Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఉద్యోగం చేసే మ‌హిళ‌లు గ‌ర్భ‌ధార‌ణ సమ‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

Admin by Admin
April 10, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ రోజుల్లో మహిళలు.. మగవారితో సమానంగా ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇంట్లోనూ, ఆఫీసుల్లో పనులు చక్కదిద్దుతూ.. శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే, పెళ్లైయిన ప్రతి మహిళ గర్భం ధరించడం సహజమే. వర్కింగ్‌ మహిళలు ప్రెగ్నెన్సీలో ఎన్నో ఛాలెంజెస్‌ ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని ఉద్యోగాల్లో రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయాల్సి రావచ్చు.. మరికొన్ని పనుల్లో ఎక్కువ సమయం నిల్చొనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనుల్లో బిజీగా ఉండి సరిగ్గా తినకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇవన్నీ బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. వర్కింగ్‌ మహిళలు, ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. పండంటి బిడ్డకు జన్మ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం కడుపులో బిడ్డ ఎదుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది. పనిలో పడి తిండి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పోషక విలువలున్న కూరగాయలు, పండ్లు మీ డైట్‌లో ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ అధికంగా ఉండే చిక్కుళ్ళు, మొలకలు, పాలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. స్నాక్స్‌గా సలాడ్స్‌, నట్స్‌‌‌ తీసుకోండి. నీరు ఎక్కువగా తాగండి, నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు సిప్‌ చేస్తూ ఉంటే.. హైడ్రెటెడ్‌గా ఉంటారు. మీ డైట్‌లో ఫోలెట్‌, ఐరన్‌, క్యాల్షియం రిచ్‌ పుడ్స్‌ ఉండేలా చూసుకోండి.

working women who are pregnant follow these tips

కడుపులోని బిడ్డకు రక్త ప్రసరణ మెరుగ్గా జరగడానికి.. రాత్రి పది గంటల నిద్ర అవసరం. గర్భిణి స్త్రీలు ప్రశాంతంగా నిద్రపోతే.. ఇన్ఫ్లమేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో తగినంత నిద్ర లేకపోవడం వల్ల నిరాశ, జస్టేషనల్‌ డయాబెటిస్‌, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, పిండం అభివృద్ధిలో బలహీనతకు దారితీస్తుంది. మీకు ఆఫీస్‌లో అలసటగా ఉంటే.. మధ్యాహ్నం పూట 15 నిమిషాలు నిద్రపోయినా మంచిదే. ఆఫీసు కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో పాదాలలో నొప్పి, వాపు సమస్య ఉండవచ్చు. పని మధ్యలో లేచి.. కొద్ది సేపు ఆఫీస్‌ చూట్టూ నడిస్తే.. పాదాలు, కాళ్ల వాపులు, గడ్డకట్టడం, అనారోగ్య సిరలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. భారీ వ్యాయామం, శ్రమతో కూడిన పని, ట్రైనింగ్‌కు దూరంగా ఉండండి. రాత్రి పూట నిద్రించే సమయంలో.. పాదాలను ఎత్తులో ఉంచండి.

ప్రెగ్నెన్సీ సమయంలో అతిగా పనిచేయడం, ఎక్కువగా అలసిపోవడం మంచిది కాదు. దీని కారణంగా ఒత్తడి, ఆందోళన పెరుగుతాయి. ఇది బిడ్డ ఎదుగుదలపై ఎఫెక్ట్‌ చూపుతుంది. వేళకు పనులన్నీ పూర్తయ్యేలా ఉదయమే చక్కటి ప్రణాళిక వేసుకుంటే సాయంత్రానికల్లా పనులన్నీ చకచకా పూర్తవుతాయి మీ షెడ్యూల్‌కు కట్టుబడి పనిచేసేలా ప్రయత్నించండి. పనికి మధ్యలో ఒత్తిడికి గురికాకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా పొట్టపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు. గర్భధారణ సమయంలో మీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది కాదు. ఇది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. ఊపిరి ఆడకపోవడానికి కూడా కారణం కావచ్చు. లూస్‌గా ఉండే.. కాటన్‌ బట్టలు వేసుకోండి.

Tags: pregnantworking women
Previous Post

ఈ త‌ప్పులు చేశారంటే.. మీ సంప‌ద త‌గ్గుతుంది జాగ్ర‌త్త‌..

Next Post

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ ఒత్తిడి మాయం అవుతుంది..

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.