Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

ట్రెయిన్ లో భిక్ష అడిగిన బిచ్చ‌గాడికి ఆ వ్యాపార‌వేత్త ఏమీ ఇవ్వ‌లేదు.. ఆలోచింప‌జేసే క‌థ‌..!

Admin by Admin
June 11, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒకసారి ఒక బిచ్చ గాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్, బూట్లు ధరించి ఉండటం గమనించాడు. ఈ వ్యక్తి చాలా ధనవంతుడని అతను భావించాడు. కాబట్టి నేను అతనిని అడిగితే అతను ఖచ్చితంగా దానంచేస్తాడు అనుకొని అతని దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు. ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి… మీరుఎల్లప్పుడూ అడుక్కుంటూ, ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా… మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా? అని అడిగాడు ఆ వ్యక్తి. ఆ బిచ్చగాడు, సార్, నేను బిచ్చగాడిని, నేను ప్రజలను డబ్బును మాత్రమే అడగగలను. కానీ నేను ఎవరికైనా… ఏదైనా ఎలా ఇవ్వగలను? చెప్పండి అన్నాడు. ఆ మాట విన్న ఆవ్యక్తి ఇలా అన్నాడు, మీరు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు, మీరు కూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా. నేను ఒక వ్యాపార వేత్తని అంతేకాక లావా దేవీలను మాత్రమే నమ్ముతాను. మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే, మీకు ప్రతి ఫలంగా ఏదైనా ఇస్తాను.. అన్నాడు.

అప్పుడే, రైలు ఒక స్టేషన్‌కు రావడం జరిగింది. ఆ వ్యాపారవేత్త ట్రైన్ దిగి వెళ్లి పోయాడు. బిచ్చగాడు ఆ వ్యాపారవేత్త చెప్పినదాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అతనిమాటలు ఎలాగోలా బిచ్చగాడి హృదయాన్ని చేరుకున్నాయి. ప్రతిఫలంగా నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేనందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేను అనిఅనుకొంటూ… ఆలోచించడం మొదలు పెట్టాడు. కానీ నేను బిచ్చగాడిని, ఎవరికైనా ఇవ్వడానికి నా దగ్గర విలువైనదేదీ లేదు కదా..! అయినా ఎంతసేపు నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా…. ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమి బాగా లేదు.. అని లోతుగా ఆలోచించిన తరువాత, భిక్షగాడు దానం అడిగే దాని కన్నా ముందు ఏదైనా తన వద్ద వుంటే, అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు వున్న ప్రశ్న ఏమిటంటే, అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వ గలడు? రోజంతా దీని గురించే ఆలోచిస్తూ గడిచింది. కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు.

how a begger turned into business man with his idea

మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్న ప్పుడు, అతని కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని అందమైన పువ్వుల మీద పడ్డాయి. అతనికి ఒక ఆలోచన వచ్చి, వాళ్ళు చేసే దానానికి బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకొన్నాడు. అతనికి ఈ ఆలోచన నచ్చి, వెంటనే అక్కడ నుండి కొన్ని పువ్వులు తెచ్చుకున్నాడు. భిక్షాటన చేయడానికి రైలు ఎక్కడు. ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు, అతను వారికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చేవాడు. ప్రజలు ఆ పువ్వులను తమతో సంతోషంగా ఉంచుకునేవారు. ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజూ కొన్ని పువ్వులు తెచ్చుకుని, భిక్షకు ప్రతిఫలంగా ఆ పువ్వులను ప్రజలకు పంచుతూ ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే అతను చాలా మంది తనకు భిక్ష పెట్టడం మొదలు పెట్టడాన్ని అతడు గ్రహించాడు. అతను స్టేషన్ దగ్గర ఉన్న పూలన్నింటినీ తెంపేవాడు. అతనికి పువ్వులు ఉన్నంత వరకు, చాలా మంది అతనికి భిక్ష పెట్టేవారు. కానీ అతనితో ఎక్కువ పువ్వులు లేనప్పుడు, అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు. ఇలా ప్రతి రోజూ కొనసాగుతూ ఉండేది.

ఒకరోజు అతను భిక్షాటనచేస్తున్నప్పుడు, అదే వ్యాపారవేత్త రైలులో కూర్చుని ఉండడం చూశాడు, అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు. భిక్షగాడు వెంటనే అతని దగ్గరకు వెళ్లి, ఈ రోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి అవి మీకు ఇస్తాను అన్నాడు. అప్పుడా వ్యాపారవేత్త అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో, ఆ బిచ్చగాడు అతనికి ప్రతిగా కొన్నిపువ్వులు ఇచ్చాడు. ఆ వ్యాపార వేత్తకు బిక్షగాడి ఆలోచన బాగా నచ్చింది. బాగా ఆకట్టుకున్నాడు. అతను, వావ్! ఈ రోజు మీరు కూడా నాలాగే వ్యాపార వేత్తగా మారారు! అని అభినందించి బిచ్చగాడి నుండి పువ్వులు తీసుకొని, అతను ప్రక్క స్టేషన్‌లో దిగిపోయాడు. మళ్ళీ మరోసారి, ఆ వ్యాపార వేత్త మాటలు బిచ్చగాడి హృదయంలోకి చేరుకున్నాయి. అతను ఆ వ్యక్తి చెప్పిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండటం ప్రారంభించాడు.

అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించటం ప్రారంభించాయి, అతను ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల విజయానికి బాటని కనుకొన్నానని అతను భావించాడు. అతను వెంటనే రైలు నుండి దిగి ఉత్సాహంగా ఆకాశంవైపు చూస్తూ…. చాలా బిగ్గర గొంతుతో ఇలా అన్నాడు, నేను ఇకపై బిచ్చగాడిని కాదు, నేను ఇప్పుడు వ్యాపారిని, నేను కూడా ఆ పెద్దమనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను, నేను కూడా ధన వంతుడిని కాగలను అని అనడం జరిగింది. అక్కడున్న ప్రజలు అతడిని చూసి, బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడై ఉంటాడని అనుకున్నారు. మరుసటి రోజు నుండి ఆ బిచ్చగాడు మళ్లీ ఆ స్టేషన్‌లో కనిపించ లేదు. నాలుగు సంవత్సరాల తరువాత, సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు, అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి, మీరు నన్ను గుర్తించారా? అని అడిగాడు.

మరొక వ్యక్తి లేదు! బహుశా మనం మొదటి సారి కలుస్తున్నామేమో.. అని అనడం జరిగింది. మొదటి వ్యక్తి మళ్లీ అన్నాడు, మనం మొదటిసారి కలుసు కోవడం కాదు., ఇది మూడోసారి అన్నాడు. రెండవ వ్యక్తి, అవునా.. సరే, నాకు గుర్తులేదు. మనం ఎప్పుడు కలుసు కున్నాము? అని అడగడం జరిగింది. అప్పుడా మొదటి వ్యక్తి నవ్వి, మనం ఇంతకు ముందు ఒకే రైలులో రెండుసార్లు కలుసుకున్నాము. నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చ గాడిని, రెండవ సమావేశంలో నేను నిజంగా బిజినెస్ మ్యాన్ అని మీరు నన్ను మెచ్చు కొన్నారు అది కూడా నేనే……!! ఫలితంగా, ఈ రోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని ఇప్పుడు…. అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను. మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు .. దాని ప్రకారం… మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకుఏదైనా లభిస్తుంది! అని. ఈ లావాదేవీ నియమం నిజంగా పనిచేసింది. నేను దానిని బాగా అనుభూతి చెందాను, అంతకు మునుపు నేను ఎప్పుడూ… నన్ను నేను బిచ్చగాడిగానే భావించుకొనే వాణ్ని, నేను దాని కంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు.

కానీ.. నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు, నేను…ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు. మీకు ధన్యవాదాలు, ఆ రోజు నుండి, నా దృక్పథం మారిపోయింది. ఇప్పుడు నేను వ్యాపార వేత్తగా మారాను, నేను ఇకపై బిచ్చగాడిని కాదు.. అని ఆ వ్యాపార వేత్తతో అనడం జరిగింది. బిచ్చగాడు తనను తాను బిచ్చగాడిగా భావించినంత కాలం, అతను బిచ్చగాడుగానే ఉన్నాడు. తనను తాను వ్యాపార వేత్తగా భావించి నప్పుడు, అతను ఒకవాపారవేత్తగా ఎదిగాడు.

Tags: beggerbusiness man
Previous Post

లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను మ‌రోమారు ప‌రీక్షించ‌నున్న భార‌త్‌.. ఎందుకంటే..?

Next Post

అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ తమ ముఖాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.