Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చింది ?? దాని వెనుక ఉన్న కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Admin by Admin
February 18, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు . కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి అందులో ఒక‌టి హనుమంతుడు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ?? వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అన్న పేరు కూడా లేకపోలేదు. ఇక ఆంజనేయుడు బాల్యం నుంచీ చిలిపివాడే. అసలే, నిమిషమైనా కుదురుగా ఉండలేని వానరజీవి. దానికి తోడు శివుని తేజము, వాయుదేవుని అంశ, కేసరి శక్తి ఉండనే ఉన్నాయి. దాంతో ఆయనను పట్టడం సాధ్యమయ్యేది కాదు.

ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది. ఎర్రగా, గుండ్రంగా, తళతళలాడిపోతూ ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు ఆంజనీపుత్రుడు. వాయువేగంతో సూర్యుని వైపు దూసుకుపోయాడు. వాయుదేవునికి తన కుమారుని బాల్యచేష్టను చూసి ముచ్చట వేసిందే కానీ, అందులో ఉన్న ప్రమాదం గోచరించలేదు. అందుకనే ఆంజనేయుని చుట్టూ చల్లటి గాలులను వీస్తూ, అతనికి వేడి తగలకుండా కాచుకున్నాడు. పైగా ఆ రోజు సూర్యగ్రహణం. దాంతో సూర్యుని తీక్షణత సైతం తక్కువగా ఉంది.

do you know how lord hanuman got that name

ఒకవైపు నుంచి హనుమంతుడు సూర్యుని వైపు దూసుకుపోతుంటే, మరోవైపు నుంచీ సూర్యుని చెరపట్టేందుకు రాహువు పొంచుకు రాసాగాడు. కానీ హనుమంతుని చూసిన రాహువుకి మతిపోయింది. తాను సూర్యుని భక్షించేలోపే మరో రాహువు అందుకు సిద్ధపడటం ఏమిటి? అని కంగారుపడిపోయాడు. వెంటనే వెనుతిరిగి ఇంద్రలోకం వైపు పరుగులు తీశాడు. ‘స్వామీ ఇవాళ నేను సూర్యుని గ్రహించడం సాధ్యమయ్యేట్లు లేదు! మరో జీవి ఏదో సూర్యుని భక్షించేందుకు దూసుకువస్తోంది’ అంటూ మొరపెట్టుకున్నాడు.

రాహువు మాటలు విన్న ఇంద్రునికి పట్టరాని కోపం వచ్చింది. సృష్టిధర్మానికి విరుద్ధంగా, పంచభూతాలను సైతం తోసిరాజని ముంచుకొస్తున్న ఆ ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కోవాలనుకున్నాడు. అమితశక్తిమంతమైన తన వజ్రాయుధాన్ని ఆయన మీదకు విడిచాడు. ఇంద్రుని వజ్రాయుధానికి తిరుగేముంది! అది నేరుగా ఆంజనేయుని దవడకు తగిలింది. ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్ఛిల్లాడు. కుమారుడి అవస్థ చూసిన వాయుదేవునికి చెప్పలేనంత ఆగ్రహం కలిగింది. వెంటనే ముల్లోకాల నుంచీ తన పవనాలను ఉపసంహరించుకున్నాడు. వాయువు లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఈ కల్లోలానికి కలవరపడి దేవతలంతా ఆంజనేయుని చెంతకు చేరుకున్నారు. బ్రహ్మ చేతి స్వర్శ తగలగానే ఆంజనేయుడు తిరిగి కోలుకున్నాడు. అదిగో అప్పటి నుంచీ ఆంజనేయుడు, హనుమంతుడు అన్న పేరుని సాధించాడు. ‘హను’ (దవడ) దెబ్బతిన్నది కనుక హనుమంతుడు అయ్యాడు.

Tags: lord hanuman
Previous Post

జీల‌క‌ర్ర‌తో ఎలాంటి అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసుకోండి..!

Next Post

మ‌నిషి చ‌నిపోయాక అత‌ని ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా..?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.