Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ శివలింగం ఏటా పెరుగుతుంది.. యుగాంతం ఎప్పుడో కూడా ఇది చెప్పేస్తుంది..!

Admin by Admin
March 19, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రళయాలు, ఉత్పాతాలు, భూకంపాలు వంచి ప్రపంచమంతా ఒక్కసారే తుడిచి పెట్టుకుని పోతుందనే మాటలను మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఒకప్పుడు స్కైలాబ్ అనే తోక చుక్క మొదలు గ‌తంలో వచ్చిన 2012, డిసెంబర్ 12 తేదీ వరకు ఆయా సందర్భాల్లో ప్రపంచం నాశనమవుతుందని పుకార్లు బాగానే వచ్చాయి. అయితే ఆయా తేదీలు గడిచిన తరువాత కానీ అవి వట్టి పుకార్లేనని ఎవరూ నమ్మలేదు. అయినప్పటికీ అధిక శాతం మంది ప్రజలు ఇప్పటికీ ప్రపంచ వినాశనం గురించిన పుకార్లను, విషయాలను అంత తేలిగ్గా తీసిపారేయడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు మనకు నాశనం తప్పదని, భూమి అనేది మిగలదని, అసలు ఎవరూ మిగలరని, అంతా విధ్వంసమవుతుందని చాలా మంది ఇప్పుడు కూడా నమ్ముతారు. అయితే ఎవరి నమ్మకం ఎలా ఉన్నా ఇలాంటి ప్రపంచ వినాశనానికి సంబంధించిన మరో విషయం కూడా ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే…

హిమాలయాల్లోని గుహల్లో ఉన్న 6 ఇంచుల శివలింగం రోజు రోజుకీ పెరుగుతోందట. అది అలా పెరిగి పెరిగి గుహ పై భాగం (సీలింగ్)ను తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు అవుతుందనే విషయం ఇప్పుడు అంతటా వ్యాప్తి చెందుతోంది. హిమాలయాల్లోని గుహల్లో ఉన్న ఈ శివలింగాన్ని త్రేతా యుగంలో సూర్య వంశానికి చెందిన రితుపుర్ణ అనే రాజు గుర్తించాడట. దీనికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. నలుడనే రాజు తన భార్య దమయంతి చేతిలో ఓటమి పాలవగానే రితుపుర్ణ వద్దకు వచ్చి తనను తన భార్య చూడకుండా ఎక్కడైనా దాచి ఉంచాలని అడిగాడట. అప్పుడు రితుపుర్ణ నలుడ్ని హిమాలయాల్లో ఉన్న ఓ గుహలో దాచి పెడతాడు. అనంతరం తిరుగు ప్రయాణఃలో అతనికి ఓ లేడి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దాన్ని తరుముకుంటూ వచ్చిన రితుపుర్ణ అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రమిస్తాడు.

this shiv ling in himalayas will tell end of the world

ఆ సమయంలో తాను ఒక కల కంటాడు. ఆ కలలో తనను చంపవద్దని వేడుకుంటున్న ఓ లేడిని అతను చూస్తాడు. వెంటనే కల మాయమై అతనికి మెళకువ వస్తుంది. అనంతరం ఆ లేడిని వెతుక్కుంటూ అతను పక్కనే ఉన్న మరో గుహ వద్దకు వస్తాడు. ఆ సమయంలో ఆ గుహను కాపలా కాస్తూ ఓ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు. అతని అనుమతితో గుహలోకి వెళ్లిన రితుపుర్ణకు పెద్ద ఆకారంతో ఉన్న ఓ శేష నాగు కనిపిస్తుంది. ఆ పాము అతన్ని గుహలోకి తీసుకెళ్లి అంతా చూపిస్తుంది. అక్కడే రితుపుర్ణ రాజు దేవుళ్లు, దేవతలదరినీ చూస్తాడు. వారిలో శివుడు కూడా అతనికి కనిపిస్తాడు. ఆ క్రమంలో రితుపుర్ణ ఆ 6 ఇంచుల శివలింగాన్ని చూసి దర్శించుకుంటాడు. అనంతరం ఆ గుహ కొన్ని యుగాల మూసి వేయబడిందట. దీన్ని గురించి స్కంద పురాణంలో కూడా వివరించబడి ఉన్నట్టు పండితులు చెబుతారు.

కాగా ఆ గుహ మళ్లీ కలియుగంలోనే గుర్తించబడుతుందని అందులో ఉందట. అందుకు అనుగుణంగానే కలియుగంలో శంకరాచార్యుడు ఆ గుహను గుర్తించాడట. దీంతో అప్పటి నుంచి ఆ గుహలో ఉన్న శివలింగానికి నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయట. అయితే అన్ని గుహల్లా ఆ గుహ ఉండదు. దాంట్లోకి వెళ్లాలంటే పై నుంచి కిందకి దాదాపు 90 అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది. అలా దిగే క్రమంలో వచ్చే రంధ్రం చాలా చిన్నదిగా, ఇరుకుగా ఉంటుంది. గుహ మొత్తం 160 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో మళ్లీ అనేక గుహలు ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉంటాయి. కొన్నింటిలో నీటి ప్రవాహం ఉంటుంది. చిట్ట చివరికి ఉండే గుహను పాతాళ భువనేశ్వర్ గుహ అంటారు. కాగా ద్వాపర యుగంలో పాండవులు ఓ సందర్భంలో ఈ గుహను గుర్తించారని, అందులో కొంత కాలం నివసించారని కూడా కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది.

హిమాలయాల్లోని ఆ గుహలో ఉన్న 6 ఇంచుల శివలింగం ఏటా పెరిగిపోతోందట. ఈ క్రమంలో అది గుహ పైభాగాన్ని తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు అవుతుందని, అప్పుడు అంత సర్వ నాశనమవుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది. సృష్టి నాశనం అనంతరం మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుందని కూడా చెబుతున్నారు. అప్పుడు మళ్లీ సృష్టి క్రమం మొదలవుతుందట. కొత్త ప్రపంచం సృష్టించబడుతుందట.

కొంతమందైతే ఈ గుహ భూమి ప్రారంభం నుంచి ఉందని చెబుతుండడం విశేషం. ఈ గుహ చుట్టూ ఉన్న మరికొన్ని గుహల్లో అత్యంత పురాతనమైన మహాకాళి ఆలయం, చాముండేశ్వరి ఆలయాలు ఉన్నాయని తెలిసింది. 1191 వ సంవత్సరం నుంచి ఈ గుహలో ఉన్న శివలింగానికి పూజలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. గుహలో ఉన్న రాళ్లు హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలను పోలి ఉంటాయట. ఈ గుహను చేరుకోవాలంటే అర కిలోమీటర్ ముందే వాహనంలో ఆగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కాలి నడకనే గుహ ముఖ ద్వారంకు చేరాలి. అనంతరం ద్వారం నుంచి కిందకి దిగి శివలింగాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అలా దిగే క్రమంలో కలిగే అనుభూతి వర్ణించరానిదని, గుహ లోపలికి పూర్తిగా చేరుకున్నాక ఆ అనుభూతి ఇంకా ఎక్కువ అవుతుందని పలువురు చెబుతున్నారు.

Tags: Shiv Ling
Previous Post

ఏ నొప్పినైనా ఇట్టే త‌గ్గించే ప‌వ‌ర్‌ఫుల్ నాచుర‌ల్ టిప్‌…

Next Post

మీరు ఈ నాలుగు రాశులలో పుట్టినట్టు అయితే మీలో నాయ‌క‌త్వ‌ లక్షణాలు మెండుగా ఉన్నట్టు..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.