ఒకసారి రష్యా విస్తీర్ణం చూస్తే, భారత్, చైనాలతో పోల్చి , తన భూభాగాన్ని పూర్తి గా కవర్ చెయ్యాలి అంటే ఎంత పెట్టుబడి కావాలి అన్న విషయం మనకి ఒక అవగాహన వస్తుంది. చాలా కాలం గా రష్యా రక్షణ బడ్జెట్ భారత్ కన్నా తక్కువ. 2019 – 2021 మధ్య అది 48 బిలియన్ USD మించలేదు. అదే సమయంలో భారత రక్షణ బడ్జెట్ 76 బిలియన్ USD కూడా దాటింది. ఈ comparision ఎందుకంటే, మనం కేటాయిస్తున్నదే మనకి సరిపోవడం లేదు అటువంటిది రష్యా వెచ్చించే ధనం తన భూభాగాన్ని , తను ఎదుర్కునే శత్రువులను పరిగణనలోకి తీసుకుంటే చాలా చాలా తక్కువ. కస్టమర్ లు ఇచ్చిన డిపాజిట్ డబ్బులతో , loan లతో నిర్మాణాలను చేపట్టే బిల్డర్ లా ఉంది తన పరిస్థితి. మనం సంప్రదింపులు జరుపుతున్న కంటైనర్ రాడార్ technology russia దగ్గర ఉన్నప్పటికీ కేవలం ఒక్కటే Kovylkino, Mordovia లో రష్యా దగ్గర full operational గా ఉంది. ఇంకో రెండు ప్లాన్ చేస్తుంది.
5th gen fighter planes తన దగ్గర కేవలం 32 ఉన్నాయి. అందులో 10 prototypes. India ఆ program లో join అయితే పెట్టుబడి వచ్చేది, ఎక్కువ సంఖ్యలో యుద్ద విమానాలు కొంటే లాభం వచ్చేది అప్పుడు వాటిని మరింత అభివృద్ధి చేయవచ్చు, తను కొనుక్కోవచ్చు, export చేయవచ్చు…. India బయటకి రావడం తో 32 దగ్గరే పెట్టుబడి లేక ఆగిపోయింది. ఇప్పుడు, తనకి ఉన్న తక్కువ సామగ్రిని తన దేశం మొత్తం పరచడం వల్ల రష్యా నెట్వర్క్ లో గ్యాప్ లు ఉన్నాయి. యుద్ధం కారణం గా కొంత మేర వాటిని ఉక్రెయిన్ బోర్డర్ కి తరలించవచ్చు కానీ minimum deterrence అన్ని ప్రాంతాలలో ఉంచాల్సిందే, వాటిని తరలించలేరు, అలాగే fixed assets కూడా తరలించలేరు. War wastage reserve. అంటే, ఉదృతం గా ఎన్ని రోజులు యుద్ధం చేయడానికి అవసరమైన ఆయుధాలు నిల్వ ఉంచుకుంటారు అన్న లెక్క. రష్యా, ఉక్రెయిన్ తో యుద్ధం నాటికి ఎక్కువ సోవియట్ కాలం నాటి stock reserves మీద ఆధార పడింది, అవి ఆధునికం కాదు. ఆ పాతకాలపు ఆయుధాలు తక్కువ ఖర్చులో ప్రయోగిస్తుంది. ఆంక్షల కారణం గా key components లభ్యత లో రష్యా ఇబ్బందులు ఎదుర్కొంది. Replenishment ఆశించిన స్థాయిలో లేవు.
ఉన్న ఆధునిక ఆయుధాలు పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు, full scale దాడులు చేయడం లేదు. Kinzhal hypersonic missiles, Avangard glide వెహికల్ లు పొదుపుగా వాడుతుంది. దానికి రెండు కారణాలు, ఒకటి, అవి చాలా ఖరీదైనవి, రెండు, calibrated దాడులు మాత్రమే చేస్తుంది. ఒక్క ముక్కలో, రష్యా ప్రధాన ఇబ్బంది…..డబ్బులు. Russia radar, క్షిపణులు విషయంలో మంచి ప్రతిభ కనబరచినా ఎలెక్ట్రానిక్ warfare విషయం లో వెనుకబడింది ( పెట్టుబడులు లేక). అందువల్ల పాశ్చాత్య దేశాల సహాయం తో ఉక్రెయిన్, EW ప్రభావితంగా రష్యా మీద వినియోగించింది. ఉక్రెయిన్ కి మొన్న మొన్నటి వరకూ పాశ్చాత్య దేశాల నుంచి నిరంతరాయం గా supplies వచ్చాయి. అందువల్ల ఉక్రెయిన్ డ్రోన్స్ తో saturation attacks, EW, western క్షిపణుల combination తో russian రాడర్లను ధ్వంసం చేయగలిగింది.
ఉక్రెయిన్ దగ్గర కూడా S 300 SAM, buk M1 లు ఉన్నాయి, పాశ్చాత్య ఆయుధాలు అయిన Patriot missile systems combination రష్యన్ airforce air superiority సాధించకుండా నిలువరించాయి. Russia కూడా పూర్తి airforce ని launch చేసి ఆర్థిక, సైనిక నష్టం దిశగా వెళ్ళడం లేదు. అందుకే artillery, డ్రోన్స్ లాంటి low cost దాడులే నిర్వహిస్తుంది. రష్యా వ్యూహం ఇలా కనిపిస్తుంది. ఆర్థికం గా ఎక్కువ నష్టం జరగకుండా, తక్కువ ఖర్చులో యుద్ధాన్ని సాగదీసి attrition warfare సాగించాలి అని.