Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home international

దావూద్ ఇబ్ర‌హీంను భార‌త ఇంటెలిజెన్స్ అధికారులు చంప‌కుండా ఆపిన అదృశ్య శ‌క్తి ఎవ‌రు..?

Admin by Admin
May 29, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దావుద్ ఇబ్రహీంని చంపడానికి భారత గూఢచర్య సంస్థ రా (RAW).. చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ వివరాలు అతడికి చివరి నిమిషంలో తెలిపి, అతడిని కాపాడిన ఆ అదృశ్య శక్తి ఎవరు.? ముందుగా మ‌నం అజిత్ దోవ‌ల్ గురించి తెలుసుకుందాం. అజిత్ దోవల్. ఇతను 2005 జనవరిలో ఇంటెలిజెన్సు బ్యూరో డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. ఆపరేషన్ దావూద్ ని చంపడానికి పధకం నేసింది రా కాదు. ఇంటెలిజెన్సు బ్యూరో. అప్పటికే ఒక వార్త ఆయనకు తెలిసింది. జూలైలో దావూద్ ఇబ్రహీం కూతురైన మహరుఖ్ కు, క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునైద్ కు జూలై 9న మక్కాలో నిక్కా అంటే వివాహము, జూలై 13న దుబాయ్ గ్రాడ్ హయత్ హొటల్ లో రిసెప్షను జరుగుతుందని తెలిసింది.

అజిత్ దోవల్ దావూద్ ని తుదముట్టించడానికి ఇదే సరైన అవకాశమని భావించాడు. దావూద్ ఇబ్రహీంని ఐక్యరాజ్యసమితి ఇంటర్ నేషనల్ టెర్రరిస్టుగా గుర్తించడం వల్ల అతనికి పాకిస్థాన్ నుంచి బయటకు రావడం చాలా కష్టంగా మారింది. ఇంటిలిజెన్సు బ్యూరో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి నిర్ణయించుకుని దానిని అమలు చేసే బాధ్యతను అజిత్ దోవల్ కి అప్పగించింది. ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్ అవడమూ, అందులో అది పరాయి దేశంలో అమలు కావలసి ఉండడంతో, భారత ప్రభుత్వము దీనిని అధికారికంగా చేపట్టలేదు.అందులో ప్రభుత్వ కమేండోలను ఉపయోగిచడం చాలా పెద్ద సాహసమవుతుంది. కాబట్టి ఇంటెలిజెన్సు బ్యూరో అధికార కమెండోలను కాక ఛోటా రాజన్ అనుచరులను దీనికి ఉపయోగించుకోడానికి నిర్ణయించింది.

who stopped indian officials from killing dawood ibrahim

1993 బొంబాయి పేలుళ్ల తర్వాత దావూద్, ఛోటా రాజన్ న మధ్య బాగా సంఘర్షణలు జరిగేయి. ఒకసారైతే, దావూద్, ఛోటారాజన్ ని చంపడానికి అతి చేరువ‌గా వచ్చేడు కూడానూ. ఛోటారాజన్ ఈ ప్రతిపాదనకు వెంటనే అంగీకరించి, తన ఇద్దరు అనుచరులు విక్కీ మల్హోత్రా, ఫరీద్ తనాషాను ఈ కార్యక్రమానికి నియమించాడు. అజిత్ దోవల్ వీళ్లిద్దరినీ ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి, శిక్షణ ప్రారంభించాడు. అలా మూడు వారాలపాటు శిక్షణ కొసాగింది.మూడు వారాలయ్యేసరికి వాళ్లిద్దరూ కార్యక్రమం పూర్తి చెయ్యడానికి పూర్తి సన్నద్ధతతో తయారయ్యారు. వాళ్లకి కొత్త పేర్లు ఇవ్వబడ్డాయి. సూడాన్ పాస్ పోర్టులు ఇవ్వబడ్డాయి. ప్లేన్ లో బిజినెస్ క్లాసులో ప్రయాణానికి సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఇంకా వాళ్లు బయలుదేరడానికి ఐదు రోజులు ఉందనగా, బొంబాయి పోలీసులకు సమాచారం అందింది.

బొంబాయి డిప్యూటి పోలీస్ కమీషనర్ ధనంజయ్ కమలాకర్ తన టీముతో బొంబాయి బయలుదేరేడు. అజిత్ దోవల్ ఛోటారాజన్ అనుచరులిద్దరికి ఢిల్లీ లోని ఒక ఫైవ్ స్టార్ హొటల్ లోదుబాయిలోని గ్రాడ్ హయత్ హొటల్ బ్లూప్రింట్ చూపిస్తూ, ఆఖరి సూచనలు చేస్తుండగా ధనంజయ్ కమలాకర్ తన టీముతో వచ్చి ఆ ఇద్దరిని అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అతని దగ్గర అరెస్టు వారెంటు కూడా ఉంది. అజిత్ దోవల్ అతనికి ఎంత నచ్చచెప్పినప్పటికి వినలేదు. అది రహస్య ఆపరేషన్ అవడం వల్ల దోవల్ కూడా ఏమీ చేయలేకపోయేడు. ఒక బాధ్యత గల ఇంటిలిజెన్సు ఆఫీసర్ గా అతను అసలు ఆ ఆపరేషన్ ప్లాన్ చేయలేదని ప్రకటించి, వాళ్లిద్దరూ అరెస్టయే టైముకు తాను ఇంట్లోనే ఉండి టి.వి. చూస్తున్నట్టు ప్రకటించవలసి వచ్చింది.

అయితే బొంబయి పోలీసులు దావూద్ ని రక్షించడానికి అలా చేసేరా, లేదా రొటీన్ గా వారిపై కేసులు ఉన్నాయి కాబట్టి అలా చేసేరా అన్నది ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్న. కానీ మన దేశాన్ని పీడిస్తున్న ఒక టెర్రరిస్టు నాయకున్ని వధించే ఒక అద్భుత మైన అవకాశం మాత్రం కొద్దిలో చేజారింది.

Tags: dawood ibrahim
Previous Post

ఈ సీజ‌న్ లో మీరు క‌చ్చితంగా నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగాలి.. ఎందుకంటే..?

Next Post

అజినోమోటోగా పేరొందిన మోనోసోడియం గ్లుటామేట్.. ఈ పదార్థం ఆరోగ్యానికి ప్రమాదకరమైనదా?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.