ముందుగా బయటకి మనకి ఎలా కనిపించినా భారత్ – పాక్ ఇద్దరూ పరిస్థితులు చేయిజారకుండా జాగ్రత్తగా దాడులు చేసుకున్నారు. అదెలా? పాకిస్తాన్ 300 – 400 డ్రోన్స్ భారత్ మీదకి పంపింది కానీ చాలా డ్రోన్స్ లో బలహీనమైన మందుగుండు ( payload ) వినియోగించింది. దానికి కారణం ఒకటి probing action. డ్రోన్స్ ని పంపి మన రక్షణ వ్యవస్థ పటుత్వాన్ని, సంసిద్ధత, coverage, reaction time, ఆధునికత పరీక్షించి, మన రక్షణ వ్యవస్థలో లోపాలను కనుక్కోవడానికి, Data gather చేయడం ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తుంది.
రెండు, బలమైన payload ఉపయోగించి ఒకవేళ అది తీవ్ర నష్టం చేస్తే, భారత్ కూడా బలంగా స్పందించే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించింది.
ఈ probing action కి భారత్ దీటుగా సమాధానం ఇస్తూనే, ప్రతిగా బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ airfields మీద దాడిచేసింది, భారత్ కూడా ఇక్కడ జాగ్రత్త వహించింది. Runway, support vehicles, awacs లాంటి వాటిని మాత్రమే లక్ష్యం చేసుకుంది తప్ప విస్తృతమైన విద్వంసం వైపు వెళ్లలేదు. కాబట్టి ఇరు దేశాలూ చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా దాడులు చేసుకున్నాయని చెప్పవచ్చు.