Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home business ideas

Business Idea : కోడి ఈక‌లతో కోట్లు సంపాదిస్తున్నారు.. ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Admin by Admin
October 22, 2024
in business ideas, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Business Idea : నేటి యువత ప్రతి విషయంలోనూ కొత్త ఆలోచనతో ముందుకు దూసుకుపోతున్నారు. ఎందుకు పనికిరావు అనే వస్తువులతోనే కొత్త ఆలోచనలతో కొత్త ప్రయోగాలు చేస్తూ తమ ప్రతిభను చాటి చెబుతున్నారు. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది అనే పదాన్ని తరచూ వింటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఆలోచనే వాస్తవరూపం దాల్చితే ఎలా ఉంటుంది అనేదానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు చెప్పబోయే విషయం.

జైపూర్‌కు చెందిన ముదిత, రాధేష్ దంపతులు కోడి ఈకలతో ఒక వినూత్న ప్రయత్నం ప్రారంభించారు. కోడి ఈకలతో దుస్తులు తయారుచేసి కోట్ల రూపాయల‌ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొదట్లో వీరి ఐడియాను చూసి వెక్కిరించినవారే ఆశ్చర్యపోయేలా చేశారు ఈ దంపతులు. ఒకరోజు రాధేష్ ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ పొరుగున ఉన్న ఓ చికెన్ దుకాణంలో నిలబడి ఉండగా, కోడి ఈకలను చేతితో తాకాడు రాధేష్. అనుకోకుండా అతడికి ఓ ఆలోచన మెదడులో మెదిలింది. తనకి వచ్చిన ఆలోచన గురించి ముదితతో చెప్పగా.. ఇద్దరూ కలిసి వెంటనే దానిని ప్రాజెక్ట్ గా మొదలుపెట్టారు. తమకు వచ్చిన ఐడియాతో ఇద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించారు.

this couple doing business with hen quill

జైపూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ లలో రాధేష్ తో కలిసి ముదిత ఎంఏ చేస్తున్నప్పుడు వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారుచేసే దానిపై ప్రాజెక్టు చేశారు. కాలేజీలో చదవుతున్నప్పుడు వచ్చిన ఈ ఆలోచనను వ్యాపారంగా మార్చి.. ఆలోచనను ఆచరణలో పెట్టి కోట్ల రూపాయలు సంపాదించడం అంత తేలికగా అయ్యే పనికాదు. రాధేష్ కి వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మధ్యలో పరిస్థితులు కూడా అనుకూలించలేదు. అయినా సరే తాము అనుకున్న లక్ష్యం సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తూ కోడి ఈకలతో దుస్తులు తయారుచేస్తూ ఏకంగా ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు ఈ దంప‌తులు కోట్లలో టర్నోవర్ ని సొంతం చేసుకున్నారు. అయితే వారి ఆలోచన కార్యరూపం దాల్చడానికి సుమారు 8 సంవత్సరాల‌ సమయం పట్టింది.

2010లో ప్రారంభమైన రాధేష్ ఆలోచన 2018లో కార్యరూపం దాల్చింది. దీనికోసం వారు ఎంతో కష్టపడ్డారు. వాస్తవానికి రాధేష్ కుటుంబం పూర్తి శాకాహరులు. దీంతో రాధేష్ కుటుంబ సభ్యులు ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిరాకరించారు. అంతేకాకుండా వ్యాపార పనులకు సంబంధించి ఎలాంటి సహకారం కూడా కుటుంబం నుంచి అందలేదు. ఆ సమయంలో ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాధేష్. అయినా సరే ఇబ్బందులు పడుతూనే తమ లక్ష్యం సాధించడానికి ముందుకు అడుగులు వేశారు రాధేష్, ముదిత దంపతులు.

గతంలో కోడి ఈకలతో దుస్తులు తయారుచేసే వ్యాపారాన్ని ఎవరూ చేసిన దాఖలాలు కూడా ఎక్కడలేవు. బుక్స్, ఇంటర్నెట్ లోనూ దానికి సంబంధించిన సమాచారం కూడా లేదు. అయితే ఎంతో రీసెర్చ్ తర్వాత కోడి ఈకలను దుస్తులుగా మార్చే ఒక పద్ధతిని కనుగొన్నారు రాధేష్ దంపతులు. అయితే కోడి ఈకలను ఉపయోగించి దుస్తులు తయారుచేయడం వరకు వారి ఆలోచన బాగానే ఉంది. ఆ తర్వాతే రాధేష్ దంపతులకు అసలు సమస్య మొదలైంది. తయారుచేసిన దుస్తుల అమ్ముడుపోవడం అనేది వీరికి కష్టతరంగా మారింది. సాధారణంగా కోడి ఈకలతో తయారుచేసిన దుస్తులంటే ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే కోడి ఈకలతో తయారుచేసిన శాలువాలకు మన దేశంతో పోలిస్తే విదేశాల్లో అధిక డిమాండ్ ఉందని తెలుసుకుని అప్పటి నుంచి వారి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమైన రాధేష్ ఆలోచన ఇప్పుడు ఓ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. గడిచిన రెండేళ్లలో ఐదు కోట్లకు పైగా వ్యాపారం చేయగా.. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఆదాయం రూ.2.5 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు 1200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కళాశాల స్థాయిలో పుట్టిన ఒక ఆలోచన నేడు వందలాది మందికి ఉపాధి కల్పించి రాధేష్ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాధేష్ కి సంబంధించిన ఈ పరిశ్రమ విషయం బయటకు రావడంతో న్యూస్ లో హాట్ టాపిక్ గా మారింది.

Tags: clotheshen quill
Previous Post

D-Mart : డి-మార్ట్ ఎంత తెలివిగా వ్యాపారం చేస్తుందో తెలుసా.. ధ‌ర త‌క్కువ ఎందుకు, ఆదాయం ఎలా వ‌స్తుంది..?

Next Post

Number One Movie : సూప‌ర్ స్టార్ కృష్ణ నెంబ‌ర్ వ‌న్ మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

Related Posts

ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.