Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మనం తినే పండు చెట్టు మీద పండిందో..? లేక రసాయనాలతో పండిందో..? ఇలా చేసి గుర్తించొచ్చు!

Admin by Admin
June 24, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చెట్టు మీద పండిన పండ్ల‌నే తినాలి. ర‌సాయ‌నాలు వేసి పండించిన పండ్ల‌ను తిన‌రాదు. ఈ విష‌యం చాలా మందికి తెలుసు. అయిన‌ప్ప‌టికీ చాలా మందికి అస‌లు ఏది స‌హ‌జ‌సిద్ధంగా పండిందో, ఏది ర‌సాయ‌నాలు వేసి పండిన పండో తెలియ‌డం లేదు. వ్యాపారులు త‌మ లాభ‌మే ధ్యేయంగా య‌థేచ్ఛగా ర‌సాయ‌నాల‌ను వాడుతూ పండ్ల‌ను పండిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో వ‌స్తున్న మామిడి పండ్లే కాదు, యాపిల్‌, అర‌టి, అవ‌కాడో, నారింజ, బొప్పాయి, జామ‌, పైనాపిల్‌ వంటి అనేక పండ్ల‌ను ర‌సాయ‌నాలు వేసి కృత్రిమంగా పండిస్తున్నారు. దీంతోపాటు ట‌మాటాల వంటి కూర‌గాయ‌ల‌పై కూడా ర‌సాయ‌నాలు చ‌ల్లి పండించి వాటిని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అస‌లు వ్యాపారులు ఏయే ర‌సాయ‌నాల‌ను వాడి పండ్ల‌ను కృత్రిమంగా పండిస్తారో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి హాని క‌లుగుతుందో, ర‌సాయ‌నాల‌ను వాడి పండించిన పండ్ల‌ను ఎలా గుర్తు ప‌ట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లు లేదా కూర‌గాయ‌లు వేటినైనా కృత్రిమంగా పండించ‌డానికి నేడు చాలా మంది వాడుతున్న ర‌సాయ‌నాలు ఏవంటే… కాల్షియం కార్బైడ్‌, ఎథిలీన్‌, ఎథిపాన్‌లు ముఖ్య‌మైవ‌ని. వీటినే చాలా మంది వ్యాపారులు పండ్ల‌ను కృత్రిమంగా పండించేందుకు వాడుతున్నారు. వీటితో పండించిన పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి హాని క‌లుగుతుందంటే… ర‌సాయ‌నాలు వేసి పండించిన పండ్ల‌ను తింటే దాంతో వాటిలో ఉండే పోష‌కాలు మాయం అవుతాయి కాబ‌ట్టి, వాటిని తిన్నా మ‌నకు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. దీనికి తోడు విష ప‌దార్థాలు మ‌న శ‌రీరంలోకి వెళ్లి అనారోగ్యాల‌ను క‌లిగిస్తాయి. అవ‌న్నీ కార్సినోజెన్ల‌ను మన శ‌రీరంలోకి పంపుతాయి. దీంతో క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు వ‌స్తాయి.

how to identify naturally ripen fruits

ఇక అలాంటి కృత్రిమ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఇంకా ఏం జ‌రుగుతుందంటే… వాంతులు, విరేచ‌నాలు, డ‌యేరియా స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. చ‌ర్మంపై దుర‌ద‌లు, ద‌ద్దుర్లు వ‌స్తాయి. దృష్టి స‌రిగ్గా ఉండ‌దు. చూపు మంద‌గిస్తుంది. విప‌రీత‌మైన దాహం వేస్తుంది. నోరు, ముక్కు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. ద‌గ్గు, జ‌లుబు, శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. పేగుల్లో అల్స‌ర్ వ‌స్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. త‌ల‌నొప్పి, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుద‌ల‌, మ‌బ్బుగా ఉండ‌డం, నిద్ర‌లేమి, ఫిట్స్ కూడా రావ‌చ్చు. ఇక కొన్ని సంద‌ర్భాల్లో అయితే బీపీ పెరుగుతుంది. దీంతోపాటు చేతులు, కాళ్లు స్ప‌ర్శ‌ను కూడా కోల్పోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అదే గ‌ర్భిణీల‌కు అయితే క‌డుపులో ఉండే బిడ్డ‌కు హాని క‌లుగుతుంది. బిడ్డ స‌రిగ్గా ఎద‌గ‌దు.

కృత్రిమంగా పండించిన పండ్ల‌న్నీ దాదాపుగా ఒకే రంగులో ఉంటాయి. రంగుల్లో ఎలాంటి తేడా క‌నిపించ‌దు. అదే స‌హ‌జ సిద్ధంగా పండిన‌వైతే రంగుల్లో తేడా ఉంటుంది. అన్ని పండ్లు ఒకే రంగులో ఉండ‌వు. ఒకే జాతి అయిన‌ప్ప‌టికీ వేర్వేరు రంగుల్లో ఉంటాయి. కృత్రిమంగా పండించిన పండ్లపై బూడిద రంగులో ప్యాచ్‌లు ద‌ర్శ‌న‌మిస్తాయి. బాగా ప‌రిశీలించి చూస్తే తెలుస్తుంది. అర‌టి పండు తొడిమ గ్రీన్ క‌ల‌ర్‌లో ఉండి పండు ప‌సుపు రంగులో ఉంటే వాటిని కృత్రిమంగా పండించిన‌విగా తెలుసుకోవాలి. స‌హ‌జ సిద్ధంగా పండిన‌వి అయితే తొడిమ కూడా ప‌సుపు రంగులోనే ఉంటుంది. స‌హ‌జ సిద్ధంగా పండిన కూర‌గాయ‌లు, పండ్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ కృత్రిమంగా పండిన‌వి మాత్రం మెరుపులు మెరుస్తాయి. క‌ళ్ల‌కు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. సీజ‌న్ ఆరంభానికి ముందే మార్కెట్‌లోకి వ‌చ్చే పండ్ల‌ను కొన‌రాదు. వాటిని క‌చ్చితంగా కృత్రిమంగానే పండిస్తారు. కృత్రిమంగా పండిన పండ్లు మెత్త‌గా, మృదువుగా ఉంటాయి. స‌హ‌జ సిద్ధంగా పండినవి కొంచెం గ‌ట్టిద‌నం క‌లిగి ఉంటాయి.

అస‌లు ఇలా కృత్రిమంగా పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను పండించ‌డాన్ని అనేక దేశాలు నిషేధించాయి. మ‌న దేశంలోనూ ఇలా చేయ‌డం పై నిషేధం ఉంది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్యాపారులు లాభాపేక్ష‌తో అలా పండ్ల‌ను పండిస్తూ జ‌నాల ఆరోగ్యాల‌తో ఆటాడుకుంటున్నారు. ఇలాంటి నేరాల‌ను అదుపు చేసేందుకు ప్ర‌త్యేక విజిలెన్స్ ఉన్నా అంత బ‌లోపేతంగా ఆ శాఖ ఉన్న‌ట్టు కనిపించ‌డం లేదు. దీంతో వ్యాపారుల ఆగ‌డాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా మీరు మాత్రం ఏవైనా పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను కొనే ముందు ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకుని మ‌రీ వాటిని కొనండి. లేదంటే తెలుసు క‌దా, అనారోగ్యాల బారిన ప‌డతారు.

Tags: fruits
Previous Post

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో పాప్ కార్న్ ల‌ను విక్రయిస్తూ ప్రేక్ష‌కుల నుంచి డ‌బ్బులు ఎలా దోపిడీ చేస్తున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

Next Post

ప్ర‌జా ప్ర‌తినిధులంటే ప‌బ్లిక్ సర్వెంట్ల‌ని చాటి చెప్పిన గొప్ప నాయ‌కుడు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.