Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

హ‌నుమంతుడికి పుత్రుడు ఉన్నాడ‌న్న విష‌యం మీకు తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

Admin by Admin
June 22, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆశ్చర్యంగా ఉంది కదా? హనుమంతుడు బ్రహ్మచారిగానే అందరికీ తెలుసు. బ్రహ్మచారిగానే ఉండాలనుకునే వారు హనుమంతుడినే ఆదర్శంగా తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, బ్రహ్మచర్యానికి మారుపేరైన హనుమంతుడికి పుత్రుడున్నాడా? ఈ విషయంపై ఈ ఆర్టికల్ లో చెప్పుకోబడిన అంశాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. చదవండి మరి. హనుమంతుడికి కుమారుడున్నాడన్న విషయం హనుమంతుడికి కూడా యుద్దభూమికి వెళ్ళేంతవరకు తెలియదన్న విషయం ఆశ్చర్యకరమైన అంశం. యుద్ద భూమిలో ఎదురైన‌ శత్రువే తన కుమారుడని హనుమంతుడు తెలుసుకున్నాడు. మహాభారతమనే హిందూ పురాణంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన అంశాలెన్నో చెప్పబడ్డాయి. మహాభారతాన్ని చదువుతున్న కొద్దీ ఇటువంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మకరధ్వజ హనుమంతుడి కొడుకుగానే కాకుండా సాహసోపేతమైన యుద్ధ వీరుడిగా కూడా ప్రసిద్ధి.

తండ్రీ కొడుకులిద్దరూ యుద్ధభూమిలో ఒకరికొకరు ఏమవుతారో తెలుసుకోకుండా యుద్ధానికి దిగినపుడు ఏం జరిగింది. మహర్షి వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ది చెందిన కథనం ప్రకారం ఒకసారి హనుమంతుడు ఒక నదిలో స్నానమాచరిస్తుండగా అతని శరీరంలోనుంచి పుట్టిన వేడివల్ల అతని వీర్యం ఆ నదీజలాల గూండా ప్రయాణించి ఒక చేప లాంటి జీవి అయిన మకరలోకి చేరింది. ఆ తరువాత ఆ జీవి ఒక బిడ్డను ప్రసవించింది. ఆ తరువాత రావణుడి దాయాదులైన ఆహిరావణ, మహిరావణలు సగం వానర ఆకారంలో సగం చేప ఆకారంలోనున్న ఈ బిడ్డని ఆ నదీతీరంలో కనుగొన్నారు. ఆ విధంగా మకరధ్వజ జన్మించాడు. వాల్మీకి రామాయణం ప్రకారం, రామలక్ష్మణులను అహిరావణుడు పాతాళానికి తీసుకువెళ్ళినప్పుడు హనుమంతుడు వారిని కాపాడేందుకు బయలుదేరతాడు. ఇంతలో, సగం వానరం, సగం చేప ఆకారంలోనున్న మకరమనే వాడు పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి సవాల్ విసిరాడు.

do you know that lord hanuman has a son

హనుమంతుడికి కుమారుడిగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. మకరధ్వజుడు తన కుమారుడన్న విషయం తెలుసుకుని హనుమంతుడు విస్మయానికి లోనవుతాడు. తాను బ్రహ్మచారని చెప్తాడు. జరిగిన సంఘటనలన్నిటినీ ఒకసారి కళ్ళు మూసుకుని తన మనోనేత్రంతో హనుమంతుడు తెలుసుకున్నాడు. తన పుత్రుడైన మకరధ్వజుడిని హత్తుకుని ఆశీర్వాదాన్ని అందించాడు. రాక్షసుల బారినుంచి రామలక్ష్మనులను రక్షించడానికి తనకు దారిని వదలమని తనను అడ్డుకోవద్దని హనుమంతుడు తన పుత్రుడినడుగుతాడు. అయితే, మకరధ్వజుడు హనుమంతుడికి దారివ్వడానికి అంగీకరించడు. తన తండ్రని తెలిసిన తరువాత కూడా హనుమంతుడికి అడ్డు తగులుతాడు. తన యజమాని అహిరావణ అజ్ఞను ధిక్కరించడానికి మకరధ్వజుడు అంగీకరించడు. రామలక్ష్మణులు బందీలుగానున్న చోటికి చేరుకునే మార్గం తెలుసుకునేందుకు హనుమంతుడికి ఒక సమస్యను పరిష్కరించమని అడుగుతాడు.

మచ్చాను కాంబోడియాన్, థాయ్ కథనాల ప్రకారం హనుమంతుడి పుత్రుడిని మచ్చాను అని కూడా పిలుస్తారు. రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య, హనుమంతులకు మచ్చాను జన్మించాడని అంటారు. ఇంకొన్ని కథనాలు, హనుమంతుడి వీర్యం నదీజలాల ద్వారా పయనించి రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య సువన్నమచ్చని చేరిందని ఆ విధంగా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని అంటున్నాయి. మరికొన్ని కథనాలు, లంకకు వంతెనను కడుతున్నప్పుడు హనుమంతుడు సువన్నమచ్చతో ప్రేమలో పడి తద్వారా మచ్చాను అనే బిడ్డకు జన్మనిచ్చాడ‌ని అంటారు. థాయ్, కేంబోడియాన్ రామాయణ కథనాల ప్రకారం రావణసైన్యంతో జరుగుతున్న ఒకానొక యుద్ధంలో హనుమంతుడు సాహసోపేతమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటాడు. వానరునిలాగే కనిపించిన ఆ ప్రత్యర్థి సగం చేప ఆకారంలో కనిపించాడు. భీకర యుద్ధం తరువాత హనుమంతుడు తన వద్ద నున్న ఆయుధాలతో తన ప్రత్యర్థిని ఢీకొనడానికి సంసిద్ధమవుతాడు. ఇంతలో, ఆకాశంలో బంగారు వర్ణంలోనున్న నక్షత్రం మిల మిల మెరుస్తుంది. ఆకాశవాణి వినిపిస్తుంది. హనుమంతుడికి ఎదురైన‌ సాహసోపేతమైన ప్రత్యర్థి మరెవరో కాదని అతను స్వయంగా హనుమంతుడి కుమారుడేనని ఆకాశవాణి వినిపిస్తుంది. రావణుడి కుమార్తె అయిన సువన్నమచ్చ ద్వారా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని ఆకాశవాణి తెలియచేస్తుంది. వెనువెంటనే హనుమంతుడు తన ఆయుధాలను వెనక్కి తీసుకుంటాడు. తండ్రీ కొడుకులు ఇరువురూ ఒకరినొకరు గుర్తుపడతారు.

Tags: lord hanuman
Previous Post

అస‌లు జియో రావ‌డం వెనుక ఏం జ‌రిగిందో తెలుసా..? జియో ఆవిర్భావం ఇలా జ‌రిగింది..!

Next Post

మంగ‌ళ‌సూత్రానికి ఉన్న విశిష్ట‌త ఏమిటో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
చిట్కాలు

మీ ఇంట్లోనే టూత్ పౌడ‌ర్‌ను నాచుర‌ల్‌గా ఇలా త‌యారు చేసి వాడండి.. దంతాలు తెల్ల‌గా మారుతాయి..

by Admin
June 30, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.