ఏదైనా మంచి సువాసనను పీలిస్తే ఎలా ఉంటుంది..? ఎవరికైనా మనస్సుకు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. రిలాక్సేషన్ కలుగుతుంది. దీంతోపాటు మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది. అయితే ఇలా ఆయా సువాసనలను పీల్చడం ద్వారా మనకు కలిగే రుగ్మతలను తగ్గించుకునే విధానాన్ని అరోమాథెరపీ అంటారు. అంటే సువాసనలతో వ్యాధులను నయం చేయడం అన్నమాట. చాలా మంది ప్రకృతి వైద్యులు తమ వద్దకు వచ్చే రోగుల వ్యాధులను నయం చేయడం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు. అయితే మీకు తెలుసా..? ఈ అరోమా థెరపీ వల్ల నిజంగానే మనకు ఎంతో ప్రశాంతత కలుగుతుందని. అవును, మీరు విన్నది నిజమే. ఈ క్రమంలో మనం నిత్యం వంటకాల్లో ఉపయోగించే ఓ ఆకును కాల్చడం వల్ల వచ్చే పొగను పీలిస్తే కూడా మనస్సుకు రిలాక్సేషన్ అవుతుందట. అదేంటంటే…
బిర్యానీ ఆకు… బిర్యానీ, భగారా రైస్‌లను తినే వారికి ఈ పేరు చిరపరిచితమే. దీన్ని ఇంగ్లిష్‌లో Bay Leaf అని, హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు. దీన్ని వేయడం వల్ల బిర్యానీకి, రైస్‌కు మంచి వాసన వస్తుంది. దాంతో మన నోట్లో నీళ్లూరుతాయి. అయితే తిండికి మంచి రుచిని అందించడమే కాదు, ఈ ఆకు వల్ల పైన చెప్పిన విధంగా మనకు అరోమా థెరపీ కూడా ఉపయోగపడుతుంది. అదెలాగంటే…
రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాల్చండి. దీంతో వాటి నుంచి పొగ వస్తుంది. ఈ సమయంలో గది నుంచి బయటికి వెళ్లి తలుపులు పెట్టేయండి. అలా ఒక 10 నిమిషాల పాటు అలాగే తలుపులను బంధించి ఉంచండి. దీంతో ఆ పొగ అంతా రూమ్‌లో వ్యాపిస్తుంది. అనంతరం రూమ్‌లోకి వెళ్లి చూడండి. చక్కని వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చండి. దీంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు గది అంతా సువాసనా భరితంగా ఉంటుంది. దోమల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి.