టమాటాలను మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. వీటిని వేస్తే వంటలకు చక్కని రుచి, రంగు వస్తాయి. టమాటాలను నేరుగా పచ్చిగా సలాడ్ రూపంలోనూ తింటారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టమాటాలను తినకూడదని వైద్యులు చెబుతుంటారు. అలాంటి వారు టమాటాలకు ప్రత్యామ్నాయంగా పలు ఆహారాలను తినవచ్చు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్ర క్యాప్సికంని మీరు టమాటాలకి బదులుగా వాడొచ్చు. సాండ్విచ్, సలాడ్ వంటి వాటిలో మీరు టమాటాలకి బదులుగా ఎర్ర క్యాప్సికం ఉపయోగించవచ్చు. ఎర్ర క్యాప్సికంలని టమాటాలాగాపేస్ట్ చేసి కొంచెం షుగర్ కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి మీరు టమాటాలని ఉపయోగించుకోవచ్చు.
పెరుగుని కూడా మీరు టమాటా లాగ ప్యూరీ కింద వాడుకోవచ్చు. పెరుగుని మీరు కూరల్లో వేస్తే టమాటాలు వేయడం వలన గ్రేవీ చిక్కగా వచ్చినట్లు పెరుగు వలన కూడా చిక్కగా గ్రేవీ వస్తుంది కాబట్టి మీరు టమాటాలు లేకుండానే ఇలా వండుకోవచ్చు. టమాటా రుచి లాగ మీకు మంచి ఫ్లేవర్ కావాలంటే మీరు కూర అంతా చేసుకుని టమాటా ప్యూరీకి బదులుగా కెచప్ ని కొంచెం వేసుకోండి.
మీరు టమాటా కి బదులుగా ఆ ఫ్లేవర్ కోసం గుమ్మడికాయని ఉపయోగించవచ్చు గుమ్మడికాయని ఉపయోగిస్తే స్వీట్ గా ఉంటుంది. అలానే టెక్స్చర్ ఉంటుంది. చింతపండు గుజ్జు మీరు టమాటాలకి బదులుగా వేస్తే ఆ పుల్లటి రుచి వస్తుంది. పుల్లటి రుచి కోసం పచ్చి మామిడి కూడా బాగానే ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇలా టమాటాలకి బదులుగా వీటిని ఉపయోగిస్తే రుచి కూడా బాగా ఉంటుంది.