స్వామి రారా అనే సినిమా లో ఒక కామెడీ సీన్ ఉంటుంది.. ప్రతి ఒక్కడు ఎవడో ఒకడికి తుపాకీ గురిపెడతాడు, ఎవరూ ఎవర్ని కాల్చడు , హాండ్స్ అప్ అంటదు అంతే, చివరికి రవి బాబు కి చిరాకొచ్చి ఇక్కడ ఎవడూ ఎవడ్ని కాల్చడు కానీ గన్స్ దించండి ఎహె అంటాడు .. అలాంటిదే ఈ రష్యా- ఉక్రెయిన్ పంచాయితీ కూడా..
ఇదంతా పెద్ద నాటకం.. నిజానికి ఇప్పుడు ప్రపంచంలో ఏ రెండు అగ్ర దేశాలకూ కూడా ప్రత్యక్ష యుద్ధం వచ్చే అవకాశం లేనే లేదు.. రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు.. ఆయుధాల సంగతి ప్రక్కన పెడితే , ఇప్పుడు రష్యా అంత ప్రభల ధనిక దేశం కూడా కాదు, ఇప్పుడు పోటీ అంటూ ఉంటె, అది కేవలం అమెరికా- చైనా మధ్య మాత్రమే..
ఇక్కడ రష్యా-చైనా – ఉత్తర కొరియా ఈ మూడూ మిత్రదేశాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున కిరాయి సైనికులుగా కొరియా పౌరులు వెళ్లారని వార్తలు వింటున్నాం.. కాబట్టి అమెరికా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది.. ట్రంప్ కి చైనా అంటే భయం, రష్యా వారితో తెర వెనుక స్నేహం ఉంది.. కొరియా కి ప్రత్యేక అజెండా ఏమీ లేదు, చైనా ఎంత చెప్తే అంత..
మొన్న జరిగిన ఒక సమావేశంలో నేరుగా జిలెన్స్కి ని అవమానించారు ట్రంప్ , మీ దేశంలో ఉన్న ఖనిజాలు మాకు కావాలి , అందుకు ప్రతిగా మధ్యవర్తిత్వం చేసి మీకు రష్యా కి మద్యన ఉన్న యుద్ధం ఆపుతాము, అని ఒక చిల్లర పంచాయితీ చేసాడు.. జిలెన్స్కి ముందు కంగారు పడ్డా కూడా , తర్వాత పక్కాగా ప్లాన్ చేసి, ఎవరూ ఊహించని విధంగా డ్రోన్ల తో రష్యా మీద దాడి చేసి , వారికి భారీ నష్టం చేసాడు.. ఇదంతా ఒక డైలీ సీరియల్ కన్నా దారుణం.
అమెరికా ని ఒక్క తాపు తన్ని, ఇది మా అన్నదమ్ముల సమస్య మేము చేసుకుంటాము అని చెప్పినప్పుడే, ఈ సమస్య కి పరిష్కారం లభిస్తుంది.. లేకపోతే మాత్రం మరో 20 ఏళ్ళు అమెరికా ఆయుధ వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది.. . స్వస్తి…