ఇటీవలి కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోల్చితే సోషల్ మీడియా హవా ఓ రేంజ్ లో ఉంది. సోషల్ మీడియా వచ్చాక ప్రతి వార్త సామాన్యులకి త్వరగా అందుతుంది. అలాగే వారి సందేశాలు కూడా నేరుగా సెలబ్రిటీలకు చేరుకుంటున్నాయి. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా చాలామంది సెలబ్రిటీలు ట్రోలింగ్ కి గురయ్యారు. సెలబ్రిటీలపై మాత్రమే కాక సినిమాల పైన కూడా సాధారణ ప్రజలు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం ఇచ్చింది లేటెస్ట్ టెక్నాలజీ. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకి ఓ ఆణిముత్యం లాంటి డిజాస్టర్ మూవీ పడే ఉంటుంది. ఆ సినిమాని జనరల్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు. అంతెందుకు ఫ్యాన్స్ మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో తన శక్తి మూవీని తానే ట్రోల్ చేసుకున్నాడు. ఈ విషయాలు పక్కన పెడితే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో 15 సినిమాలు ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యాయి. ఆ సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ కెరీర్ లోనే ఏదైనా వరస్ట్ స్క్రిప్ట్ సెలక్షన్ ఉంది అంటే అది ఈ మూవీనే అని చెప్పొచ్చు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అత్యంత దారుణంగా ట్రోల్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. ఈ సినిమాలో విలన్ ని పాము కాటేస్తే పామే చనిపోవడం, హీరో ట్రైన్ పైకి ఎక్కి ఏకంగా బీహార్ వరకు వెళ్లడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనిపించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అత్యంత దారుణంగా ట్రోల్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం శక్తి. ఈ చిత్రాన్ని తారక్ ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆఖరికి ఎన్టీఆర్ కూడా స్వయంగా సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నాడు అంటే ఈ మూవీ తెరకెక్కించిన విధానంపై నెట్టింట్లో ఏ విధంగా ట్రోల్ కి గురైందో చెప్పొచ్చు.
సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ఆఫీసర్. ఈ చిత్రానికి రిలీజ్ కి ముందు ఎంత హైప్ క్రియేట్ అయిందో రిలీజ్ తర్వాత అంతే ట్రోల్ అయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పరమవీరచక్ర.. బాలయ్య కెరీర్ లోనే అత్యధికంగా ట్రోల్ కి గురైన మూవీస్ లిస్టులో ఇది టాప్ లో ఉంటుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం షాడో. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన మూడవ అట్టర్ ప్లాప్ మూవీ ఇది. ఈ చిత్రం తెరకెక్కించిన విధానంపై నెట్టింట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ చిత్రానికి రిలీజ్ కి ముందు ఎంత హైప్ క్రియేట్ అయిందో రిలీజ్ తర్వాత అంతే ట్రోల్ అయింది. అల్లు అర్జున్ – బద్రీనాథ్ & వరుడు.. ఈ రెండు బన్నీ సినిమాల స్టోరీ పక్కన పెడితే ఈ రెండు చిత్రాలలోని కొన్ని సన్నివేశాలను చూస్తే మాత్రం అసలు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఇవేం సన్నివేశాలు రా బాబు దండం అనేలా ఉంటాయి.
సతీష్ వెగెస్నా దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. అసలు ఆ పెళ్లి ఏంటో? స్టోరీ ఏంటో? అంటూ ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు అత్యంత దారుణంగా ట్రోల్ చేశారు. లారెన్స్ రాఘవ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం రెబెల్. ఈ చిత్రానికి కూడా రిలీజ్ కి ముందు ఎంత హైప్ క్రియేట్ అయిందో రిలీజ్ తర్వాత అంతే ట్రోల్ అయింది. బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రం పవన్ అభిమానులని ఓ రేంజ్ లో డిసప్పాయింట్ చేసింది. అజయ్ భుయాన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం దడ. చాలామంది ఈ సినిమాను చూసి కూడా ఉండరంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ప్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన చిత్రం నేను నా రాక్షసి. అసలు ఈ చిత్రంలో ఇలియానా డబుల్ ఆక్షన్ ఎందుకు పెట్టారో తెలియదు..? సినిమాలో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారో తెలియదు? రానా కెరీర్ లోనే ఫుల్ ట్రోల్ అయిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది ఇదేనని చెప్పొచ్చు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం నోటా. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంతే రేంజ్ లో ట్రోల్ కి గురైంది. గోపీచంద్ – ఆక్సిజన్ & సౌఖ్యం.. అప్పట్లో గోపీచంద్ కి కంటిన్యూగా ప్లాప్స్ పడ్డాయి. అందులో మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు చిత్రాలు కూడా విపరీతంగా ట్రోల్ కి గురయ్యాయి.