మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్‌లో ఇష్టారీతిన వాడేస్తున్నారు. ఈ మైదాపిండి తయారీ చివరిదశలో, పొటాషియం బ్రోమేట్‌ను అదనంగా జోడిస్తారు. ఇది శరీర కణాలను నష్టపరిచే ఒక శక్తివంతమైన ఆక్సిడైజర్. కొన్ని దేశాలలో ఈ బ్రోమేట్ ను కొన్ని రకాల క్యాన్సర్ కి కారకమని భావించి దానిపై నిషేధం విధించారు. మైదా పిండిని తినడానికి ఏవైనా కీటకాలని ప్రయత్నిస్తే అవి తక్షణమే మరణిస్తాయి. మైదాపిండి అనేది సహజమైన క్రిమి సంహారకారిగా ఉంటూ, కీటకాలను వెంటనే చంపుతుంది.
మైదాలో ఉండేది బూడిదే… మైదాతో ఆరోగ్య ప్రయోజనాలేవీ లేవు. మైదా వినియోగం ఆరోగ్యకరం కూడా కాదు. ఇందులో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఉంటుంది. మైదాను ద మోస్ట్ డేంజరస్ ఫుడ్ అని కూడా పేర్కొంటారు. ప్రతి ఒక్కరూ పరోటా తినడాన్ని ఇష్టపడతారు. గోధుమలతో చేసిన పరోటా తినడం వల్ల ఎటువంటి హానీ ఉండదు. కానీ మైదాతో చేసింది తింటే మాత్రం కష్టమే. గోధుమలో ఫైటోకెమికల్స్, ఫైబర్ , బీ, ఈ విటమిన్లు ఉంటాయి. మైదాకు వచ్చే సరికి గోధుమల బయటి భాగాన్ని తొలగిస్తారు. లోపలి ఉండేది స్టార్చ్ మాత్రమే. నిజానికి ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది. కానీ మనం కొనే మైదా పిండి తెల్లగా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా…? గోధుమల్లోపలి భాగాన్ని పిండిగా మారిస్తే అది ఎల్లో రంగులో ఉంటుంది. దాన్ని తెల్లగా మార్చేందుకు గాను బ్లీచ్ చేస్తారు. ఇందుకోసం పెరాక్సైడ్ ను వాడతారు. ఈ ద్రావకాన్ని హాస్పిటల్స్ లో గాయాల క్లీనింగ్ కోసం ఉపయోగిస్తుంటారు.
బెంజిల్ పెరాక్సైడ్ మొటిమల నివారణకు వాడే క్రీముల్లో ఉండే కెమికల్. దీనితో పాటు, క్లోరిన్ గ్యాస్ ను కూడా మైదా పిండిని తెల్లగా మార్చేందుకు ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యానికి ఎంతో హాని కలిగించే ఈ ప్రమాదకరమైన కెమికల్స్ ను మెజారిటీ యూరోపియన్ దేశాలు, అమెరికా నిషేధించాయి. ఇక మైదా సాఫ్ట్ అండ్ సిల్కీగా కనిపించేందుకు అల్లోక్సాన్ అనే కెమికల్ ను వాడతారు. ఇది రక్తంలో ఉన్న షుగర్ పై ఫైట్ చేస్తుంది. షుగర్ ఎక్కువైతే ఇన్ ఫ్లమేషన్ మార్పులు జరిగి ఆర్థరైటిస్, గుండె జబ్బులు కూడా వస్తాయి. అల్లోక్సాన్ కెమికల్ అంత్యంత ప్రమాదకరం. ఇది పాంక్రియాస్ లోని బీటా కణాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం) బారినపడతారు. అల్లోక్సాన్ ను కలపడం వల్ల మైదా సాఫ్ట్ గా మారుతుంది.
గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు. మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు. మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి. మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే.. మైదా వాడితే పదార్థాలు చూడటానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్లో ఫలానాది తింటే చాలా బావుందని చెబుతుంటాం. మైదా తింటే ఆరోగ్యం అలా దెబ్బతింటుంది…