ఈ అనుమానం లో న్యాయం ఉంది. కొంచం వివరంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అమెరికా దగ్గర ఎందుకు లేదు? అమెరికా తన priorities ని నిర్ణయించుకున్నపుడు, పెట్టుబడి, efforts , stealth మీద ఎక్కువ పెట్టింది. అందువల్ల 1983 లో నే F-117 Nighthawk లాంటి విమానాన్ని అభివృద్ధి చేసుకుంది. అంత ఖర్చు పెట్టే స్థితిలో సోవియట్ యూనియన్ లేదు.
అలాగే అమెరికన్ aircraft కెరియర్ లకు కూడా జవాబు చెప్పాలి …. వీటన్నింటికీ పరిష్కారం గా పెట్టుబడి రాడార్, క్షిపణుల మీద పెట్టింది. అమెరికా సూపర్ sonic cruise missiles మీద పెట్టుబడి పెట్టాలి అనుకోలేదు. Speed తక్కువ అయినా ఫర్వాలేదు ( వేగాన్ని త్యాగం చేసి ) long range , stealthy, accuracy ఉన్న cruise missile tech మీద దృష్టి పెట్టింది.
అందువల్ల, అమెరికా అన్ని రంగాలలో రష్యా ని దాటేసినా, ఈ విషయంలో దాటలేకోవడానికి కారణం రష్యా వాటిమీదే ఆధారపడి 50 సంవత్సరాలుగా వాటి అభివృద్ధి ఆపలేదు. అందువల్ల రష్యా ముందు ఉంది. మనకి ఆ సాంకేతికత ఎలా లభించింది? రష్యా ఆ క్షిపణులను మనకి అమ్మడం, మన పెట్టుబడితో వాటిని అభివృద్ధి చేయడం చేస్తుంది కాబట్టి అవి మనదగ్గరకి వచ్చాయి.