పాప్ కార్న్ – పాప్ కార్న్ లో పీచు అధికంగా వుంటుంది కేలరీలు తక్కువ. ఈ ఆహారం తింటూ వుంటే నోరు నిరంతరం పనిచేస్తూనే వుంటుంది కనుక ఎంతో తృప్తిని కలిగించినట్లు భావిస్తాం. అయితే వీటిలో వెన్న, జున్ను ఇతర కొవ్వు సంబంధిత పాప్ కార్న్ తినకండి. ఓట్ మీల్ – దీనిలో కార్బోహైడ్రేట్లు అధికం. జీర్ణం అవటానికి సమయం తీసుకుంటుంది. కనుక ఎనర్జీ చాలా నెమ్మదిగా వస్తుంది. అధిక సమయం కడుపు నింపి వుంచుతుంది. బ్రేక్ ఫాస్ట్ గా ఈ ఆహారం బాగుంటుంది.
బాదం మరియు ఆక్రోట్లు – వీటిలో కావలసినంత పీచు, ప్రొటీన్లు, కొవ్వు మినరల్స్, సూక్ష్మపోషకాలు వుంటాయి. కొవ్వు పెరగకుండా మీకు కావలసినంత ఎనర్జీనిస్తాయి. కొవ్వు తక్కువగా వుండే పాల ఉత్పత్తులు – కొవ్వు తీసిన ఛీజ్, పెరుగు వంటివి కొవ్వు కరిగించే కాల్షియం అందిస్తాయి. తగిన కాల్షియం తీసుకోపోతే కొవ్వు అధికంగా నిల్వ వుంటుందని కూడా స్టడీస్ చెపుతున్నాయి. బీన్స్ – ఫైబర్, ప్రొటీన్లు అధికం. జీర్ణం కావటానికి అధిక సమయం పట్టడంతో కడుపు నిండుగా వుంటుంది. ప్రొటీన్లు మానసికంగా తృప్తి కలిగిస్తాయి. మరల మరల తినాలన్న ధ్యాస వుండదు.
జోవార్, బజ్రా, రాగి వంటి ధాన్యాలు కార్బో హైడ్రేట్లు కలిగి వుండి జీర్ణక్రియలో మెల్లగా గ్లూకోజ్ రిలీజ్, వీటిలో కావలసినంత ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా వుండి మెటబాలిజం పెంచుతాయి. ఆపిల్స్ – వీటిలో నీరు అధికం, ఫైబర్ అధికంగా వుండటం వలన కడుపునిండినట్లు భావించేస్తాము. యాపిల్ తొక్కలో పెక్టిన్ ఫైబర్ ఆకలిని చంపే ఔషధంలా పనిచేస్తుంది. బరువు ఎక్కకుండా చేస్తుంది.