Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

గారాబం చేస్తే ఇలా అవుతుందా..? థైరోకేర్ వ్యవస్థాపకుడి అద్భుతమైన పేరెంటింగ్‌ పాఠం..

Admin by Admin
May 16, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అతిగారాబం ఎన్నటికీ అనర్థమే అని మన పెద్దలు చెబుతుంటారు. పిల్లల్ని ముద్దు చేయాల్సినప్పుడూ ముద్దు చేయాలి, బాధ్యతయుతంగా ప్రవర్తించకపోతే గట్టిగా మందలించాలి కూడా. రెండూ సమతూకంలో ఉండాలి లేదంటే..ఎందుకు పనికిరానివారుగా తయారవుతారని హెచ్చరిస్తున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు. గారాబం వల్ల చిన్నారులు పాడైపోవడమే గాక అది మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో..తెలియజేసే అద్భుతమైన రియల్‌ స్టోరీని షేర్‌ చేసుకున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ. వేలుమణి. మంచి పేరేంటింగ్‌ కుటుంబానికి ఎలా శ్రీరామరక్షలా ఉంటుందో హైలెట్‌ చేసి మరీ చెప్పారు. మరీ కథేంటో చూద్దామా. 1980ల ప్రారంభంలో, డాక్టర్ వేలుమణి BARC(బాబా అటామిక్‌​ రీసెర్చ్‌ సెంటర్‌)లో ఉద్యోగం చేసేవారట. ఆ సంపాదనతో తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేదట. దాంతో మరోవైపు ట్యూషన్‌లు కూగా చెప్పేవారట వేలుమణి.

తన ఇంటికి సమీపంలో శివాజీ పార్క్‌లో నివసిస్తున్న ఒక ధనవంతురాలైన మార్వారీ మహిళ ద్వారా ఆయనకు ట్యూషన్‌ చెప్పే అవకాశం లభించింది. ఆమె తన కొడుకు నాల్గవ తరగతి చదువుతున్నాడని, అతనికి ట్యూషన్‌ చెప్పాల్సిందిగా వేలుమణిని కోరారట. తన కొడుకుకి చదువు రావడమే ముఖ్యం అని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని వేలుమణికి చెప్పారామె. ఇప్పటికే నలుగురు ట్యూటర్ల మార్చామని అయినా మా అబ్బాయికి చదువు మాత్రం అబ్బలేదని కూడా వాపోయిందట. చదువు వచ్చేలా చేయాలిగానీ, మా అబ్బాయి సంతోషానికి ఆటంకం ఉండకూడదనే షరతు విధించిందట ఆ తల్లి. అయితే వేలుమణి మంచి జీతం వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆ అబ్బాయికి ట్యూషన్‌ చెప్పేందుకు అంగీకరించారట. కానీ ఆ పిల్లవాడి సంతోషంగా ఉంచేలా పాఠాలు చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే..చదువు రావాలంటే ఒక్కొసారి కష్టపెట్టక తప్పదు. అయితే ఆ తల్లి షరతు మేరకు ఆ కుర్రాడికి అలరించేలా కథలు చెబుతూ పాఠాలు చెప్పే యత్నం చేసేవారు వేలుమణి.

parents do not make kids enjoy

సంతోషంగా ఉండేలా చూడాలి కాబట్టి ఏవిధంగా బలవంతం చేయడానికి వీలులేదు. అందువల్ల వేలుమణి హాస్యభరితమైన కథలతో చదువుపై ఆసక్తికలిగేలా చేశారు. అది చూసి ఆ పిల్లాడి తల్లి వేలుమణి జీతాన్ని నెలకు రూ. 300 నుంచి రూ. 600లకు పెంచేసింది. బార్క్‌లో సంపాదించిన దానికంటే అధిక జీతం, పైగా ప్రయాణపు ఛార్జీలు కూడా ఆ తల్లే చెల్లించేదట. అయితే అతడికి నేర్పించాల్సిన చదువును నేర్పించలేకపోతున్న అనే అపరాధభావం కలిగి మానేయాలనుకున్నారట వేలుమణి. కానీ ఆ కుటుంబం మరింత జీతం పెంచి తన పిల్లాడికి చదువు చెప్పాల్సిందిగా బలవంతం చేశారు. దీంతో ఆయన అలా 1983 నుంచి 1984 వరకు అతడికి ట్యూసన్‌ చెప్పడం కొనసాగించారు. అంతేగాదు ఆ అదనపు డబ్బుతో తన ఆరోగ్యానికి, ఆంగ్లంలో పట్టు సాధించడానికి వినియోగించుకున్నాడట. అయితే ఆ బాలుడికి శతవిధాల చదువు నేర్పించే యత్నం చేసినా..ఏం నేర్చుకోలేకపోయాడట. చివరికీ..కనీసం ఇంటర్మీడియట్‌ కూడా ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.

ఆ తర్వాత వేలుమణి కూడా ట్యూటర్‌గా కొనసాగడం మానేయడం వంటివి జరిగాయి. అలా దశాబ్దాలు గడిచాక.. అనూహ్యమైన మలుపు తిరిగింది. ఆ సంపన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అనుకోని విధంగా డాక్టర్ వేలుమణి భార్య చివరికి అదే బాలుడికి థైరోకేర్‌లో హార్డ్‌వేర్ టెక్నీషియన్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ..ఆ తల్లి తన కొడుకు ఏ కష్టం తెలియకుండా పెరగాలనుకుంది..అదే చివరికి కుటుంబానికి శాపంగా మారిపోయింది. అంతేగాదు కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడూ.. కొడుకు ఆసరాగా నిలవలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చిందామెకు. గారం తెచ్చిపెట్టే అనర్థం ఇలా ఉంటుంది. పరిస్థితులు తారుమారైనప్పుడూ.. కష్టపడక తప్పదని ఆ తల్లి చెప్పలేకపోయింది, పైగా ఆ పిల్లాడు తెలుసుకోలేడు కూడా.

ఇక్కడ పిల్లల్ని క్రమశిక్షణాయుతంగా పెంచడం అనేది గొప్ప పేరేంటింగ్‌కి సంకేతం. దాన్ని చాలా జాగ‌రుకతతో నిర్వహించాలి. అదే భవిష్యత్తులో కుటుంబ ఉన్నతికి దోహదపడుతుందని నొక్కి చెప్పారు వేలుమణి. నెట్టింట షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ ..ప్రతి నెటిజన్‌ మనసుని దోచుకుంది. సార్‌ ఇది మంచి స్ఫూర్తిదాయకమైన కథ అని డాక్టర్‌ వేలుమణిని ప్రశంసించారు. చివరగా వేలుమణి తల్లిదండ్రులు గారాబంగా పెంచకండి, విలాసవంతంగా పెరగాలని కోరుకోవద్దని..నేటి కాలానికి అస్సలు పనికిరాదని వ్యాఖ్యానించారు.

Tags: parentsvelumani
Previous Post

చంటిపిల్లలను ఎందుకు కాళ్ల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తారో తెలుసా?

Next Post

మీ కల లేదా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నమ్మకం అనేది ఎంత ముఖ్యం? దాన్ని ఎలా పెంచుకోవాలి?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.