Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

లీడర్ లాంటి క్లాసిక్ సినిమా ఉన్నాక అదే కాన్సెప్ట్ కాపీ చేసిన భరత్ అనే నేను సినిమా ఎందుకు హిట్ అయ్యింది?

Admin by Admin
February 22, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

1999లో సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. మొట్టమొదటిసారిగా హీరో ఒక ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించిన సినిమా ఇది. బాలకృష్ణ కెరీర్‌లోనూ, తెలుగు సినిమా రంగంలోనూ మరుపురాని హిట్. హీరో కుటుంబానికి విలన్ కుటుంబానికి కక్షలు, కార్పణ్యాలు ఉంటాయి. ఇరుపక్షాల వారూ ఫ్యాక్షనిస్టులే. ఒక దురదృష్టకరమైన క్షణంలో విలన్ దొంగదెబ్బ తీసి హీరో కుటుంబంలోనూ, పరివారంలోనూ చాలామందిని చంపేస్తాడు. ఆ బాధను గుండెల్లో దాచుకున్న హీరో వేరే బాధ్యత కారణంగా తాను మహారాజులా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడో దూరాన పేరు మార్చుకుని, తీరుమార్చుకుని తన బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటాడు.

విలన్ మాత్రం శత్రుశేషం మిగలకూడదని హీరో కోసం వెతుకుతూ ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ విలన్‌తో తలపడాల్సి వస్తుంది. ఈసారి తిరిగి తన గడ్డకు తిరిగి వస్తాడు. ప్రజలు అన్నా అని బ్రహ్మరథం పడతారు. అనుచరులు కన్నీళ్ళు తుడుచుకుంటారు. చివరకు విలన్‌పై గెలుపుసాధించి శాంతిని నెలకొల్పుతాడు. ఇందులో ఒకటి రెండు స్పెసిఫిక్ విషయాలు (హీరో అనుచరుడిని అనుకోకుండా హీరో చంపడం వల్ల వాళ్ళ చెల్లెళ్ళ బాధ్యత వస్తుంది), జనంతో ఈలలు వేయించే పవర్‌ఫుల్ డైలాగులు మారిస్తే – ఇదే కథతో తర్వాత అదే బాలకృష్ణ నరసింహనాయుడు తీశాడు. సూపర్ హిట్. అలాంటి కథతోనే ఎన్టీఆర్ ఆది వచ్చింది. సూపర్ హిట్. అదే విధంగా చిరంజీవి ఇంద్ర వచ్చింది. అది కూడా బంప‌ర్ హిట్ అయ్యింది.

why bharat ane nenu become hit if leader is there

ఇలా ఎంతకాలమైనా ఎన్ని సినిమాలైనా వచ్చేవి. కానీ, చూసీచూసీ ఈ ట్రెండ్ మీద జనానికి ఆసక్తి పోయింది. అప్పుడు కానీ, ఆ సినిమాలు రావడం ఆగలేదు. సమరసింహారెడ్డిగా బాలయ్య ఎంట్రీ. తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ఇదే మొదలు. ఇప్పుడు, లీడర్, భరత్ అనే నేను సినిమాల విషయానికి వస్తే – రెండిటికి మధ్య ఏ రెండు సూపర్ హిట్ ఫ్యాక్షన్ సినిమాల మధ్య కన్నా చాలా తేడాలు ఉన్నాయి. లీడర్ పూర్తిగా అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా. రానాకు ఏ ఇమేజ్ లేదు. భరత్ అనే నేనులో పాలిటిక్స్‌తో పాటు మహేష్ హీరోయిజం కూడా చొప్పించారు. లీడర్ ట్రీట్‌మెంట్ వేరు. భరత్ అనే నేను ట్రీట్‌మెంట్ వేరు. లీడర్ ఏమీ సమరసింహారెడ్డి లెవల్ హిట్ కాదు.

కాబట్టి, ఈ రెండూ కూడా రావడం, అందులో భరత్ అనే నేను కమర్షియల్‌గా బాగా వర్కవుట్ కావడం పెద్ద విచిత్రం కాదు. గట్టిగా మాట్లాడితే – హీరో ముఖ్యమంత్రి కావడం లేదంటే హీరో ముఖ్యమంత్రులను శాసించే కింగ్ మేకర్ కావడం మంచి పవర్‌ఫుల్ కాన్సెప్ట్. ఫ్యాక్షన్ సినిమాల్లోలాగా ఒకే కథ తిప్పీతిప్పీ పిప్పి చేయక్కరలేదు. గత డెబ్భై అయిదేళ్ళ స్వతంత్ర్య భారత రాజకీయ చరిత్రలో కేంద్రం, రాష్ట్రాలు కలుపుకుంటే బ్రహ్మాండమైన డ్రామా ఉన్న రసవత్తర రాజకీయ ఘట్టాలు బోలెడు. దిమ్మదిరిగించేంత పవర్‌ఫుల్ రాజకీయ నాయకులు, వాళ్ళు పదవికోసం చేసిన పోరాటాలు కూడా బోలెడు. జయలలిత, ఎన్టీఆర్, మోదీ, యోగి, సోనియా, ఇందిర, వైఎస్సార్, కేసీఆర్, పీవీ, బాల్ థాకరే, జ్యోతిబ‌సు, మమత, కరుణానిధి, ఎమ్జీఆర్ – వంటివారి రాజకీయ జీవితాల్లోకి తొంగిచూస్తే పుంఖానుపుంఖాల కాన్సెప్టులు, సీన్లు, క్యారెక్టరైజేషన్లు దొరుకుతాయి. సుబ్బరంగా ఇంకో అరడజన్ సినిమాలు చేసుకున్నా హిట్ అవుతాయి.

Tags: bharat ane nenu
Previous Post

పుచ్చ‌కాయ‌ల రైతు దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌.. అత‌ని కొడుకు పాటించ‌లేదు..

Next Post

100 ఎకరాల్లో ఫామ్ హౌస్.. రాజమౌళికి ఈ ఊరంటే చాలా స్పెషల్..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.