టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ పరిశ్రమంలోనే టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతారా మూవీ కన్నడ నాట సంచలనం సృష్టించింది. తెలుగులో రూ. 2 కోట్లకు అమ్ముడుపోయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.400 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మూవీ బింబిసార. ఈ సినిమా రూ. 15.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా దాదాపు రూ.40 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా రూ. 22 కోట్ల వరకు లాభాలను తీసుకువచ్చింది. ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 తెలుగు సహా హిందీలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ.58.40 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా మారడంలో అల్లు అర్జున్ పాత్ర చాలా ఉంది. రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన గీత గోవిందం సినిమా రూ. 70 కోట్ల షేర్ తో పాటు రూ.55.43 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ మేనల్లుడుగా వచ్చిన వైష్ణవ్, తొలి సినిమా ఉప్పెనతో సంచలనం రేపాడు. ఈ మూవీ 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే, రూ. 31.02 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా రూ. 30.5 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ టైటిల్ రోల్లో నటించిన మూవీ సీతారామం. ఈ సినిమా రూ. 16.2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా దాదాపు రూ. 46.50 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా రూ. 29.50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
జాతి రత్నాలు మూవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. ఓవరాల్ గా రూ.39 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా రూ. 27.52 కోట్ల లాభం తీసుకొచ్చింది. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రూ. 17.7 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. ఈ సినిమా రూ. 41 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 22.78 కోట్ల లాభం తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా రూ. 5.5 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 26 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 20.3 కోట్ల లాభం తీసుకొచ్చింది.