Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మంచి నడవడికకు 9 సూత్రాలు.. అవేంటో తెలుసుకుందామా..?

Admin by Admin
February 24, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సమాజం అనేది భిన్నమతాలు, భాషలు, కులాలతో కూడిన మనుష్యుల సమూహం. ఏ ఒక్కరూ ఏకపక్షంగా, ఒంటరిగా జీవించలేరు. సంఘీభావంతో అనేకులతో కలసి జీవించాలి. నిత్యం మనకు ఎదురుపడే రకరకాల మనుష్యులను అర్థం చేసుకుని వారికి తగ్గటుగా ప్రవర్తించాలి. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుని నేర్పుతో జీవిస్తేనే గౌవరం సిద్ధిస్తుంది…. అని భర్తృహరి నీతిశతకం చెబుతుంది. మంచి నడవడికకు తొమ్మిది సూత్రాలను చెబుతారు. 1. స్వజనుల పట్ల దాక్షిణ్యభావం. 2. సేవకుల పట్ల దయాగుణం. 3. దుష్టుల పట్ల అప్రియభావం. 4. సాధువుల పట్ల ప్రీతి. 5. పండితుల పట్ల గౌరవం. 6. శత్రువుల పట్ల పరాక్రమం. 7. పెద్దల పట్ల సాహస భావం. 8. కోపతాపాలు ప్రదర్శించకూడదు. 9. స్త్రీల పట్ల దిట్టభావం… తప్పనిసరిగా కలిగివుండాలి.

స్వజనులు అంటే బంధువులు. బంధువులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కలసిమెలసి ఉండాలి. ఒకరు సమస్యల్లో ఉంటే మరొకరు సాయం చేయడానికి ముందుకు రావాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించాలి. సేవకులను బానిసలుగా భావించకూడదు. వారిశ్రమను దోపిడి చేయకూడదు. వారిపట్ల జాలి, దయ, కరుణ చూపాలి. చెడ్డవారితో స్నేహం పాము విషంతో సమానం. సాధువులు అంటే మతపెద్దలు. వీరిని గౌరవంగా చూడాలి. భక్తి వినయం వంటివి హృదయం నుంచి పుట్టుక రావాలి. మోక్షం పేరుతో నిరుపేదలకు దాన ధర్మాలు విరివిగా చేయాలి. ఆత్మశుద్ధికి ఉపకరించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాలి. రాజులయిన వారు రాజ్యం పట్ల నీతినిజాయితీలతో ప్రవర్తించాలి. రాజ్యం ప్రజలకు రక్షణ కల్పిస్తుంది.

everybody must follow these 9 rules

అజ్ఞానం అనే చీకటిని తరిమి జ్ఞానం అనే వెలుగును ఇచ్చేది పండితుడు. పండితుని ద్వారా భావిపౌరులు తయారయ్యి, దేశపరిస్థితులను నిర్దేశిస్తారు. ఇటువంటి పండితుని పట్ల సదా గౌరవాన్ని కలిగి ఉండాలి. దేశానికి హాని చేసే శత్రుమూకల్ని పరాక్రమంతో పారదోలాలి. జీవితానుభవాలను అనుభవించిన పెద్దలు చెప్పే మాటలను విశ్వసించాలి. తొందర‌పాటు, కోపతాపాలు ప్రదర్శించకూడదు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుష అహంకారంతో స్త్రీలపట్ల చులకన భావం ఉండకూడదు.

మంచిపుస్తకాలు చదవటం, క్రమశిక్షణతో మెలగటం, ప్రకృత్తి పట్ల ప్రేమ దానిని పరిరక్షించడం మొదలైనవి విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలి. మంచి నడవడిక వ్యక్తిత్వ వికాసానికి పునాది. మహత్కార్యలకు వరం. గౌరవానికి హేతువు. కీర్తికి మార్గం. కాబట్టి మనిషికి మంచి నడవడిక చాలా అవసరం. మంచి నడవడికతోనే పురుషులు పుణ్యపురుషులు అవుతారు.

Tags: rules
Previous Post

ఆహారం తినేట‌ప్పుడు ఎందుకు మాట్లాడ‌కూడ‌దంటారు..?

Next Post

బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు ఒక గ్లాస్ నీళ్ల‌ను తాగండి.. ఎందుకంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.