Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

విక్రమ్ (2022) సినిమా ఎందుకు అంత హిట్ అయ్యింది?

Admin by Admin
July 20, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దాదాపుగా కమల్ హాసన్ కెరీర్ ఇంకా ముగిసిపోయింది అనుకునే వారందరికీ విక్రమ్ సినిమా ఒక ఘాటైన సమాధానం ఇచ్చింది. ఐతే ఈ సినిమా అంతలా హిట్ అవ్వడానికి కారణాలు ఏమయ్యి ఉండవచ్చు? కమల్ హాసన్ ప్రధాన పాత్రధారి ఐనప్పటికీ ఈ చిత్రం కేవలం అతని పెర్ఫార్మన్స్ వల్ల మాత్రమే ఆడిందని చెప్పలేం. ఆయన నటన ప్రావీణ్యత తో ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల సత్తా ఉన్న నటుడు కమల్ హాసన్. హిట్ ఐనా, ప్లాప్ ఐనా చేసే ప్రతి పాత్ర కి 100% న్యాయం చేస్తారు. ఆయన మాత్రమే కాదు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, చెంబన్ వినోద్ జోస్ లు కూడా అలాంటి నటులే. అందు వల్ల నేను నటీనటుల పెరఫార్మన్సులని పరిగణన‌లోకి తీసుకోవట్లేదు. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ పాత్రలు. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్ వంటి పాజిటివ్ పాత్రలకి మాత్రమే కాదు విజయ్ సేతుపతి నటించిన సంతానం అనే విలన్ పాత్ర కి కూడా ఫామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ పాత్రల యొక్క ఆవేదన ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా మలిచాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.

అనూహ్య సన్నివేశాలు. కథా పరంగా ఎక్కడైనా చూసినట్టు అనిపించొచ్చు కానీ ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. ఇది ఎక్కడో చూసామే అనేలా ఏది అనిపించదు. ఎక్కడ బోర్ అనిపించకుండా మధ్య మధ్య లో రోమాలు నిక్కపొడుచునేటటువంటి సన్నివేశాలు పెట్టారు (ఇంటర్వెల్ ఫైట్, ఏజెంట్ టీనా ఫైట్, రోలెక్స్ సన్నివేశం వంటివి). కథ మొత్తం మాదక ద్రవ్యాల వ్యాపారం చుట్టూ తిరుగుతుంది. దాన్ని ప్రేక్షకులకి కన్వే చేసే విధంగా సినిమా అంత డార్క్ థీమ్ లో తీసారు. అది బాగా ఆకట్టుకుంది. వేగవంతమైన కథనం. ఈ సీన్ ఎందుకు ఇలా ఉంది, అసలు ఫలానా పాత్ర ఎందుకు పెట్టారు అని ఆలోచించే వ్యవధి ప్రేక్షకుడికి ఇవ్వకుండా కథనం మొత్తం వేగవంతంగా సాగిపోతుంటుంది.

why vikram movie got super hit that much success

వైవిధ్యభరితమైన బాక్గ్రౌండ్ మ్యూజిక్. హీరోయిజమ్ అంటే కేవలం హీరో కష్టమైనా ఫైట్ లు చేస్తేనో, 2–3 పేజి ల డైలాగ్ చెప్తే మాత్రమే కాదు ఏం మాట్లాడకుండా అలా నడుచుకుంటూ పోతే చాలు BGM తో కూడా ఎలివేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు అనిరుద్. ఇండియన్ సినిమా లో నే ఇది సరికొత్త ట్రెండ్ గా మారింది. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్. సాధారణంగా ఎక్కువ సినిమాలు ప్రేక్షకుడిని అలరించడంలో సెకండ్ హాఫ్ లో ఫెయిల్ అవుతుంటాయి. అయితే ఈ సినిమా కి ఇంటర్వెల్ తో నే అసలు కథ స్టార్ట్ అవ్వడం తో సెకండ్ హాఫ్ లో వచ్చే అద్భుతమైన యాక్షన్ ఘట్టాలు, కొన్ని ఆలోచింపజేసే డైలాగులతో ఇంకా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా చివరి 15 నిమిషాల్లో వచ్చే సూర్య సన్నివేశమైతే ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది.

కాపీ కొట్టడం వేరు ప్రేరేపించబడడం వేరు. సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ హాలీవుడ్ లో ఆల్రెడీ వచ్చేసినప్పటికీ ఇండియన్ సినిమా లో ఇది సరికొత్త అంశం. అది కూడా ఫాంటసీ genre లో కాకుండా కొన్ని ప్రత్యక్ష పాత్రలతో LCU అనే యూనివర్స్ ని సృష్టించారు. ముఖ్యంగా ఇది మాస్ అప్పీల్ కి దోహదపడిందని చెప్పొచ్చు. ఇవి మాత్రమే కాదు టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా బాగా మెరుగుదిద్దారు. ఉదాహరణ కి ఇంటర్వెల్ ఫైట్ లో Mocobot Robotic Camera తో తీసిన సీన్, లైటింగ్, కాస్ట్యూమ్స్ వంటివి సినిమా కి కొత్త హంగులు దిద్దాయి.

Tags: vikram movie
Previous Post

మ‌ఖ‌నాలను ఎలా తింటే మంచిది.. తెలుసుకోండి..!

Next Post

సద్దాం హుస్సేన్ నిజంగా నేరస్థుడా? అతను ఎందుకు ఉరితీయబడ్డాడు?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.