Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

గ‌ర్భిణీలు నిజంగానే ఆహారం అధికంగా తినాలా.. వైద్యులు ఏమంటున్నారు..?

Admin by Admin
July 8, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు. చాలామంది తెలిసి తెలియక కొన్ని తినకూడనివి ఎక్కువగా తింటారు. దానివల్ల వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. డెలివరీ తర్వాత కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చేయకూడని నాలుగు తప్పులేంటో నిపుణులు వివరిస్తున్నారు. అవేంటంటే.. చాలా మంది గర్భంతో ఉన్న మహిళలకు ఇంట్లో వాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. వాళ్లు తింటూనే ఉంటారు. మీరు వద్దన్నా.. వాళ్లు కామన్‌గా చెప్పే మాట ఇదే.. ఇపుడు నువ్వు ఇద్దరికి సరిపోయే ఆహారం తినాలి అని. పోషకాల విషయంలో అది నిజమే కానీ, ఆహారం ఎక్కువగా తీసుకోవడం మాత్రం అవసరం లేదు. ఎక్కువ తిండి తినడం వల్ల బరువు ఎక్కువగా పెరుగుతారు. దానివల్ల మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు రావచ్చు.

అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్ (ACOG) ప్రకారం.. ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో మన శరీరానికి మామూలు సమయం కన్నా ఎక్కువ కేలరీలు అవసరం లేదు. స్త్రీలు తీసుకునే ఆహారం సరిపోతుంది. అలాగే వాంతులు, తల తిరగడం వంటి సమస్యల వల్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా వారు తీసుకునే కొద్దిపాటి ఆహారం పిండం ఎదుగుదలకు సరిపోతుంది. రెండో త్రైమాసికంలో మాత్రం రోజుకు 300 కేలరీలు అవసరమవుతాయి. దానికోసం కూడా రోజుకు ఒకసారి అదనంగా ఒక స్నాక్ తినడం లేదా ఒక కప్పు పెరుగు లేదా యోగర్ట్, ఆహారంలో చికెన్ చేర్చుకుంటే చాలు. మూడో త్రైమాసికంలో 300-500 kcal రోజుకు అవసరం. ఆకలి కూడా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి రోజూవారీ ఆహారంలో మరొక అదనపు స్నాక్ ఏదైనా చేర్చుకుంటే చాలు.

do pregnant ladies should take excessive food what experts say

ఎంత తింటున్నామన్నది కాదు, ఏం తింటున్నామో ముఖ్యం. బరువు పెరుగుతామనే భయం లేకుండా పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. ఎక్కువ పంచదార ఉన్న డ్రింకులు, ప్యాక్ చేసి నిల్వ చేసిన చిరుతిండ్ల జోలికి పోకూడదు. దానికి బదులు చిరుధాన్యాలు, ఇంట్లో చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వైద్యుల సలహాతో వ్యాయామం చేయడం చాలా మంచిది. అలాగే వ్యాయామం చేసేటపుడు ఖాళీ కడుపుతో కన్నా కనీసం అరగంట ముందు ప్రొటీన్, కార్బోహైడ్రేట్లున్న స్నాక్స్ తీసుకోవాలి. యోగర్ట్‌లో యాపిల్ ముక్కలు, అరటిపండ్లు పీనట్ బటర్‌ కలిపి తీసుకున్నా మంచిదే.

ఉదయం లేవగానే వాంతులు, తల తిరగడం లాంటి సమస్యలుండొచ్చు. వాటివల్ల ఒత్తిడి తీసుకోకండి. కొన్ని సార్లు కొన్నింటి వాసనలు నచ్చక పోషకాలున్నా వాటిని పక్కన పెట్టేస్తారు. ఎలాంటి పోషకాలు లేని ఆహారం నోటికి రుచికి ఉందని ఎక్కువగా తినేస్తారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దానికి బదులుగా సమస్య కాస్త నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వాసనలు పడకపోతే ఉడికించిన కూరగాయలు, పాస్తా, చికెన్, చేపలు ఆహారంలో చేర్చుకోవచ్చు.

Tags: pregnant ladies
Previous Post

మైక్రోవేవ్ ఓవెన్ ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను వండ‌కూడ‌దు.. ఎందుకంటే..?

Next Post

సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తున్నాయని మీకు అనిపించిన సినిమాలు ఏవి? ఎందుకు?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
చిట్కాలు

మీ ఇంట్లోనే టూత్ పౌడ‌ర్‌ను నాచుర‌ల్‌గా ఇలా త‌యారు చేసి వాడండి.. దంతాలు తెల్ల‌గా మారుతాయి..

by Admin
June 30, 2025

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
చిట్కాలు

Hair Fall Health Tips : కేవ‌లం ఈ 2 చాలు.. జుట్టు అస‌లు ప‌ట్టుకుని లాగినా కూడా ఊడిరాదు..!

by D
March 31, 2024

...

Read more
వినోదం

Anasuya : అన‌సూయకు చెందిన ఈ ఆస‌క్తిక‌రమైన‌ విష‌యాలు మీకు తెలుసా..?

by Admin
January 9, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.