ఈ అక్టోబ‌ర్‌లో యుగాంతం కానుందా..? నోస్ట్రడామ‌స్ ఏం చెప్పారు..?

ఫ్రెంచ్ తత్వవేత్త మరియు ప్రవక్త నోస్ట్రాడమస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న భవిష్యవాణి ఇప్పటి వరకు ఎన్నోసార్లు రుజువైంది. 1666లో లండన్‌లో జరిగిన గ్రేట్ ఫైర్, 9/11 టెర్రర్ దాడులు, 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, కోవిడ్ మహమ్మారి కారణంగా క్వీన్ ఎలిజబెత్ మరణం ఇలా ఎన్నింటినో నోస్ట్రాడ‌మ‌స్ అంచ‌నా వేశారు. అత‌ను చెప్పిన‌ట్టుగానే అన్నీ జ‌రిగాయి. అయితే ఆయ‌న 2024 సంవ‌త్స‌రంలో జ‌రిగే కొన్ని భ‌యంక‌ర‌మైన ప్ర‌మాదాల గురించి కూడా ముందే చెప్పారు. ప్రపంచం రానున్న రోజుల‌లో యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు మరియు సామాజిక అశాంతి వంటి సమస్యలను ఎదుర్కొంటుందని ఆయన సూచించారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలను బట్టి, అతని అంచనా నిజ‌మైన‌దిగా భావిస్తున్నారు.

నోస్ట్రాడమస్ రాజకీయ అస్థిరతను ముందే ఊహించాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అధికార మార్పిడి, రాజకీయ అశాంతి ఏర్పడవచ్చని ఆయన సూచించారు. రానున్న రోజుల‌లో జ‌ర‌గ‌నున్న యూఎస్ ఎన్నికలలో నాయకత్వంలో మార్పుకు దారితీయవచ్చు. దీని వ‌ల‌న ఇత‌ర దేశాల‌పై కూడా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. ఇక వాతావరణ మార్పులు, వాటి పర్యవసానాల గురించి నోస్ట్రాడమస్ హెచ్చరించాడు. అక్టోబర్ 2024లో వాతావరణ మార్పుల వల్ల సంభవించే తుఫానులు, భూకంపాలు మరియు ఇతర విపత్తుల ని ప్ర‌పంచం ఫేస్ చేయాల్సి వ‌స్తుంద‌ని కూడా చెప్పాడు. ఈ హెచ్చరికలతో పాటు, నోస్ట్రాడమస్ ఆరోగ్య సంక్షోభాలను పేర్కొన్నాడు. అక్టోబరు 2024లో ఆరోగ్య సంబంధిత స‌మ‌స్య‌లు ఉత్న‌న్న‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.

what nostradamus told what will happen

ప్ర‌జ‌లు త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాల‌ని అన్నారు. 1555లో ఫ్రెంచ్ తత్వవేత్త, నోస్ట్రాడమస్ తన పుస్తకం లే ప్రొఫెటిస్ లో అనేక అంచనాలు వేశారు. ఈ పుస్తకం 942 కవితల సంకలనంగా ఉంది. దాని ద్వారా భవిష్యత్తులో జరగబోయే వివిధ సంఘటనలను అతను ముందే చెప్పాడు. 1666లో జరిగిన గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ నుండి, 9/11 ఉగ్రవాద దాడి, 2016లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వరకు, ఆయన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచాన్ని వణికించిన ప్రాణాంతక వైరస్ కరోనా దాడిని 500 సంవత్సరాల క్రితం ప్రవక్త నోస్ట్రాడమస్ కూడా రాశారు.