Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

విజ‌య‌వాడ ద‌గ్గ‌ర‌లో ఉన్న ఈ గుహాల‌యాల గురించి మీకు తెలుసా..?

Admin by Admin
March 24, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

గుహాలయాలు.. అద్భుత కట్టడాలు. ఆధునిక సాంకేతికతనే చాలెంజ్‌ చేసే విధంగా వేల ఏండ్ల కిందట నిర్మించిన గుహలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రసిద్ధి చెంది ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అతి సమీపాన ఉన్న నాలుగు అంతస్తుల గుహాలయాల గురించి తెలుసుకుందాం.. ఉండవల్లి అంటే తెలుగువారందరికీ గుర్తు వచ్చేవి గుహాలయాలు. మామూలుగా చూసే వాళ్ళకి వీటి కోసం ఇంత దూరం రావాలా అనిపించవచ్చు. కానీ ఒకే పర్వతాన్ని గుహలుగా మలచటమే కాదు, దాన్లో దేవతా ప్రతిమలతోబాటు దాదాపు 20 అడుగుల ఏక శిలా అనంత పద్మనాభస్వామి, నాభిలో బ్రహ్మ, చుట్టూ దేవతా మూర్తులతో సహా చెక్కిన శిల్పుల చాతుర్యం చూడ గలిగినవారు అద్భుతం అంటారు.ఒకే పర్వతాన్ని తొలచి 4 అంతస్తులుగా మలచారు ఈ గుహలని. మొదటి అంతస్తు బయట ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. పైకి వెళ్తున్న కొద్దీ చిన్నవైన ఈ గుహలు పైన ఖాళీగానే వున్నాయి. కింద అంతస్తులో తాపసులు, భిక్షువులు కూర్చునేందుకు వీలుగా స్తంభాల మండపం వున్నది. దీని నిర్మాణం అసంపూర్తిగా వున్నది.

మొదటి అంతస్తులో నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి వున్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు వున్నాయి. రెండవ అతస్తులో 25 అడుగుల పొడవు 6 అడుగుల‌ వెడల్పుగలిగి ఒకే శిలలో చెక్కిన అనంత పద్మనాభస్వామి శయనించి వుంటారు. నాభిలో తామర పుష్పం, అందులో బ్రహ్మ, పాదాల వద్ద మధుకైటభులనే రాక్షసులు, పక్కన విష్ణు వాహనమైన గరుత్మంతుడు, తపస్సు చేస్తున్న ఋషులు, ఇంకా అనేక విగ్రహాలున్నాయి. రాతిలో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి వుండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత. ఇక్కడ‌ కొండలో రాతిని మలచి ఈ విగ్రహాన్ని చెక్కారు. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి. మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం. వీటిలో విగ్రహాలేమీ వుండవు. 14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహాలయాలు 3 లేక 7 వ శతాబ్దం నాటి విష్ణుకుండినుల కాలానివనీ, క్రీ.శ. 1343 లో అన్నారెడ్డి కుమారుడు పంచమ రెడ్డి అనంత పద్మనాభునికి అనేక కానుకలు ఇచ్చినట్లు తెలుస్తున్నది.

do you know about undavalli caves

గుహాలయాలనుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయంటారు. పూర్వం ఈ మార్గాలగుండా రాజులు శత్రు రాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంటారు. ఇక్కడ వున్న ఒక సొరంగ మార్గం మూత పడి, పూడి పోయి వుంది. కొంత కాలం క్రితం పురావస్తు శాఖవారు ఈ ప్రాంతంలో త్రవ్వకాలు సాగించినప్పుడు కొన్ని బౌధ్ధమత చిహ్నాలు, శిల్పాలు బయట పడ్డాయి. దానితో ఒకప్పుడు ఈ కొండపై భాగాన బౌధ్ధారామాలు విలసిల్లాయంటారు. విజయవాడకి 2 కి.మీ.ల దూరంలో వున్న ఈ గుహలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి – పెనుమాక గ్రామాల మధ్య వున్నాయి. విజయవాడనుంచి, గుంటూరు నుంచి బస్సు సౌకర్యం వున్నది. పెద్దపెద్ద క్రేన్‌లు, పరికరాలు లేని సమయంలోనే ఇటువంటి నిర్మాణాలు ఎలా నిర్మించారో అనే విషయం నేటికి అర్థం కాని విషయం. వారి సాంకేతికత నేటికి అంతుచిక్కని రహస్యంగా మిగిలింది.

Tags: undavalli caves
Previous Post

పూరి ఫస్ట్ మూవీనే ప్లాప్ అన్నారు.. బద్రి సినిమా గురించి ఆసక్తికర విషయాలు..!

Next Post

న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం ఈ నంబ‌ర్ల‌ను దుర‌దృష్ట‌మైన‌విగా భావిస్తారు..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.