ఎస్.ఎస్ రాజమౌళి.. ఇప్పుడు ఓ అంతర్జాతీయ స్థాయి దర్శకుడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ లభించిన తర్వాత అతడి రేంజ్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు జక్కన్న. అసలు దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్స్ ని తిరగరాసేలా సినిమా తీయడం ఒక రాజమౌళికే చెందింది. ఆయన హాలీవుడ్ కి కూడా వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఆక్షన్ అడ్వెంచర్స్ గా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. హాలీవుడ్ కి చెందిన జెన్నా ఓర్టేగాని ఈ సినిమాలో ఒక నటిగా తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. రాజమౌళి సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఉంటుంది. ఆయన సినిమా చివర్లో, సినిమా పోస్టర్ల మీద ఒక స్టాంప్ ఉంటుంది.
అసలు ఈ స్టాంపు ఎందుకు అనేది రాజమౌళిని అడిగితే ఆయన కెరీర్ మొదట్లో సినిమాలు తీసినప్పుడు ఊళ్ళలో ఉన్న చదువురాని వ్యక్తులకు ఆయన సినిమా పేర్లు అర్థం కావు. అందుకని తను తీసే సినిమాల పేర్లు చదవరాకపోయినా అర్థం కావాలి అంటే మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టాంపు ఆలోచన వచ్చి పెట్టారట. అప్పుడు పేరు చదవరాకపోయినా కనీసం ఆ పోస్టర్ల మీద ఆ ముద్ర చూసి తన సినిమా అని గుర్తు పడతారు కదా! అలా గుర్తుపట్టి తన సినిమాలకి వస్తారని అలా పోస్టర్ల మీద ముద్రవేశారట. అలా అది ఒక బ్రాండ్ లా మారిందని చెప్పారు. అది తన సినిమా అని అందరికీ తెలియాలని ఆ స్టాంపు వేయడం స్టార్ట్ చేశానని వివరించారు రాజమౌళి.