Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఉత్త‌రం వైపు త‌ల పెట్టి నిద్రించ‌కూడ‌దు.. ఎందుకో కార‌ణాలు తెలుసుకోండి..!

Admin by Admin
July 7, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఉత్తరంవైపు తిరిగి పడుకోకూడదని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఎందుకు ఉత్తరం వైపు తిరిగి పడుకోకూడని ఎప్పుడు ఆలోచించారా ? దీనికి చాలా కారణాలు, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ల మాటలు ఊరికే పోవు. వాళ్లు ఏ సంప్రదాయం తీసుకొచ్చినా.. అందులో చాలా ప్రాధాన్యతలుంటాయి. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఉత్తరం దిశగా తలచేసి పడుకోవడం వల్ల ఖచ్చితంగా చెడు కలలు వస్తాయని.. అవి మన మనసుని దెబ్బతీసేలా ఉంటాయట. ఉత్తరం దిశగా పడుకోవడం వల్ల మన శరీరం పాజిటివ్ ఎనర్జీని కోల్పోతుంది. ఇది ఒక ముఖ్యమైన కారణం. పూర్వీకుల నుంచి చెబుతున్న అద్భుతమైన నమ్మకం ఇది. అంతేకాదు హిందూ పురాణాల ప్రకారం గణపతి తలకు ఏనుగు తల పెట్టడానికి కూడా ఈ నార్త్ డైరెక్షన్ తో సంబంధముంది. ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇంకా నార్త్ డైరెక్షన్ లో నిద్రించకపోవడం వెనక ఉన్న మరిన్ని కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

పార్వతీ దేవి పుణ్యస్నానానికి వెళ్లినప్పుడు గణపతిని తలుపు దగ్గర కాపాలాగా పెడుతుంది. ఎవరినీ లోపలికి రానివ్వకుండా చూసుకోవాలని వినాయకుడికి సూచిస్తుంది పార్వతిదేవి. అయితే అప్పుడు శివుడు పార్వతిని చూడటానికి వచ్చి.. తనను లోపలికి అనుమతించాలని వినాయకుడిని కోరుతాడు. కానీ వినాయకుడికి శివుడు పార్వతిదేవి భర్త అని తెలిసినా కూడా.. పార్వతిదేవిని చూడటానికి శివుడిని లోపలికి వెళ్లనివ్వకుండా.. అడ్డుకుంటాడు. పార్వతీదేవి పుణ్యస్నానం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి చూసేసరికి.. గణపతి, శివుడు గొడవ పడుతూ ఉంటారు. శివుడు తీవ్ర ఆగ్రహానికి లోనై.. అతని భ‌టులతో వినాయకుడి తల నరికించేస్తాడు. పార్వతీదేవి చాలా ఆగ్రహానికి లోనవుతుంది. తన బిడ్డను తిరికి కాపాడాలని మొండిపట్టుదలగా ఉంటుంది. దీంతో ఆ శివుడు.. ఉత్తరం దిశగా పడుకున్న జీవి తలను నరికి తీసుకురావాలని ఆదేశిస్తారు.

you should not sleep in north direction know why

శివుడి ఆదేశంతో.. ఆయ‌న‌ భ‌టులు.. ఉత్తరం దిశగా నిద్రిస్తున్న జీవుల కోసం వెతుకుతారు. శివుడి అనుచరులు ఉత్తరం దిశగా పడుకున్న ఏనుగును చూస్తారు. దీంతో ఏనుగు తల నరికి తీసుకెళ్లి శివుడికి ఇస్తారు. ఇలా ఉత్తరంవైపు పడుకున్న జీవి తల తీసుకురమన్నాడు కాబట్టి.. ఇటువైపు తిరిగి పడుకోకూడదనే ఒక నమ్మకం మొదలైంది. ఇలా వినాయకుడు మళ్లీ ఏనుగు తలతో పునర్ జన్మ పొందుతారు. ఆ తర్వాత అందరి దేవుడిగా వినాయకుడు మారిపోయాడు. ప్రజలు ముందుగా పూజించే దైవంగా వినాయకుడు ఉంటాడని శివుడు పార్వతికి మాటిస్తాడు. మనం ఉత్తరం దిశగా తలపెట్టి పడుకోవడం వల్ల.. మన శరీరంలో రక్త ప్రసరణకు ఆటకం అవుతుందని, దీనివల్ల నిద్రలో ఆటంకం ఏర్పడుతుందని సైన్స్ చెబుతుంది. అలాగే మనలో ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయట. హిందూ పురాణాల ప్రకారం తూర్పు లేదా పడమర వైపు నిద్రించడం మంచిది. దీని వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరిగి, ఆరోగ్యం బావుంటుందని ఒక నమ్మకం ఉంది.

Tags: north directionsleep
Previous Post

ఏ రాశి వారు ఏ మంత్రం జ‌పిస్తే ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..?

Next Post

చికెన్, మటన్ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.