శరీర బరువు ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉంటే దాంతో ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దానికి తోడు ఇక పొట్ట కూడా ఎక్కువగా ఉందనుకోండి, ఇక బాధ చెప్పనలవి కాదు. మానసికంగానే కాదు, అటు శారీరకంగా కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటిస్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వచ్చేందుకు పొంచి ఉంటాయి. అయితే అధిక బరువును, పొట్టను తగ్గించుకునేందుకు అందరూ వివిధ రకాల పద్ధతులను పాటిస్తుంటారు. ఈ క్రమంలో వాటితోపాటు కింద సూచించిన విధంగా ఓ సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. శరీరంలో అధికంగా ఉన్న బరువు, కొవ్వు కరిగిపోతుంది. అంతేకాదు, పొట్ట తొందరగా తగ్గుతుంది.
చిత్రంలో చూపిన విధంగా నేలపై బోర్లా పడుకుని మోచేతులను, కాలి వేళ్లను ఆధారంగా చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట, ఛాతీ కండరాలు, భుజాలపై అధికంగా ఒత్తిడి పడుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఈ వ్యాయామాన్ని ప్లాంక్ ఎక్సర్‌సైజ్ (Plank Exercise) అంటారు. దీన్ని నిత్యం చేస్తే కేవలం 28 రోజుల్లోనే పొట్ట తగ్గుతుంది.
మొదటి రెండు రోజులు 20 సెకండ్ల పాటు ప్లాంక్ ఎక్సర్‌సైజ్ చేస్తే చాలు. తరువాత 2 రోజులకు ఒకసారి 10 సెకన్లు పెంచుతూ పోవాలి. ప్రతి 6వ రోజు ఈ ఎక్సర్‌సైజ్‌కు విశ్రాంతి ఇవ్వాలి. మరుసటి రోజు మళ్లీ యథావిధిగా ఎక్సర్‌సైజ్ చేయాలి. ఇలా నెల రోజుల పాటు చేసే సరికి మీకు రోజుకు 4 నిమిషాల పాటు ప్లాంక్ ఎక్సర్‌సైజ్ చేసేంతటి శక్తి వస్తుంది. ఈ వ్యాయామాన్ని రోజూ చేస్తుంటే పొట్ట దగ్గరి కొవ్వు కరిగి ఫ్లాట్‌గా మారుతుంది. బరువు తగ్గుతారు.