మానవ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యమని వైద్యులు చెబుతుంటారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చేపలలో లభిస్తాయి. వారంలో రెండు సార్లు అయినా చేపలను తింటే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సీయర్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి. ఈ సీయర్ ఫిష్ ను నేమీన్ లేదా కొన్ని ప్రాంతాలలో ఐక్కోరా అని పిలుస్తారు. ఇది చాలా ఖరీదైన చేప. ఈ చేపలో ఎముకలు ఉండవు. ఈ చేపని సాధారణంగా అన్నంతో పాటు మసాలాగా ఆరగిస్తారు. అంతేకాదు ఊరగాయను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ సియర్ ఫిష్ హిందూ మహాసముద్రం, భారతదేశంలోని పక్కనే ఉన్న సముద్రాలలో సమృద్ధిగా దొరుకుతుంది. ఈ ఫిష్ 45 కిలో గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. ఇది చాలా చురుకైన చేప. వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువే.
సియర్ ఫిష్ 1 కేజీ రూ. 6500 వరకు ఉంటుంది. ఇక మామూలు సీయర్ ఫిష్ రూ. 800 నుంచి అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సియర్ ఫిష్ సేర్విన్గ్స్ గుండెపోటు ప్రమాదాన్ని దాదాపు మూడింట ఒక వంతు తగ్గించగలవు. ఎందుకంటే ఇందులో గుండెకు అవసరమయ్యే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి శరీరం అంతటా మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇందులో ప్రోటీన్, విటమిన్ బి – 12, సెలీనియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది పెద్దప్రేగు శోద చికిత్సకు ప్రయోజనకరమైన ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలను మంచి మొత్తంలో కలిగి ఉంటుంది.
సీయర్ ఫిష్ లో ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి చికిత్సలో సహాయపడుతుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ సియర్ ఫిష్ మెదడుకు నిజంగా మంచిదే అయినప్పటికీ పరిగణించవలసిన జాగ్రత్తలు ఉన్నాయి. వికారం లేదా అనారోగ్యానికి కారణమయ్యే టాక్సిన్ సంభావ్యతను నివారించడానికి చేపలను తినకూడదు. గర్భిణీ స్త్రీలు గర్భాస్త్రావం లేదా పిండం దెబ్బతినే అవకాశాన్ని నివారించడానికి ఈ చేపల వినియోగాన్ని పరిమితం చేయాలని వైద్యుల అభిప్రాయం. చేపలలో అనేక గ్రాముల పాదరసం ఉండవచ్చు.. అందుకే చేపలు తాజాగా ఉన్నాయా లేదా అని చూసుకోవడం మంచిది. పచ్చి చేపలను తినడం వల్ల టాక్సో ప్లాస్మా వంటి బాక్టీరియా మరియు వైరస్ ఇన్ఫెక్షన్లు కలగవచ్చు. అందువల్ల వీటిని తినే ముందు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చిన్నపిల్లలు వైద్యులను సంప్రదించి తినాలి.