Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

చంద్రముఖి అసలు కథ ఇదేనా..? నిజంగా జ‌రిగిన స్టోరీనే మూవీగా తీశారా..?

Admin by Admin
February 6, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు ఠ‌క్కుమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజని మ్యానరిజం, స్టార్ డం తోపాటు జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమా అసలు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళలోని అలాకుల జిల్లా అలమట్టి పట్టణంలో ఒక పెద్ద ఇల్లు ఉంది. దాని చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్. అది చూడగానే జమీందార్ల ఇల్లులా కనిపిస్తుంది. ఇది ట్రావెన్ కోర్ రాజ్యంలోని ఒక పిల్ల జమిందార్ ఇల్లు. అతనిది కూడా ట్రావెన్ కోర్ వంశమే. అలమొట్టిల్ మోదరాజు మహా క్రూరుడు. అతని ఇంటి కింది భాగంలో చుట్టాలు మరియు ఇతర బంధువులు ఉండేవారు. పైన రాజు ఉండేవారు. బ్రిటిష్ వారి కింద ఉంటూ వారికి పన్ను కడుతూ ఈ ప్రాంతాన్ని ఏలుతుండేవాడు రాజు. అతని ఇంటికి దూరంగా పనిచేసే వారి కోసం ప్రత్యేకమైనటువంటి గదులు కూడా ఉండేవి. ఇక ఇంటికి కాస్త దూరంలో వేశ్య‌లకు ఒక ప్రత్యేకమైన చిన్న ఇల్లు కూడా ఉండేది. ఆ రాజు తన ఇంట్లో నుంచి చూస్తే తనకోసం తీసుకువచ్చిన అందగత్తెలు కనిపించేలా అందులో ఉంచేవారు. వారిలో మంచి నాట్యకారులను కూడా పిలిచేవారు. వారికి నాట్యం చేస్తే నగలు ఇవ్వడంతో పాటు సత్కారం కూడా చేసేవాడు. అందాన్ని ఆస్వాదించడంలో ఆ రాజుది అందెవేసిన చేయి. ఇక చంద్రముఖి కథ కూడా ఇక్కడే పుట్టింది. రాజు మంచి పాలనలో ఉన్నప్పుడు తన సోదరి కుటుంబం తన ఇంటికి వచ్చింది.

is chandramukhi story really happened

ఇక తన అక్క, బావ వారి పిల్లలను కూడా అదే ఆ స్థానంలో ఉంచుకున్నాడు. ఇక రాజు యొక్క రాజ భోగాలు, సంపదను చూసి అక్క, బావ కుళ్ళుకున్నారు. ఆయన ఆస్తిపై కన్నేశారు. ఆయన ఆస్తులలో కొంత వాటా ఇస్తే తాము కూడా బతుకుతామని ఎన్నాళ్ళు ఇక్కడ ఉండమంటావు. అని రాజు అక్క అడగడంతో దూరంగా ఉన్న తన పెద్ద భవనంతో పాటు, 1000 ఎకరాల భూమిని ఇచ్చాడు రాజు. కానీ చేతికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక తన అక్క, బావ, పిల్లలు కూడా పెద్దవారయ్యారు. రాజుకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే రాజు వయసు మీద పడుతుండడంతో ఆస్తి వస్తుందని తన అక్క ఎదురు చూస్తూ ఉండేది. కానీ రాజు తన సంస్థ అధికారులను పిలిపించి తన ఆస్తులు మొత్తాన్ని కొడుకులకు, కూతుళ్లకు రాసిచ్చాడు. దానిపై తన భార్య సంతకాన్ని కూడా పెట్టించాడు. ఎన్నాళ్ళ నుంచో కాచుకుని కూర్చున్న తన అక్కకు ఆస్తి దక్కలేదు. దీంతో రాజును చంపేయాలనుకున్నారు. మొదట రాజు భార్యకు స్లో పాయిజన్ ఇచ్చి చంపారు.

ఆమెకు విషపూరిత పుట్టగొడుగులను చిన్నచిన్న ముక్కలుగా చేసి వ్యాధి తగ్గుతుందని చెప్పి కషాయంగా తయారు చేసి ఇచ్చేవారు. ఆమె కూడా రోజు తాగేది. దీంతో మూడు నెలల తర్వాత మంచాన పడి ఆమె చనిపోయింది. దీంతో రాజు ఒంటరివాడయ్యాడు. తన తోడు ఎవరూ లేకపోవడంతో తన సేవకుడి 18 ఏళ్ల కూతుర్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమె రాజుని చాలా బాగా చూసుకునేది. కానీ ఓ రోజు ఒక కళాకారుడు రాజు వద్దకు వచ్చి ఆయన చిత్రం వేస్తానని చెప్పాడు. అప్పుడు రాజుతో పాటు తన పనిమనిషి బొమ్మ కూడా వేయమన్నాడు. రాజు. రాజు బొమ్మను రెండు రోజుల్లో వేశాడు. కానీ ఆ పనిమనిషి బొమ్మ వేయడానికి వారం రోజులు టైం తీసుకున్నాడు. కళాకారుడు తర్వాత ఆ పనిమనిషి బొమ్మను అందంగా తీర్చిదిద్దాడు. ఆ బొమ్మని చూసిన రాజుకు పనిమనిషిపై మనసు పడింది. ఇంతలోనే రాజు అక్క ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పనిమనిషి పై రాజు పెంచుకున్న ప్రేమను గమనించింది. తన గేమ్ స్టార్ట్ చేసింది. అంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఎలాగైనా రాజును చంపేయాలని భావించింది.

అనుకున్న విధంగానే ఒక గదిలో రాజును ఆ పనిమనిషిని చంపేసింది. వారి నగలు, డబ్బులు అంతా దోచేసి వారి సంస్థానానికి పంపింది. ఆ తర్వాత రాజును చంపిన గది తప్ప ఆ కోటను మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అయితే ఆ రాజు, కొడుకు కూడా ఒక సేవకున్ని ఆ స్థానంలో ఉంచాడు. ప్రతి అమావాస్య రోజున అక్కడ నుండి క్రూర శబ్దాలు రావడంతో ఆ సేవకుడు ఆ కోటను వదిలి పారిపోయాడు. తర్వాత మరో సేవకుడిని రాజు కొడుకు ఉంచితే మరో అమావాస్య నాడు అలాగే అరుపులు వినపడ్డాయి. ఆ సేవకుడు కూడా పారిపోయాడు. చివరికి తన అక్కే ఆ ఇంట్లో ఉంది. మళ్లీ అమావాస్య రానే వచ్చింది. ఆరోజు రాత్రి తన అక్క, కూతురు ఇంట్లో ఉండగానే ఆ పనిమనిషి ఆత్మ తన కూతురును ఆవహించింది. అచ్చం పనిమనిషి లాగా మాట్లాడుతూ, ఆమె కూతురే ఆ రాజు అక్కను చంపేసింది. ఆ విధంగా ఆ కోట నుంచి ప్రతి అమావాస్య రోజున శబ్దాలు రావడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని చంద్రముఖి సినిమాను తెరకెక్కించారు. అయితే ఇది క‌థ‌నా.. నిజంగా జ‌రిగిందా.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Tags: Chandramukhi
Previous Post

కార్ల వెనుక భాగంలో ఉండే LXi, ZXi, VXi అర్థం ఏంటో మీకు తెలుసా..?

Next Post

అరటిపండ్లు, కోడిగుడ్లతో మొక్కల పెంపకం… ఆశ్చర్యంగా ఉందా!? ఇలా త‌యారు చేయండి..!

Related Posts

వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025
వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.