లీడర్ లాంటి క్లాసిక్ సినిమా ఉన్నాక అదే కాన్సెప్ట్ కాపీ చేసిన భరత్ అనే నేను సినిమా ఎందుకు హిట్ అయ్యింది?
1999లో సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. మొట్టమొదటిసారిగా హీరో ఒక ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించిన సినిమా ఇది. బాలకృష్ణ కెరీర్‌లోనూ, తెలుగు సినిమా రంగంలోనూ మరుపురాని హిట్. హీరో కుటుంబానికి విలన్ కుటుంబానికి కక్షలు, కార్పణ్యాలు ఉంటాయి. ఇరుపక్షాల వారూ ఫ్యాక్షనిస్టులే. ఒక దురదృష్టకరమైన క్షణంలో విలన్ దొంగదెబ్బ తీసి హీరో కుటుంబంలోనూ, పరివారంలోనూ చాలామందిని చంపేస్తాడు. ఆ బాధను గుండెల్లో దాచుకున్న హీరో వేరే బాధ్యత కారణంగా తాను మహారాజులా ఉన్న ప్రాంతాన్ని … Read more









