ఒక్కోసారి మనకు నచ్చనివి ఇతరులకు బాగా నచ్చవచ్చు. మనకు బాగా నచ్చినవి ఇతరులకు అస్సలు నచ్చకపోవచ్చు. మనుషుల ఆలోచనల బట్టి, వారు చూసే దృష్టిని బట్టి వారి ఇష్టాఇష్టాలు మారుతూ ఉంటాయి. చూసే వాడి దృష్టిని బట్టి వస్తువు రూపం మారుతుందని ఒక స్త్రీని ఉదాహరణగా చూపి ఈ విషయాన్ని వివరించారు చాణక్యుడు.
యోగి మనసు దైవం పైన లగ్నమై ఉంటుంది. ప్రాపంచిక విషయాల పైన అంతగా వారికి ఆసక్తి ఉండదు. స్త్రీని చూసినా వారిలో ఎలాంటి కోరిక పుట్టదు. అదే మోహంతో రగిలిపోయే వాడికి మాత్రం ఆమె భోగ వస్తువుగా కనిపిస్తుంది. కుక్కలు లాంటి జంతువులకు స్త్రీ, పురుష భేదం ఉండదు.
దాని ప్రధానమైన దృష్టి ఆకలి తీర్చుకోవటం వరకే పరిమితం అవుతుంది. వాటి దృష్టిలో ఆమె కేవలం మాంసం వద్ద మాత్రమే అని చాణక్య నీతిలో వివరించారు.