి తీసుకురావాలి.

అలాగే ముందు మనసు నిలవడానికి విగ్రహారాధన, సంధ్యావందనము, పూజలు, వ్రతాలు, దేవాలయాలు, ఉత్సవాలు చేయమన్నారు. ఏమీ తెలియని వారిని అలాగే చేయమనాలి. అప్పుడు వారికి దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. వారి మనసు దైవం మీదికి మళ్లుతుంది. మనసు దైవం మీద నిలకడగా ఉంటుంది. అప్పుడు నిర్గుణారాధన, మానసిక పూజ ఆత్మను గురించి బోధించాలి. తరువాత మోక్షం కొరకు ప్రయత్నించాలి. ఇది కూడా జ్ఞానులు ముందు తాము మనస్ఫూర్తిగా, యుక్తమైన మనసుతో శ్రద్ధగా, ఆచరించి ఇతరులు కూడా తాము చేసిన విధంగా చేయమని ప్రోత్సహించాలి. అంతేకానీ విగ్రహారాధన పనికిరాదు, పూజలు వ్రతాలు దండగ అని మొదలుపెడితే వాళ్లు అటు పూజలు చెయ్యడం మానేస్తారు. ఇటు ధ్యానం చేయడం చేత కాదు. రెండింటికి చెడ్డవారు అవుతారు. అదే ఓ శ్లోకంలో వివరించాడు పరమాత్మ.

Tags: Pooja To God
Previous Post

బ్ర‌హ్మ దేవుడికి 5వ త‌ల ఉండేద‌ని మీకు తెలుసా..? మ‌రి దానికేమైంది..?

Next Post

ఒక‌ప్పుడు పాండ‌వులు అడిగిన 5 ఊర్లు ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాయో, వాటి పేర్లు ఏమిటో తెలుసా..?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.