Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home information

రైలు బోగీల‌పై, లోప‌ల ఉండే ఈ నంబ‌ర్లు, అక్ష‌రాలకు అర్థం ఏమిటో తెలుసా..?

Admin by Admin
July 5, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భార‌తీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థో అంద‌రికీ తెలిసిందే. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణిస్తుంటారు. దేశ‌వ్యాప్తంగా అనేక ట్రెయిన్లు నిత్యం న‌డుస్తూ ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేస్తూ ఉంటాయి. అయితే… ఎప్పుడు ట్రెయిన్ ఎక్కినా మ‌నం వెళ్లాల్సిన ట్రెయిన్ నంబ‌ర్‌, అది వ‌చ్చే ప్లాట్‌ఫాం, మ‌న ద‌గ్గ‌ర టిక్కెట్ ఉందా, లేదా… ఇదిగో ఇవే విషయాల‌ను మ‌నం గ‌మ‌నిస్తాం. కానీ.. బాగా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే మ‌న‌కు మ‌రికొన్ని విష‌యాలు తెలుస్తాయి. అవేమిటంటే… ట్రెయిన్ బోగీల‌పై మీరెప్పుడైనా నంబ‌ర్లను చూశారా..? చూసే ఉంటారు కానీ వాటి గురించి అంత‌గా ప‌ట్టించుకుని ఉండ‌రు. బోగీ లోప‌ల కూడా ఇంత‌కు ముందు చెప్పిన లాగానే అంకెలు కాకుండా అక్ష‌రాలు ఉంటాయి. అవును, అవే. అయితే ఈ రెండింటి వ‌ల్ల మ‌న‌కు ప‌లు విష‌యాలు తెలుస్తాయి. అవేమిటో కింద చూద్దాం.

ట్రెయిన్‌పై ఉదాహ‌ర‌ణ‌కు 98337 అనే నంబ‌ర్ ఉంటే దీని అర్థం ఏమిటంటే… ముందు ఉన్న రెండు నంబర్లు ఆ బోగీ త‌యారైన సంవ‌త్స‌రాన్ని సూచిస్తాయి. అంటే అందులో 98ని తీసుకుంటే ఆ బోగీ 1998లో త‌యారైంద‌ని అర్థం. అలాగే 8439 అని ఉంద‌నుకోండి, అప్పుడు ఆ బోగీ 1984లో త‌యారైంద‌ని తెలుసుకోవాలి. సాధార‌ణంగా ఈ సంఖ్య‌లు 4, 5 లేదా 6 నంబ‌ర్ల‌ను క‌లిగి ఉంటాయి. ఎన్ని నంబ‌ర్లు ఉన్నా మొద‌టి రెండు అంకెలు మాత్రం ఆ బోగీ త‌యారైన సంవ‌త్స‌రాన్నే తెలియ‌జేస్తాయి. అయితే రాజ‌ధాని వంటి కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు నంబ‌ర్లు ఇలా ఉండ‌వు. 2951/2 అని ఉంటాయి. ఇక పైన చెప్పిన 98337 అనే నంబ‌ర్‌లోని చివ‌రి మూడు అంకెల‌కు కింది కోడ్ ఉంటుంది.

do you know the meaning of these numbers on train coaches

పైన తెలిపిన నంబ‌ర్‌లోని చివ‌రి మూడు అంకెలు 001 నుంచి 025 మ‌ధ్య‌లో ఉంటే ఆ బోగీ ఏసీ ఫ‌స్ట్ క్లాస్ బోగీ అని తెలుసుకోవాలి. ఇక ఆ త‌రువాత ఉంటే ఏ బోగీలో ఇప్పుడు చూద్దాం. 025 – 050 మ‌ధ్య ఉంటే : Composite 1st AC +AC-2T (ఏసీ 2 టైర్‌). 050-100 అయితే : AC 2T, 101-150 మ‌ధ్య ఉంటే : AC 3T (ఏసీ 3 టైర్‌), 151-200 మ‌ధ్య అయితే : AC Chair Car, 201-400 అయితే : Sleeper 2nd Class, 401-600 అయితే : General Second Class, 601-700 మ‌ధ్య అయితే : 2L Sitting Jan Shatabdi Chair Car, 701-800 మ‌ధ్య అయితే : Sitting Cum Luggage Rake అని అర్థాలు వ‌స్తాయి. అంటే పైన చెప్పిన 98337 అనే నంబ‌ర్‌లో 98 అనే నంబర్ల ద్వారా ఆ బోగీ 1998లో త‌యారైన‌ట్టు తెలిస్తే, ఇక 337 అనే నంబ‌ర్ల ప్ర‌కారం ఆ బోగీ పైన వివ‌రాల‌ ప్ర‌కారం స్లీప‌ర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది.

ఇక రైలు బోగీల‌లో WGSCN అనే కోడ్ ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే… W అంటే – prefix సిరీస్ ప్రారంభ అక్ష‌రం. G అంటే – Self-generating (lighting by axle generators) – స్వయం చాలిత బోగీ, S అంటే – సెకండ్ క్లాస్ (Second Class), CN అంటే: 3-tier sleeper coach (3 టైర్ స్లీప‌ర్ కోచ్‌). అయితే ఇక్క‌డ WGSCNలో చివ‌ర‌న ఉన్న రెండు అక్ష‌రాలు (CN) బోగీని బ‌ట్టి మారుతాయి. అవేమిటంటే… CN అంటే – 3-tier sleeper coach, CW – 2-tier sleeper coach, CB – Pantry/kitchen car/buffet car, CL – Kitchen car, CR – State saloon, CT – Tourist car (first class) (includes bathrooms, kitchen, and sitting and sleeping compartments), CTS – Tourist car (second class) (includes bathrooms, kitchen, and sitting and sleeping compartments), C – (except as above) With Coupe, D – Double-decker, Y – (not as prefix) With Ladies compartment (usually 6-berth compartment with locking door), AC – Air-conditioned.

ఇక WGSCN కిందే నంబ‌ర్ కూడా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 96241 అనే నంబ‌ర్ ను తీసుకుంటే ఆ బోగీ 1996లో త‌యారైంద‌ని, 241 అంటే ఆ బోగీ స్లీప‌ర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది.

Tags: train coaches
Previous Post

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

Next Post

శివుడు కేవ‌లం లింగ రూపంలో మాత్ర‌మే ఎందుకు ద‌ర్శ‌నం ఇస్తాడు..?

Related Posts

Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025
పోష‌ణ‌

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

July 21, 2025
హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.